- Home
- Entertainment
- హీరోయిన్ విషయంలో డైరెక్టర్ మీద అలిగిన మహేష్ బాబు, షూటింగ్ నుంచి వెళ్లిపోయిన సూపర్ స్టార్
హీరోయిన్ విషయంలో డైరెక్టర్ మీద అలిగిన మహేష్ బాబు, షూటింగ్ నుంచి వెళ్లిపోయిన సూపర్ స్టార్
హీరోయిన్ విషయంలో కోపం వచ్చిందంట సూపర్ స్టార్ మహేష్ బాబుకు, డైరెక్టర్ పై ఫైర్ అవ్వడంతో పాటు అలిగి ఆ షూటింగ్ నుంచి వెంటనే వెళ్లిపోయాట కూడా. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఎవరా హీరోయిన్, ఏంటా సినిమా కథ.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సూపర్ స్టార్ కృష్ణ వారసత్వం తీసుకుని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత స్వతహాగా తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు మహేష్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏకైక సూపర్ స్టార్ గా తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు మహేష్ బాబు. తన తండ్రి ఏడాదికి 18 సినిమాలు చేసిన రికార్డ్ సాధిస్తే.. మహేష్ బాబు మాత్రం ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ.. లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు.
గెలుపోటములు లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న మహేష్ బాబు.. మధ్యలో వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు. కొంత కాలం తరువాత మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సూపర్ స్టార్ కు కథల విషయంలో జాగ్రత్త పడ్డాడు, దాంతో ప్రస్తుతం వరుసగా హిట్ సినిమాలు చేస్తున్నాడు మహేష్ బాబు.
కొంత కాలం వరకూ గెలపుఓటములు వరుసగా చూసుకుంటూ వచ్చాడు మహేష్ బాబు. ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. మరో రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యేవి. పడిలేచే కెరటంలా చాలా కాలం ఆయన కెరీరీర్ ఇలానే నడిచింది. కొంత కాలం తరువాత ఆ ఫెయిల్యూర్స్ నుంచి తప్పించుకుని.. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్. ఇక తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్ లతో పనిచేశాడు మహేష్. చాలామంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చాడు కూడా.
ఎంతో మంది హీరోయిన్లతో పనిచేసిన మహేష్ బాబు ఓ హీరోయిన్ విషయంలో మాత్రం స్టార్ డైరెక్టర్ కే వార్నింగ్ ఇచ్చాడని తెలుసా? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ ప్రీతిజింటా, ఆమె విషయంలో డైరెక్టర్ కు మహేష్ బాబు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? స్టార్ హీరోలు అయినా సినిమా సెట్ లో డైరెక్టర్ చెప్పినట్టే వినాలి. ఒకప్పుడు వినేవారు కూడా. పెద్ద పెద్ద కాంట్రవర్సీలు ఉంటే తప్ప డైరెక్టర్ కు, హీరోకు వివాదాలు ఉండేవి కాదు.
అయితే మహేష్ బాబు మాత్రం తనను హీరోగా పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావుతో గొడవపడ్డారట. ఆయనపై అలిగి సెట్ నుంచి వెళ్లిపోయాడట. అది కూడా హీరోయిన్ విషయంలో ఇలా జరిగిందని తెలుస్తోంది. సినిమాలో భాగంగా హీరోయిన్ ఎంగిలి తాగాల్సి వచ్చిందట. దాంతో మహేష్ బాబుకు ఈ విషయంలో కోపం వచ్చేసింది. దాంతో డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారట.
రాజకుమారుడు సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయని మహేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా లవ్ సీన్స్ ను దర్శకేంద్రుడు ఎంత అద్భుతంగా చిత్రీకరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా కోసం ఓ సీన్ రాసుకున్నారట రాఘవేంద్రరావు. ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు పెట్టి మహేష్ తో పాటు ప్రీతీజింటాను తాగమన్నారట.
ఇక హీరోయిన్ తాగిన కూల్ డ్రింక్ నేను తాగాలా అని డైరెక్టర్ రాఘవేంద్రరావు పై కోప్పడ్డారట మహేష్. అంతే కాదు అలిగి షూటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయారట. అయితే రాఘవేంద్రరావు తో ఉన్న చనువుతోనే ఇలా చేశారట. మహేష్.. ఎందుకుంటే మహేష్ రాఘవేంద్ర రావు ను మావయ్య అని పిలుస్తారు. ఈ చనువుతోనే మహేష్ బాబు ఇలా కోప్పడి అలిగి వెల్లిపోయారట. ఇక ఆతరువాత రాఘవేంద్ర రావు మహేష్ ను బ్రతిమలాడి మళ్లీ షూటింగ్ కు తీసుకువచ్చారని సమాచారం.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. మహేష్ బాబు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసింది మాత్రం రాజకుమారుడు సినిమాతో .. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. సొట్టబుగ్గల సుందరి ప్రితీ జింటా హీరోయిన్ గా నటించింది. ఇక ఈమూవీ రిలీజ్ అయ్యి సిల్వర్ జూబ్లీ ఇయర్స్ అవుతుంది.