తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ త్వరలోనే భారత్ లో పర్యటించనున్నారు. ఉక్రెయిన్ లో రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకారం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:54 PM (IST) Apr 20
MI vs CSK IPL 2025: ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నా ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఓటములు ఆగడం లేదు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కేపై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లు అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టారు.
11:21 PM (IST) Apr 20
Chanakya Neeti: ఆచార్య చాణక్య భారతదేశపు గొప్ప పండితుల్లో ఒకరు. ఆయన నీతులు ఈ కాలంలో కూడా ఆచరించడానికి సరైనవి. వాటిని పాటించడం ద్వారా జీవితం సాఫీగా సాగుతుంది. ఆయన చెప్పిన నీతి పాఠాల్లో ఏడుమంది మాత్రం నిద్రపోతుంటే వెంటనే లేపాలని చెప్పారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
11:15 PM (IST) Apr 20
Ayush Mhatre's Explosive IPL Debut: 17 ఏళ్ల ఆయుష్ మాత్రే చెన్నై సూపర్ కింగ్స్ తరపున సంచలనాత్మక ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే దుమ్మురేపే ప్రదర్శనతో రికార్డులను బద్దలు కొట్టాడు. సంచలన బ్యాటింగ్ తో అందరినీ అకట్టుకున్నాడు. అసలు ఎవరీ ఆయుష్ మాత్రే? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
11:12 PM (IST) Apr 20
Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌బాబు సినిమాలు ప్రత్యేకంగా ఉంటుంటాయి. యూత్ మెచ్చే కామెడీ సినిమాలు చేస్తుంటాడు. హృదయకాలెయం సినిమాతో తెలుగు సినిమాల్లో అరంగేట్రం చేసి మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాలకు కొంత గ్యాప్ వచ్చింది. అయితే.. త్వరలో ''సోదరా'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సంపూ.. ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలతోపాటు, తాను సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చాడు.
10:47 PM (IST) Apr 20
ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే ఇండియాలోని యువత వారానికి కనీసం 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల చెప్పారు. అయితే, ఆయన చెప్పినదానికి పలువురు మద్దతు తెలుపగా.. మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ప్రముఖ సంస్థ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ సైతం మరో అడుగు ముందుకేసి వారానికి 90 గంటలు పనిచేయాలన్నారు. అంతేకాదండోయ్ ..! ఎంత కాలం భార్యలను చూస్తూ కూర్చుంటారు? అని ప్రశ్నించారు. దీనిపై ఓ టెక్కీ తన బాధను పంచుకున్నాడు. మీరు చెప్పినట్లు చేస్తే అందరికీ తనకు పట్టిన గతే పడుతోందని, వారు చెప్పినట్లుగా చేసినందుకే నా భార్య నన్ను విడాకులు కోరుతోందని ఓ టెక్కీ పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా అతనికి ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.
10:24 PM (IST) Apr 20
Sunflowers History: మనందరికీ పొద్దుతిరుగుడు పువ్వు, మొక్కల గురించి తెలిసే ఉంటుంది. సూర్యుడి పొద్దు ఎటు తిరిగితే ఆ పువ్వు కూడా అటువైపే తిరుగుతుంది. ఈ పువ్వు నుంచే మనం వంటల్లో వాడే సన్ ఫ్లవర్ ఆయిల్‌ను తయారు చేస్తుంటారు. అయితే.. ఈ పొద్దుతిరుగుడు పువ్వు పేరులో ఉన్నట్లు సూర్యుడి పొద్దు ఎటువైపు ఉంటే అటువైపు ఆ మొక్క, పువ్వు తిరుగుతాయి. అసలు అవి ఎందుకు అలా ప్రవర్తిస్తాయో తెలుసా? సైన్స్, గ్రీకు కథ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
10:19 PM (IST) Apr 20
RCB vs PBKS IPL 2025 : ఐపీఎల్ 2025 లో 37వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. 158 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 7 బంతులు మిగిలి ఉండగానే అందుకోవడంలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నాక్ కీలకపాత్ర పోషించింది.
పూర్తి కథనం చదవండి09:41 PM (IST) Apr 20
Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ నెల 23న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పేశారు. ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ పరీక్షలకు 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఆంగ్ల మీడియం నుంచి 5.64 లక్షల మంది... తెలుగు మీడియం వారు 51069 మంది పరీక్షలు రాశారు. మార్చి17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత వెంటనే మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించారు.
09:38 PM (IST) Apr 20
Ayush Mhatre: ఐపీఎల్‌లో యంగ్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఈ జాబితాలో మరో తుఫాను బ్యాట్స్‌మన్ చేరిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారిగా అతి పిన్న వయస్కుడైన ఆటగాడికి అరంగేట్రం అవకాశం ఇచ్చింది. అతనే ఆయూష్ మత్రే.
పూర్తి కథనం చదవండి09:23 PM (IST) Apr 20
Janhvi Kapoor: మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ రావడం సహజంగా జరిగేదే. దీని గురించి పురుషులందరికీ తెలుసు. అయితే.. మహిళలు నెలసరి సమయంలో పడేనొప్పిని కొందరు మగాళ్లు వెటకారం చేయడం, మహిళల ప్రవర్తన, మాటలను అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రముఖ నటి జాన్వీ కపూర్ మండిపడుతున్నారు. ఇటీవల పీరియడ్స్ అంశంపై అనేక మంది హీరోయిన్లు బహిరంగంగా మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా సమంతా కూడా ఈ అంశం గురించి ప్రస్తావించింది. వారేమంటున్నారంటే..
08:59 PM (IST) Apr 20
మన జీవితంలో సాధారణంగా చేసే చిన్న పొరపాట్లే మన అభివృద్ధికి ఆటంకాలుగా మారతాయి. వాటిని గుర్తించి మార్చుకోగలిగితే అనవసరమైన చిక్కులు, కష్టాల నుంచి బయటపడతాం. జీవితంలో ఏ నిర్ణయమైనా ఈజీగా తీసుకోగలుగుతాం. ఇక్కడ తెలిపిన అలవాట్లు మీకు ఉంటే వెంటనే మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవితాన్ని ఆనందంగా గడపండి.
పూర్తి కథనం చదవండి07:52 PM (IST) Apr 20
PBKS vs RCB IPL 2025: విరాట్ కోహ్లీ సూపర్ నాక్ తో ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈజీగానే విక్టరీ అందుకుంది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఛేజింగ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ తో పంజాబ్ ను వారి హోం గ్రౌండ్ లో ఓడించారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలు కొట్టాడు.
06:55 PM (IST) Apr 20
ms dhoni sixer records: ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్ లకు కెప్టెన్సీ వహించిన ప్లేయర్ ఎంఎస్ ధోని. అలాగే, ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్. ఐదు సార్లు చెన్నై సూపర్ కింగ్ (సీఎస్కే) ను చాంపియన్ గా నిలబెట్టాడు. ముంబై తో జరిగే మ్యాచ్ లో ధోని మరో సూపర్ రికార్డు సాధించనున్నాడు.
06:29 PM (IST) Apr 20
మమతా కులకర్ణి పుట్టినరోజు: నటి నుండి జోగినిగా మారిన మమతా కులకర్ణికి 53 ఏళ్ళు నిండాయి. ధర్మేంద్ర కుమారుడు బాబీ దేఓల్, మమతకు ఒక రాత్రి గడపమని ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండి06:18 PM (IST) Apr 20
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. సుధీర్గంగా నలభై ఏళ్లుపాటు రాజకీయాల్లో ఉన్న నాయకుడిగా.. నాలుగు సార్లు సీఎంగా పనిచేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబుకు మంచి అడ్మినిస్ట్రేటర్ అని పేరుంది, పాలన అందించే విషయంలో ఆయనకు మన, తన భేదాలు ఉండవు.. ఎమెషన్స్ ఉండవ్.. తప్పు చేస్తే ఎవరినైనా, ఎంతటివారినైనా ఎదిరిస్తారు, శిక్షిస్తారు అని అనేక సందర్భాల్లో రుజువైంది. ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికీ అదే ఎనర్జీతో మాట్లాడుతుంటారు.. పనిచేస్తుంటారు.. జూ.ఎన్టీఆర్ ఓ సినిమాలో చెప్పినట్లు అదోరేర్ పీస్ అన్నమాట. ఇక ఏప్రిల్ 20 ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ మొదలుకుని పవన్ కల్యాణ్, రేవంత్ రెడ్డి, కేసీఆర్, తదితర కీలకనేతలు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. వారేమన్నారో ఇప్పుడు చూద్దాం.. అంతేకాకుండా పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన ఎక్కడ ఉన్నారంటే..
05:44 PM (IST) Apr 20
Top 5 Smartphones: మీరు స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపు అయితే టాప్ 5 స్మార్ట్ ఫోన్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. బ్యాటరీ, ప్రాసెసర్, కెమెరా పనితీరు, ఇతర స్పెషల్ ఫీచర్లు ఏ ఫోన్లలో బెస్ట్ గా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి05:41 PM (IST) Apr 20
Google CEO Sundar Pichai praise Vaibhav Suryavanshi: రాజస్థాన్ జట్టుకి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగి ప్రత్యర్థి జట్టుని భయపెట్టిన వైభవ్ సూర్యవంశీ పై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రశంసలు కురిపించాడు. తన ఆటను చూసేందుకు ప్రత్యేకంగా నిద్రలేచానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించాడు.
పూర్తి కథనం చదవండి05:38 PM (IST) Apr 20
Tamannaah: మిల్లీబ్యూటీ తమన్నా భాటియా ఇటీవల ఓదెల 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. సినిమా విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసినా.. రిలీజైన తర్వాత అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ తమన్నా నటను మాత్రం అందరూ మొచ్చుకుంటున్నారు.. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్బంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్‌లు లేని సమయంలో, ఒంటరిగా ఖాళీగా ఉన్న టైంలో ఏమేమి పనులు చేస్తుందో చెపుకొచ్చింది.
04:48 PM (IST) Apr 20
Betting App: సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవారికి బుల్లితెర సెలబ్రిటీ ఉప్పల్ బాలు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. టిక్‌టాక్ వీడియోల నుంచి ఫేమస్ అయిన బాలు.. తన డ్యాన్స్ మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ.. నవ్వులు పూయిస్తుంటాడు. ఇప్పటికే అనేక యూట్యూబ్ ఛానల్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. రీసెంట్‌గా బాలు మాట్లాడుతూ.. తన కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. దీంతోపాటు బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రమోట్ చేయలేదో చెప్పుకొచ్చారు... తన చెప్పింది విన్న తర్వాత ఉప్పల్ బాలు మీద అందరికీ రెస్పెక్ట్ పెరిగిపోయింది.
04:41 PM (IST) Apr 20
Shubman Gill fined: అహ్మదాబాద్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా విధించారు. ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్ సీజన్‌లో 5వ విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
పూర్తి కథనం చదవండి04:20 PM (IST) Apr 20
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. దేశాన్ని వదిలి భారత్ లో ఆశ్రయం పొందినప్పటికీ బంగ్లా ప్రభుత్వం ఆమెపై దాడులు కొనసాగిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌లో ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన యూనస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం హసీనా, మాజీ మంత్రులు, అధికారులు కలిపి 12 మందిపై అరెస్ట్ వారెంట్‌లను జారీ చేసింది.
పూర్తి కథనం చదవండి04:02 PM (IST) Apr 20
Weather Telangana Rains: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో గత వారం రోజుల నుంచి పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తీవ్రమైన ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
03:57 PM (IST) Apr 20
జ్యోతిష్య శాస్త్రంలో న్యూమరాలజీ ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనం పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలాంటిదో అంచనా వేస్తుంటారు. భవిష్యత్తులో జీవితంలో జరిగే విశేషాలను పుట్టిన తేదీ ఆధారంగా చెబుతుంటారు. మన జన్మ తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్ ని నిర్ణయిస్తారు. 3 రాడిక్స్ నెంబర్స్‌లో జన్మించిన వారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
03:39 PM (IST) Apr 20
బిగ్ బాస్ ప్రముఖులైన అమీర్ - పావని రెడ్డి జంట వివాహం నేడు ఘనంగా జరిగింది. వారి వివాహ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి02:50 PM (IST) Apr 20
తిరువనంతపురం దక్షిణ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను ప్రస్తావించారు. బీజేపీ నాయకులను కాదు, ప్రజాసేవకులను తయారు చేయడంపై దృష్టి సారించిందని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
పూర్తి కథనం చదవండి02:45 PM (IST) Apr 20
సినీనటి మాళవిక మోహనన్ దక్షిణాది సినిమా పరిశ్రమ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. హీరోయిన్ ని అసభ్యంగా చూపించే ప్రయత్నం చేస్తారు అని మాళవిక ఆవేదన వ్యక్తం చేసింది. మరి మాళవిక ఏం చెప్పారో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి02:04 PM (IST) Apr 20
భారీ షాపింగ్ మాల్స్ కి పెట్టింది పేరు లూలూ గ్రూప్. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో లూలూ గ్రూప్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ను నిర్మించిన విషయం తెలిసిందే. మన దేశంలో కూడా ఈ గ్రూప్ ఆధ్వర్యంలో చాలా నగరాల్లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అయితే తాజాగా భారత దేశంలో మరో భారీ షాపింగ్ మాల్ ఏర్పాటుకు లూలు గ్రూప్ సిద్ధమైంది. ఏకంగా రూ. 3000 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. దేశంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ గా చెప్పుకుంటున్న ఆ మాల్ ఏ నగరంలో రానుంది.? దాని విశేషాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి01:36 PM (IST) Apr 20
కొంతకాలంగా సమంత.. రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కూడా కనిపించారు.
పూర్తి కథనం చదవండి01:22 PM (IST) Apr 20
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగల ఎదురుచూపులు ఫలిచాయి. ఎట్టకేలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 19వ తేదీ అర్థరాత్రి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించారు. ఈ విషయాన్ని మంత్రి లోకేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అభ్యర్థులకు ఆల్‌దిబెస్ట్ చెప్పారు.
పూర్తి కథనం చదవండి01:22 PM (IST) Apr 20
Top 5 youngest players to debut in IPL history: ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ ఘనత సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల 23 రోజుల వయస్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కులైన టాప్-5 ప్లేయర్లు ఎవరో మీకు తెలుసా?
12:46 PM (IST) Apr 20
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 16,347 టీచర్ పోస్టులను ఇందులో భర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ఎలాంటి సమస్యలు లేకుండా సమర్థవంతంగా పోస్టుల భర్తీ ప్రక్రియను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన మంత్రి లోకేష్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరి డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
12:09 PM (IST) Apr 20
ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల మంది ప్రజలు విషపూరిత లోహాలతో కలుషితమైన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సుమారు 14 నుండి 17 శాతం వ్యవసాయ భూములు భద్రతా పరిమితులను అధిగమించాయి, ఇది ఆహార భద్రతతో పాటు ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పూర్తి కథనం చదవండి11:07 AM (IST) Apr 20
సేవింగ్స్ బ్యాంక్ ఖాతా (Savings Bank Account) అనేది మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడమే కాకుండా, దానిపై వడ్డీని కూడా పొందే మార్గం. కానీ సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బు ఉంచవచ్చు, దాని నియమాలు ఏమిటో మీకు తెలుసా? ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలు చెబుతోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
09:35 AM (IST) Apr 20
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ రెండు ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పోస్టుల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీని విడుదల చేసింది. ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా ఉద్యోగాల భర్తీని పెద్ద ఎత్తున చేపడుతోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే తాజాగా ఆర్టీసీలో పోస్టుల భర్తీ చేపట్టేందుకు చర్యలు చేపట్టింది..
09:32 AM (IST) Apr 20
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందులపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ హిందూ నేత భాబేష్ చంద్ర రాయ్‌ను అతివాద ముస్లింలు కొందరు కొట్టి చంపారు. దీనిపై భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం దీన్ని తీవ్రంగా ఖండించింది. ఆ దేశానికి వెళ్లవద్దంటూ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది.
పూర్తి కథనం చదవండి09:15 AM (IST) Apr 20
రోహిత్ శర్మ తనయుడి తొలి ఫోటో : క్రికెటర్ రోహిత్ శర్మ కూతురు ఫొటోల్ని జనం చాలాసార్లు చూసే ఉంటారు. ఆ అమ్మాయి మ్యాచ్ అనంతరం చాలాసార్లు మైదానంలో కూడా కనిపించింది. కానీ రోహిత్-రితికాల కొడుకు అహాన్ ఫొటో ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పుడు రోహిత్ శర్మ స్వయంగా తన కొడుకు అహాన్ ని స్వయంగా మీడియాకు చూపించారు. అందులో అహాన్ ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అభిమానుు అహాన్‌ను జూనియర్ హిట్‌మ్యాన్ అని కామెంట్ చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి