Top 5 youngest players in IPL: ఐపీఎల్ హిస్టరీలో టాప్-5 యంగెస్ట్ ప్లేయర్లు
Top 5 youngest players to debut in IPL history: ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ ఘనత సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల 23 రోజుల వయస్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కులైన టాప్-5 ప్లేయర్లు ఎవరో మీకు తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Top 5 Youngest Debutants in IPL History – Meet the Teenage Trailblazers
Top 5 youngest players to debut in IPL history: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రావడంతో అనేక మంది యంగ్ ప్లేయర్లకు క్రికెట్ లో తమ ప్రతిభను చూపించుకోవడానికి మంచి వేదిక దొరికింది. దేశవాళీ క్రికెట్ లో మంచి ఇన్నింగ్స్ లు ఆడి.. ఐపీఎల్ లో తుఫాను రేపి జాతీయ జట్టులో అవకాశాలు పొందుతున్నారు. ఇలా చాలా మంది ప్లేయర్లు ఐపీఎల్ లో చిన్న వయస్సులోనే తమ సత్తా ఏంటో చూపించారు.
ఆ కోవలోనే ఇప్పుడు మరో యంగ్ ప్లేయర్ ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. ఆడిన తొలి బంతినే సిక్సర్ గా మలిచాడు. అతనే ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. అతను కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయస్సులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
2024 నవంబర్‌లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. లక్నో బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఓవర్ లో వైభవ్ తొలి బంతికే సిక్సర్ కొట్టాడు. తన ఈ ఇన్నింగ్స్ లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అయితే, వైభవ్ సూర్యవంశీతో పాటు ఐపీఎల్ లో టాప్-5 అతి పిన్న వయస్కులైన ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL’s Youngest Stars: Cricketers Who Made History Before Turning 18
1. వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ చరిత్రలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ ఘనత సాధించాడు. 14 సంవత్సరాల 23 రోజులు వయస్సులో అతను ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. 2024లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ ఆటగాడిని ఎంపిక చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఈ ఆటగాడు కేవలం 20 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు.
Baby-Faced Legends: Youngest Players to Ever Debut in the IPL
2. ప్రయాస్ రే బర్మాన్
2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన రెండవ అతి పిన్న వయస్కుడు ప్రయాస్ రే బర్మాన్. అతను 16 సంవత్సరాలు 157 రోజుల వయస్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఈ ప్లేయర్ కు ఆ తర్వాత అవకాశాలు రాలేదు.
From School to Stadiums: IPL's Youngest Ever Debuts
3. ముజీబ్ ఉర్ రెహ్మాన్
ఐపీఎల్ లో అతి పిన్న వయస్సులో ఐపీఎల్ లో అడుగుపెట్టిన వారిలో మూడో స్థానంలో ఉన్న ప్లేయర్ ఆఫ్ఘనిస్తాన్ కు స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్. అతను 2018 లో 17 సంవత్సరాల 11 రోజుల వయసులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ఇప్పుడు పంజాబ్ కింగ్స్) తరపున ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. ఫ్రాంచైజీ వేలంలో ఈ ఆటగాడు 4 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని అందుకున్నాడు.
Teen Titans of IPL: The 5 Youngest to Ever Play in the League
4. రియాన్ పరాగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేసిన నాల్గవ అతి పిన్న వయస్కుడు రియాన్ పరాగ్. అతను 17 సంవత్సరాల 152 రోజుల వయస్సులో ఐపీఎల్ లోకి అడుగుపెట్టాడు. ఈ ఆటగాడిని 2019 లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎంపిక చేసింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు రియాన్ పరాగ్.
IPL Debuts Before Adulthood: Meet the Teen Cricket Sensations
5. ప్రదీప్ సంగ్వాన్
అండర్-19 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా తరఫున కీలక పాత్ర పోషించిన ఎడమచేతి వాటం పేసర్ ప్రదీప్ సంగ్వాన్, ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)తో కాంట్రాక్ట్ పొందాడు. అప్పుడు అతని వయస్సు 17 సంవత్సరాల 179 రోజులు.