MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tamannaah: తమన్నా ఒంటరిగా ఉంటే ఏం చేస్తుందో తెలుసా? ఇదే తను స్టార్ట్‌ చేయబోయే బిజినెస్‌!

Tamannaah: తమన్నా ఒంటరిగా ఉంటే ఏం చేస్తుందో తెలుసా? ఇదే తను స్టార్ట్‌ చేయబోయే బిజినెస్‌!

Tamannaah: మిల్లీబ్యూటీ తమన్నా భాటియా ఇటీవల ఓదెల 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. సినిమా విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసినా.. రిలీజైన తర్వాత అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ తమన్నా నటను మాత్రం అందరూ మొచ్చుకుంటున్నారు.. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్బంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్‌లు లేని సమయంలో, ఒంటరిగా ఖాళీగా ఉన్న టైంలో ఏమేమి పనులు చేస్తుందో చెపుకొచ్చింది.  

2 Min read
Author : Bala Raju Telika
Published : Apr 20 2025, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Tamannaah Reveals Her Love for Jewelry Design

Tamannaah Reveals Her Love for Jewelry Design

తమన్నా తెలుగమ్మాయి కాదు అంటే దాన్ని ఎవరూ నమ్మరు. ఎందుకంటే తెలుగు అంత చక్కగా మాట్లాడుతుంది. తన డబ్బింగ్‌ కూడా తనే తెలుగులో చెప్పుకుంటుంది. ఇక మిల్కీబ్యూటీగా పేరుతెచ్చుకున్న తమన్నా.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరుసబెట్టి సినిమా ఆఫర్లను సంపాదించుకుంది. కానీ రీసెంట్‌గా పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. కానీ అప్పుడప్పుడు ఐటమ్‌ సాంగ్స్ చేస్తూ కనువిందు చేస్తోంది. 

25
Tamannaah Reveals Her Love for Jewelry Design

Tamannaah Reveals Her Love for Jewelry Design

చాలా గ్యాప్‌ తర్వాత తమన్నా ప్రధాన పాత్ర పోషించిన ఓదెల 2 చిత్రం ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ నేపథ్యం అంతేకాకుండా గతంలో హిట్టైన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్ కావడంతో అందరి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ థియేటర్లలోకి వచ్చాక ఓదెల 2కు నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. దీంతో ఈ ఎఫెక్టు కలెక్షన్లపై పడింది. 

35
Tamannaah Reveals Her Love for Jewelry Design

Tamannaah Reveals Her Love for Jewelry Design

తమన్నా ఓదెల చిత్రంలో నాగసాధు భైరవిగా నటించింది. కథ, స్క్రీన్‍ప్లే సంపత్ నంది, అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు తమన్నా ఆకర్షణ కాగా..మూవీ టీం గట్టిగానే ప్రమోషన్స్‌ చేసింది. కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమా కథ విషయానికి వస్తే.. ఓదెల అనే గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో వీటిని ఎలాగైనా ఆపాలని తమన్నా వద్ద కొన్ని శక్తులు ఉన్నాయని తెలుసుకుని గ్రామస్థులు ఆమె వద్దకు వస్తారు.. ఆ తర్వాత ఆ దుష్టశక్తులతో తమన్నా ఎలా పైచేయి సాధించింది అన్న నేపథ్యంలో కథ తిరుగుతుంది. 

45
Tamannaah Reveals Her Love for Jewelry Design

Tamannaah Reveals Her Love for Jewelry Design

ఇక సినిమా సంగతి పక్కన పెడితే.. తమన్నా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి కదా.. ఖాళీ సమయాల్లో ఏం చేస్తున్నారు అని యాంకర్‌ తమన్నాని అడగ్గా.. తాను ఖాళీ సమయాల్లో జ్యూయలరీ మేకింగ్‌, డిజైనింగ్‌ చేస్తుంటానని చెప్పింది. నగలు తయారు చేయడం, డిజైనింగ్‌ అన్నా, మేకింగ్‌ అన్నా తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. ఏ మాత్రం ఖాళీ దొరికినా వెంటనే ఆ పనిమీదే ఉంటానని అంటోంది మిల్కీబ్యూటీ. 

 

55
Tamannaah Reveals Her Love for Jewelry Design

Tamannaah Reveals Her Love for Jewelry Design

తమన్నా తన ఒంటిపై ధరించే 90 శాతం వరకు జ్యూయలరీ... మొత్తం అంతా తను ఓన్‌గా డిజైన్‌ చేసుకున్నదేనట. కేవలం గోల్డ్‌ ఆర్నమెంట్స్‌ మాత్రమే మేకింగ్‌, డిజైనింగ్‌ చేస్తుందట. గోల్డ్‌ కాకుండా ఇంకే తనకు నచ్చదట. అయితే.. దీన్ని మీరు వ్యాపారంగా మార్చుకుంటారా అని యాంకర్‌ ప్రశ్నవేయగా... ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని.. తన సొంతానికి తాను ఇష్టంతో జ్యూయలరీ మేకింగ్‌ చేసుకుంటుందని చెబుతోంది. ఏమో గుర్రం ఎగురావచ్చు అన్నట్లు.. భవిష్యత్తులో తమన్నా జ్యూయలరీ బిజినెస్‌ ప్రారంభించినా ఆర్చర్యపడాల్సిన అవసరం లేదు. 

About the Author

BR
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.
తెలుగు సినిమా
ప్రసిద్ధ వ్యక్తులు
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల టికెట్ల రేట్లు పెంచాం..దేహీ అని అడుక్కోవద్దు, పవన్ కామెంట్స్
Recommended image2
Ravi Mohan: మ్యాచింగ్ డ్రెస్ పై ఆర్తి రవి సెటైర్ వైరల్.. ఎవరిని ఉద్దేశించి ఇలా
Recommended image3
Golmaal 5: గోల్మాల్ 5లో బిగ్ సర్ప్రైజ్..అక్షయ్ సరసన ఆ బ్యూటీ, 17 మంది స్టార్లతో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved