తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:36 PM (IST) Jun 20
దళపతి విజయ్ ఆదివారం తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ రెడీ చేశారట.
10:54 PM (IST) Jun 20
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన అసాధారణ ప్రదర్శనతో లీడ్స్ మైదానంలో అరుదైన ఘనతను సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో సెంచరీ బాదుతూ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.
10:37 PM (IST) Jun 20
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. మొదటి రోజు మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు అద్భుత ఆటతీరును కనబరిచారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది.
09:46 PM (IST) Jun 20
రక్షణ వ్యవస్థ పరంగా ఇరాన్ కంటే ఇజ్రాయెల్ చాలా బలమైన దేశం. అలాంటి దేశాన్నే ఇరాన్ క్లస్టర్ బాంబులు భయపెడుతున్నాయి. ఇంతకూ ఏమిటీ బాంబులు? ఎందుకంత ప్రమాదకరం? ఇక్కడ తెలుసుకుందాం.
08:44 PM (IST) Jun 20
ఏపీ, తెలంగాణల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
08:17 PM (IST) Jun 20
మారుతోన్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనివార్యంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఉద్యోగుల నియామక ప్రక్రియలో కూడా ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.
07:54 PM (IST) Jun 20
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన భువనేశ్వర్ నుంచి ప్రత్యేక వైమానిక దళ విమానంలో బయలుదేరి, రాత్రి 6.45కి ఐఎన్‌ఎస్ డేగా నేవల్ ఎయిర్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
07:28 PM (IST) Jun 20
ఎంతటి వారైనా సరే కర్మ అనుభవించాల్సిందే.. ఇది పురాణాల నుంచి మంచి చూస్తునే ఉన్నాం. ప్రస్తుతం ఇరాన్ కూడా తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తోందా.? నెట్టింట ఇదే చర్చ నడుస్తోంది.
05:41 PM (IST) Jun 20
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య మొదలైన ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే ఇప్పట్లో ఈ యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. తాజాగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నాయి.
05:25 PM (IST) Jun 20
2025లో మిథునం, వృషభం, సింహం, కన్య, మకర రాశుల వారికి ఉద్యోగ ప్రమోషన్, జీతం పెరుగుదల, బాధ్యతలు పెరగడం వంటి విషయాల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.
04:33 PM (IST) Jun 20
ప్రస్తుతం అన్ని టెలికం కంపెనీలు కచ్చితంగా రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయి. దీంతో చాలా మంది ఇన్‌కమింగ్ కాల్స్ కోసమైనా రీఛార్జ్ చేస్తున్నారు. అలాంటి వారికోసం ఒక బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది.
04:13 PM (IST) Jun 20
వైసీపీ అధినేత జగన్ చేసిన రప్పా..రప్పా డైలాగులు గురించి పవన్ తీవ్రంగా స్పందించారు. చట్టాలను ఉల్లంఘిస్తే..రౌడీ షీట్లు తెరుస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
03:43 PM (IST) Jun 20
ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సమతుల్యతను అందించే సాధనంగా గుర్తింపు పొందింది. ఈ సాధనంలో ప్రజల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో గిన్నిస్ వరల్డ్ రికార్డుల ద్వారా తెలుస్తోంది.
03:42 PM (IST) Jun 20
హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్‌కు తెర లేచింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, భారత దిగ్గజం సచిన్ తెందుల్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
03:14 PM (IST) Jun 20
కొన్నిసార్లు సమాజంలో జరుగుతోన్న సంఘటనలు భయబ్రాంతులకు గురి చేస్తుంటాయి. అయితే అదే సమాజంలో మరో కోణం కూడా ఉంటుంది. అలాంటి ఒక హ్యుమన్ టచ్ యాంగిల్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
02:08 PM (IST) Jun 20
ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ సమర్దవంతంగా ఎదుర్కుంటోంది. తాజాగా ఓ ఇరాన్ డ్రోన్ ను గాల్లోనే ధ్వంసం చేసిన వీడియోనూ ఇజ్రాయెల్ రక్షణ శాఖ విడుదల చేసింది.
12:33 PM (IST) Jun 20
ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నంకు విచ్చేయనున్నారు. యోగా డే వేడుకల కోసం ఆయన రెండ్రోజులు విశాఖలో ఉంటారు. ఆయన విశాఖలో దిగగానే ఓ సామాన్య మహిళ నాగమణి స్వాగతం పలకనున్నారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా?
10:46 AM (IST) Jun 20
వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లలో జీతంతో ఓ యువకుడు ఉద్యోగాన్ని పొందాడు. అలాగని అతడు ఏ ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి లో చదువుకోలేదు… ఓ రాష్ట్రస్థాయి విద్యాసంస్థలో చదువుకున్నాడు. ఆ యువకుడి సక్సెస్ స్టోరీని ఇక్కడ తెలుసుకుందాం.
10:03 AM (IST) Jun 20
అన్నదాత సుఖీభవలో ఈకేవైసీ కేవలం వివరాలు లేనివారికే. రైతు వెబ్‌సైట్‌లో అర్హత స్టేటస్ చెక్ చేసుకోండి. ఏడాదికి రూ.20వేలు మూడు విడతల్లో జమ అవుతాయి.
09:18 AM (IST) Jun 20
చిరంజీవి సినిమా కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు షాకుల మీద షాకులిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా మెగాస్టార్ మూవీకి సంబంధించి ఈయంగ్ డైరెక్టర్ ఇచ్చిన అప్ డేట్ కు ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
08:08 AM (IST) Jun 20
తెలుగు రాష్ట్రాల రైతులకు చల్లని కబురు. ఇవాాళ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ ప్రకటించారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.