- Home
- Entertainment
- Sampoornesh Babu: సంపూర్ణేశ్‌బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అందులోనే పేదలకు ఎంత ఇస్తాడంటే!
Sampoornesh Babu: సంపూర్ణేశ్‌బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అందులోనే పేదలకు ఎంత ఇస్తాడంటే!
Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌బాబు సినిమాలు ప్రత్యేకంగా ఉంటుంటాయి. యూత్ మెచ్చే కామెడీ సినిమాలు చేస్తుంటాడు. హృదయకాలెయం సినిమాతో తెలుగు సినిమాల్లో అరంగేట్రం చేసి మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాలకు కొంత గ్యాప్ వచ్చింది. అయితే.. త్వరలో ''సోదరా'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సంపూ.. ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలతోపాటు, తాను సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Sampoornesh babu
సంపూ.. హృదయకాలెయం సినిమా తర్వాత వరుస పెట్టి సినిమా ఆఫర్లు వచ్చాయి. కొబ్బరిమట్ట, వైరస్, కరెంట్ తీగ తదితర చిత్రాల్లో నటించాడు. అయితే.. ఈ మధ్యకాలంలో సినిమాల్లో, బయట ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఆయన నటించిన సోదరా చిత్రం విడుదలకు సిద్దం కాగా.. ఆ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు.
Manchu Manoj
ఇద్దరు అన్నదమ్ముల మధ్య కథే సోదరా అని సంపూర్ణేశ్‌బాబు చెబుతున్నారు. సంపూకి సోదరుడిగా సంజోశ్ నటించాడు. ఈ సినిమాలో ఆర్తి, ప్రాచి బన్సాల్ హీరోయిన్లు. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించారు. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు యూనిట్ చెబుతోంది. ఈ సందర్భంగా సంపూ తన సినీ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సంపూది పేద కుటుంబం... సినిమాల్లో నటించాలనే ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఎలాగోల తొలి సినిమా అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమా దర్శకుడు సాయి రాజేష్ కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని సంపూతో ప్రయోగాత్మకంగా హృదయకాలెయం సినిమా తీశాడు. అందులోని కామెడీ, కొన్ని సీన్లు ఇద్దరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత వరుసబెట్టి సినిమా ఆఫర్లు సంపూకి వచ్చాయి. మరి సినిమాల్లో హీరోగా రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నావని ఇంటర్వ్యూలో యాంకర్ అడగ్గా.. వారు ఇచ్చినంత.. నేను తీసుకున్నంత అని సరదాగా చెప్పుకొచ్చాడు. అయితే.. తనకు ఇస్తానన్న డబ్పు నిర్మాతలు ఇచ్చేవారని అది తక్కువైనా ఎక్కువైనా అని చెబుతున్నాడు సంపూ.
Sampoornesh babu
తనతో సినిమా తీసిన నిర్మాతలు ఎవరూ డబ్బులు ఎగ్గొట్టలేదని సంపూ చెప్పాడు. ఇవన్నీ కాదు.. ఎంత తీసుకున్నావ్ ఒక్కో సినిమాకి అంటే.. ఇంటి దగ్గర ఉన్నప్పుడు తన సంపాదన నెలకు రూ.15 నుంచి 20 వేలు ఉండేదని.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత.. షూటింగ్‌కి వెళ్తే రెండు రోజులకు రూ.లక్ష చొప్పున ఇస్తున్నప్పడు ఇదే జీతం బెటర్ కదా అని ఇండైరెక్ట్‌గా తన రెమ్యునరేషన్ గురించి లీక్ ఇచ్చాడు సంపూ. ఈ లెక్కడన సినిమాకు దాదపు రూ.20 నుంచి 40 లక్షల వరకు ఇచ్చారని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా.. సంపూ.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో, ఎవరికైనా కష్టం వస్తే తనకు వచ్చిన సంపాదన నుంచి డబ్బులు ఇస్తుంటాడు. గతంలో అనేక సార్లు డబ్బులను డొనేట్ చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి.
ఇక అన్నదమ్ముల అనుబంధాన్ని వెండితెరపై ఆవిష్కరించే చిత్రం సోదరా అని.. దీని ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు సంపూ. ఇందులో హృదయకాలెయం కామెడి తరహా చిత్రం కాదని అన్నారు. బాధ్యతగా ఉండే అన్నగా నటించానని, తన వ్యక్తిగత జీవితానికి దగ్గరగా సినిమా ఉంటుందని సంపూ చెబుతున్నారు.