MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Career Guidance
  • Google : పని చేయడానికి కాదు... చేయకుండా ఉండేందుకు గూగుల్ ఉద్యోగులకు లక్షలకు లక్షల సాలరీ

Google : పని చేయడానికి కాదు... చేయకుండా ఉండేందుకు గూగుల్ ఉద్యోగులకు లక్షలకు లక్షల సాలరీ

ఏ కంపనీ అయినా ఉద్యోగులతో బాగా పనిచేయించుకునేందుకు ప్రయత్నిస్తాయి. జీతం ఎంత తక్కువయితే అంత తక్కువ ఇచ్చి పనిమాత్రం ఎంత ఎక్కువయితే అంత ఎక్కువ చేయించుకుంటాయి. కానీ ప్రస్తుతం గూగుల్ కొందరు ఉద్యోగులకు పని చేయకుండా ఉండేందుకు భారీగా సాలరీ ఇస్తోందట. టెక్ దిగ్గజం ఇలా ఎందుకు చేస్తుందో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 09 2025, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Google

Google

Google : కార్పోరేట్ కంపనీలు ఉద్యోగుల నుండి వీలైనంత ఎక్కువ పనిని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. వర్క్ లోడ్ ఎక్కువయి చాలామంది ఉద్యోగులు డిప్రెషన్ కు గురవుతుంటారు. కానీ కార్పోరేట్ దిగ్గజం గూగుల్ మాత్రం పని చేయడానికి కాదు... పని చేయకుండా ఉండేందుకు కొందరు ఉద్యోగులకు లక్షల సాలరీలు చెల్లిస్తోంది. ఇలా ఒకటి రెండు నెలలు కాదు కొందరికి ఏడాదిపాటు పనిచేయకుండా పక్కన పెడుతోందట. గూగుల్ ఇలా చేయడంవెనక పెద్ద కారణమే ఉంది.  

టెక్ దిగ్గజాలు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంటపడ్డాయి. ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అద్భుతాలను సృష్టిస్తున్నాయి. గూగుల్ కూడా ఇదే చేస్తోంది... ఇప్పటికే అత్యంత అధునాతన ఏఐ టెక్నాలజీతో జెమిని 2.5 ప్రో ను తీసుకువచ్చింది. ఇది ఏఐ రేసులో గూగుల్ ను ముందువరుసలో నిలిపింది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆధిపత్యం ప్రదర్శించేందుకే గూగుల్ ఉద్యోగులను పని చేయకుండా ఉండేలా ఒప్పందాలు చేసుకుంటోంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Garder Leave

Garder Leave

గూగుల్ ఉద్యోగులకు 'గార్డెన్ లీవ్స్'... అంటే ఏమిటో తెలుసా?  

ప్రస్తుత టెక్ జమానాలో మంచి ప్రతిభ కలిగిన ఉద్యోగులను భారీ సాలరీలు ఇచ్చి అపాయింట్ చేసుకుంటున్నాయి కంపనీలు. వీరి సాయంతో టెక్ రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. అయితే తమ సంస్థలోని ప్రతిభావంతులు బయటకు వెళితే ప్రత్యర్థి కంపనీల పోటీలోకి వస్తాయి. అలాకాకుండా ఉద్యోగులు పని చేయకున్నా మంచి సాలరీ ఇచ్చి కొంతకాలం ఎక్కడా పనిచేయకుండా ఆపుతుంటాయి కొన్ని సంస్థలు.  వీటిని 'గార్డెన్ లీవ్' అంటారు. ఇప్పుడు గూగుల్ ఇదే చేస్తోంది. 

బ్రిటీష్ అమెరికన్ సంస్థ గూగుల్ డీప్ మైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పరిశోధనలు చేస్తుంటుంది.  బ్రిటన్ కు చెందిన కంపనీని గూగుల్ కొనుగోలు చేసింది... దీని ప్రధాన కార్యాలయం లండన్ లో ఉంది. యూఎస్ తో పాటు కెనడా, జర్మనీ, ప్రాన్స్, స్విట్జర్లాండ్ లో కూడా పరిశోధనా కేంద్రాలున్నాయి.  ఈ సంస్థలో 2000 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

అయితే ఈ సంస్థ ఏఐపై చేస్తున్న ప్రయోగాల గురించి ప్రత్యర్థి కంపనీలకు తెలియకుండా జాగ్రత్త పడుతోందట. అందుకే ఎవరైనా ఉద్యోగులు రాజీనామా చేసినా బయటి కంపనీలకు వెళ్లకుండా జాగ్రత్త పడుతోందట. ఇందుకోసం ముందే ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. పని చేయకున్నా సరే ఉద్యోగులకు భారీగా జీతాలిస్లోంది.... ఇలా ఒకటిరెండు నెలలు కాదు ఒక్కొక్కరికి ఏడాదిపాటు 'గార్డెన్ లీవ్'లో కొనసాగిస్తోందని బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపింది. 

ఇలా గూగుల్ డీప్ మైండ్ ఏఐ టెక్నాలజీని డెవలప్ చేయడంలో, జెమిని ప్రాజెక్టులో పనిచేసిన సీనియర్ పరిశోధకులకు ఇలా 'గార్డెన్ లీవ్ లో ఉంచుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి జీతం పొందుతున్నప్పటికీ వారికి ఎలాంటి పని ఉండదు... అలాగని వేరే కంపనీకి వెళ్లే అవకాశం ఉండదు. ఒప్పందం ప్రకారం ఎన్ని నెలలైనా అలాగే ఉండాలన్నమాట.  

33
Google DeepMind

Google DeepMind

డీప్‌మైండ్ ఉద్యోగుల వ్యవహారంపై గూగుల్ ఏమంటోందంటే... 

డీప్‌మైండ్ మాజీ డైరెక్టర్, మైక్రోసాఫ్ట్ ఏఐ వైస్ ప్రెసిడెంట్ నాండో డి ఫ్రీటాస్ సోషల్ మీడియాలో ఈ గార్డెన్ లీవ్స్ వ్యవహారాన్ని బైటపెట్టారు. ఈ నిర్బంధ ఒప్పందాల నుండి బయటపడటానికి మార్గాలను అభ్యర్థిస్తూ అనేక మంది ఉద్యోగులు తనను సంప్రదించారని అతడు తెలిపాడు. ఈ ఒప్పందాలను ఫ్రిటాస్ తీవ్రంగా విమర్శించాడు. వాటిని అధికార దుర్వినియోగం అని ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా యూరప్‌లో పనిచేస్తున్న అమెరికన్ కంపెనీలతో వ్యవహరించేటప్పుడు ఇలాంటి ఒప్పందాలపై సంతకం చేయవద్దని నిపుణులను కోరారు.

దీనికి ప్రతిస్పందనగా గూగుల్ తన విధానాన్ని సమర్థించుకుంది... ఉద్యోగ నిబంధనలు పరిశ్రమ పద్ధతులకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది. అయితే ఈ వివాదం కార్పొరేట్ నియంత్రణ, ఉద్యోగుల హక్కులు, కృత్రిమ మేధస్సు యొక్క తీవ్రమైన పోటీ ప్రపంచంలో నైతిక నియామక పద్ధతుల గురించి చర్చకు దారితీసింది. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రపంచం
ఉద్యోగాలు, కెరీర్
సాంకేతిక వార్తలు చిట్కాలు
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో సంద‌డి చేసిన హ్యుమ‌నాయిడ్ రోబోట్‌.. ఘ‌నంగా ఏఐ ఎడ్యుకేష‌న్ స‌మ్మిట్
Recommended image2
రూ.40 వేల స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్.. విద్యార్థులకు ఎన్‌హెచ్‌ఏఐ బంపర్ ఆఫర్
Recommended image3
Business Ideas : ఉద్యోగం చేస్తూనే ఈ సైడ్ బిజినెస్ చేశారో.. నెలనెలా వేలల్లో ఎక్ట్రా ఇన్కమ్ పక్కా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved