- Home
- Andhra Pradesh
- AP: పుట్టిన రోజు నాడు సీఎం చంద్రబాబు ఎక్కడున్నారో తెలుసా? పీఎం నుంచి సీఎంల వరకు ప్రశంసలే!
AP: పుట్టిన రోజు నాడు సీఎం చంద్రబాబు ఎక్కడున్నారో తెలుసా? పీఎం నుంచి సీఎంల వరకు ప్రశంసలే!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. సుధీర్గంగా నలభై ఏళ్లుపాటు రాజకీయాల్లో ఉన్న నాయకుడిగా.. నాలుగు సార్లు సీఎంగా పనిచేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబుకు మంచి అడ్మినిస్ట్రేటర్ అని పేరుంది, పాలన అందించే విషయంలో ఆయనకు మన, తన భేదాలు ఉండవు.. ఎమెషన్స్ ఉండవ్.. తప్పు చేస్తే ఎవరినైనా, ఎంతటివారినైనా ఎదిరిస్తారు, శిక్షిస్తారు అని అనేక సందర్భాల్లో రుజువైంది. ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికీ అదే ఎనర్జీతో మాట్లాడుతుంటారు.. పనిచేస్తుంటారు.. జూ.ఎన్టీఆర్ ఓ సినిమాలో చెప్పినట్లు అదోరేర్ పీస్ అన్నమాట. ఇక ఏప్రిల్ 20 ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ మొదలుకుని పవన్ కల్యాణ్, రేవంత్ రెడ్డి, కేసీఆర్, తదితర కీలకనేతలు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. వారేమన్నారో ఇప్పుడు చూద్దాం.. అంతేకాకుండా పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన ఎక్కడ ఉన్నారంటే..
- FB
- TW
- Linkdin
Follow Us
)
CM Chandrababu Turns 75 – Birthday Wishes Pour In From PM Modi, CMs & Celebs
సీఎం చంద్రబాబుకు తొలుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి విషెస్ వచ్చాయి.. మోదీ తన 'ఎక్స్’లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నా స్నేహితుడు చంద్రబాబుకు జన్మదిన శుభాకంక్షలు, భవిష్యత్ తరాల కోసం దృష్టి సారించి పని చేస్తున్నారు. ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు, ఆయన పనితీరు ప్రశంసనీయం, దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ విషెస్ చెప్పారు.
CM Chandrababu Turns 75 – Birthday Wishes Pour In From PM Modi, CMs & Celebs
‘‘సీఎం చంద్రబాబుకు బర్త్‌డే శుభాకాంక్షలు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏపీని ప్రగతివైపు కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నాయి. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కోరారు.
‘‘చంద్రబాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని భగవంతుడివ్వాలి.’’ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విషెస్ పంపారు.
CM Chandrababu Turns 75 – Birthday Wishes Pour In From PM Modi, CMs & Celebs
సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో జగన్‌కు ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదని కూటమి కార్యకర్తలు.. సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
YSR Congress Party president Jagan Mohan Reddy wishes to Chief Minister Chandrababu Naidu
‘‘చంద్రబాబు నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్థిల్లాలి. సుభిక్ష పాలన అందించేందుకు ఆయనకు దేవుడు మరింత శక్తినివ్వాలి.’’ అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ‘‘ఏపీ సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఆయన అనేక పనులు చేశారు. చంద్రబాబు తీసుకొచ్చిన హైటెక్ సిటీ సహా.. ఐటీ అభివృద్ధిని మేం కొనసాగించాం. మంచి పనులను బీఆర్‌ఎస్ ఎప్పుడూ అడ్డుకోలేదు ’’ అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశంసించారు.
modi chandrababu
అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడుకు వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు..
ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబుకు సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అని - జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విషెస్ చెప్పారు.
Nara Chandra Babu Naidu
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన యూరప్ పర్యటనకు వెళ్లారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ నాయకులు, శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.. నవ్యాంధ్ర నిర్మాత అంటూ.. సెలబ్రేషన్స్ చేశారు.