MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • జీవితాలను కష్టంగా మార్చే 5 అలవాట్లు ఇవే. మార్చుకుంటే ఆనందం మీ సొంతం

జీవితాలను కష్టంగా మార్చే 5 అలవాట్లు ఇవే. మార్చుకుంటే ఆనందం మీ సొంతం

మన జీవితంలో సాధారణంగా చేసే చిన్న పొరపాట్లే మన అభివృద్ధికి ఆటంకాలుగా మారతాయి. వాటిని గుర్తించి మార్చుకోగలిగితే అనవసరమైన చిక్కులు, కష్టాల నుంచి బయటపడతాం. జీవితంలో ఏ నిర్ణయమైనా ఈజీగా తీసుకోగలుగుతాం. ఇక్కడ తెలిపిన అలవాట్లు మీకు ఉంటే వెంటనే మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవితాన్ని ఆనందంగా గడపండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 20 2025, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నిర్ణయం తీసుకోవడానికి అతిగా ఆలోచించడం

మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారా? ఇది తీసుకుంటే ఏమవుతుందో? అది తీసుకుంటే ఏం జరుగుతుందో అంటూ అనుమానించడం వల్ల మానసిక ఒత్తిడి తప్ప ఫలితం ఉండదు. దీని వల్ల మీరు నిర్ణయం కూడా చాలా ఆలస్యంగా తీసుకుంటారు. దీని వల్ల పనులు ఫెయిల్ కూడా కావచ్చు. అతిగా ఆలోచించడం, అనుమానించడం ఒత్తిడిని సృష్టిస్తాయి. మనల్ని నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంచుతాయి. ఏ విషయంపై నిర్ణయం తీసుకోవాలన్నా వేగంగా ఆలోచించి లేట్ చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడటం

మీరు ఏదైనా నిర్ణయం తీసుకొనేటప్పుడు ఇతరుల అభిప్రాయాలను అడుగుతున్నారా? దీని వల్ల మీ జీవితం కన్ఫూజన్ గా మారుతుంది. ఎందుకంటే ఎవరికి నచ్చిన అభిప్రాయాలు వారు చెబుతారు. వారి ఆలోచనలకు తగ్గట్టుగా మీరు పనులు చేస్తే అవి ఫెయిల్ అయితే ఫలితం మీరే అనుభవించాల్సి ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీ సొంత నిర్ణయాలకే ప్రాధాన్యమివ్వాలి. మీ నిర్ణయం వల్ల కష్టమైనా, నష్టమైనా మీకు మానసిక ప్రశాంతత మాత్రం లభిస్తుంది.

35

గత తప్పులను పట్టుకోవడం

మీరు గతంలో జరిగిన తప్పుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండిపోతుంటారా? వెంటనే ఈ లక్షణాన్ని వదిలేయండి. లేదంటే మీరు జీవితంలో ముందుకు వెళ్లలేరు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోలేరు. ఫెయిల్యూర్స్ వల్ల కలిగే అనుభవాలు జీవిత పాఠాలను నేర్పిస్తాయి. తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకొని ముందుకెళ్లడం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది. 

45

ఎప్పుడూ బిజీగా ఉండటం

మీరు ఎప్పుడూ ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉంటారా? దీని వల్ల మీకు బాగా డబ్బు కలిసి రావచ్చు. కాని మీరు మానసికంగా అలసిపోతారు. దీని వల్ల మీ మనసు ప్రశాంతత కోసం వెతకడం ప్రారంభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రోజు ఎంతోకొంత సమయం ఖాళీగా, రెస్ట్ తీసుకొనే విధంగా ప్లాన్ చేసుకోండి. దీని వల్ల మీ మానసికంగా స్ట్రాంగ్ గా మారతారు. 

55

మార్పును అంగీకరించకపోవడం

చాలా మంది భయం వల్ల, సౌకర్యం లేదన్న కారణంగా మార్పును అంగీకరించరు. దీని వల్ల జీవితం ముందుకు సాగదు. కొత్త అవకాశాలను కోల్పోతారు. ఎటువంటి టెన్షన్స్ లేవని ఉన్న అవకాశాలతోనే సర్దుకుపోవడం సేఫ్ గానే ఉండొచ్చు. కాని దీని వల్ల అభివృద్ధి ఆగిపోతుంది. మార్పును ఓపెన్ మైండ్‌తో స్వాగతించడం వల్ల జీవితం సులభతరం అవుతుంది.

ఇది కూడా చదవండి పిల్లలను కౌగిలించుకొని మాట్లాడటం వల్ల ఇన్ని ప్రయోజనాలా?

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved