Rohit Sharma Son Ahaan ఇతడే జూనియర్ హిట్ మ్యాన్: రోహిత్ కొడుకు ఫోటో వైరల్!
రోహిత్ శర్మ తనయుడి తొలి ఫోటో : క్రికెటర్ రోహిత్ శర్మ కూతురు ఫొటోల్ని జనం చాలాసార్లు చూసే ఉంటారు. ఆ అమ్మాయి మ్యాచ్ అనంతరం చాలాసార్లు మైదానంలో కూడా కనిపించింది. కానీ రోహిత్-రితికాల కొడుకు అహాన్ ఫొటో ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పుడు రోహిత్ శర్మ స్వయంగా తన కొడుకు అహాన్ ని స్వయంగా మీడియాకు చూపించారు. అందులో అహాన్ ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అభిమానుు అహాన్‌ను జూనియర్ హిట్‌మ్యాన్ అని కామెంట్ చేస్తున్నారు.

రోహిత్ శర్మ ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా, ఆయన భార్య రితికా ప్రేక్షకుల గ్యాలరీలో ఉంటారు. రోహిత్ ని సపోర్ట్ చేస్తూ కనిపిస్తారు. వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు. కుమార్తె సమీరా చాలాసార్లు పేరెంట్స్ తో కలిసి బయట కనిపించింది కానీ.. కానీ, కుమారుడు అహాన్ ఫోటో ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ ఐపీఎల్ సమయంలో అహాన్ ఫోటో విడుదలై వైరల్ అవుతోంది.
రోహిత్ శర్మ కుమారుడి పేరు అహాన్ శర్మ. అహాన్ తొలి ఫోటో విడుదల కావడంతో, అభిమానులు ‘జూనియర్ రోహిత్’, ‘జూనియర్ హిట్ మ్యాన్’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అహాన్ చాలా అందంగా, ముద్దుగా ఉన్నాడని అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల విడుదలైన ఫోటోలో, రితికా అహాన్‌ను ఎత్తుకుని ఉన్నారు. పక్కనే అహాన్ సోదరి సమీరా కూర్చుని ఉంది. తమ్ముడితో సమీరా ఆడుకుంటూ సంతోషంగా ఉండటం అందులో చూడవచ్చు. 2024 నవంబర్ 15న అహాన్ జన్మించాడు. అప్పటి వరకు అహాన్ ఫోటోను రోహిత్, రితికా దంపతులు విడుదల చేయలేదు. బహిరంగ ప్రదేశాలకు కూడా తీసుకెళ్లలేదు. ఈ విషయంలో రోహిత్ శర్మ, రితికా సజ్దే దంపతులు చాలా జాగ్రత్తగా ఉన్నారు.
విడుదలైన అహాన్ ఫోటోలను రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రోహిత్ ఐపీఎల్ టోర్నీలో ముంబై జట్టు తరపున ఆడుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ పెద్దా ఫామ్‌లో లేడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో కేవలం 82 పరుగులు మాత్రమే చేశారు. తొలి మ్యాచ్‌లో రన్‌లు ఏమీ చేయకుండానే ఔటయ్యారు. అత్యధికంగా 26 పరుగులు చేశారు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 3 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.