MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • National
  • Viral Video: హ‌నీమూన్ మ‌ర్డ‌ర్లే కాదండి.. ఇలాంటి భావోద్వేగాలు కూడా ఉంటాయ్‌. ఈ వృద్ధ దంప‌తుల ప్రేమ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

Viral Video: హ‌నీమూన్ మ‌ర్డ‌ర్లే కాదండి.. ఇలాంటి భావోద్వేగాలు కూడా ఉంటాయ్‌. ఈ వృద్ధ దంప‌తుల ప్రేమ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

కొన్నిసార్లు స‌మాజంలో జ‌రుగుతోన్న సంఘ‌ట‌న‌లు భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తుంటాయి. అయితే అదే స‌మాజంలో మ‌రో కోణం కూడా ఉంటుంది. అలాంటి ఒక హ్యుమ‌న్ ట‌చ్ యాంగిల్ గురించి ఈరోజు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jun 20 2025, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స‌మాజంలో పెరుగుతోన్న దారుణాలు
Image Credit : gopika_jewellery_sambhajinagar @ Instagram

స‌మాజంలో పెరుగుతోన్న దారుణాలు

పెళ్లైన వారం రోజుల‌కే క‌ట్టుకున్న భ‌ర్త‌ను హ‌నీమూన్ పేరుతో క‌డ‌తేర్చింది ఓ న‌వ వ‌ధువు. ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను మ‌ట్టుబెట్టించింది. మ‌రో భార్య ప్రియుడి మోజులో ప‌డి భ‌ర్త‌ను చంపి శ‌వాన్ని డ్రమ్ములో దాచి సిమెంట్‌తో క‌ప్పేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల ఎన్నో జ‌రిగాయి.

దీంతో చాలా మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి అంటేనే భ‌యం వేస్తోంది. అస‌లు పెళ్లిళ్లు చేసుకోకూడ‌దు అంటూ పోస్టులు చేస్తున్నారు. అయితే ఇలాంటి దారుణాలు జ‌రుగుతోన్న స‌మాజంలోనే పెళ్లి బంధానికి అస‌లైన అర్థం చెప్పే ఓ సంఘ‌ట‌న జ‌రిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
93 ఏళ్ల వ‌య‌సులో
Image Credit : gopika_jewellery_sambhajinagar @ Instagram

93 ఏళ్ల వ‌య‌సులో

మ‌హారాష్ట్ర‌కు చెందిన వృద్ధ దంప‌తుల‌కు సంబంధించిన వార్త ఒక‌టి తాజాగా తెగ ట్రెండ్ అవుతోంది. 93 ఏళ్ల వయసులో ఓ తాత భార్య కోసం జువెలరీ షాప్ కు వెళ్లి స్వయంగా తాళి బొట్టు కొనడం అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భార్యను వెంటపెట్టుకుని షాప్ కు వెళ్లి ఆమెకు నచ్చిన తాళిని తాత కొనిస్తుండటం సిబ్బందినీ, కస్టమర్లను అబ్బురపరిచింది. అక్క‌డితో ఆగ‌కుండా సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌పంచ‌మంతా చుట్టేసింది.

Related Articles

Related image1
Car: రూ. 68 వేలు డౌన్‌పేమెంట్, నెల‌కు రూ. 10 వేలు EMI క‌డితే చాలు.. ఈ కారు మీ సొంతం
Related image2
Silver Price: వెండి @ రూ. 2 ల‌క్ష‌లు.?
35
ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.?
Image Credit : gopika_jewellery_sambhajinagar @ Instagram

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.?

93 ఏళ్ల నివృతి షిండే అనే తాతా తన భార్య శాంతాబాయికు జీవితంలో బంగారాన్ని కొనించ‌లేక‌పోయాడు. చాలిచాల‌నీ ఆదాయం, కుటుంబ పోష‌ణ, ఎన్నో బాధ్య‌త‌లు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో భార్య‌కు తాలిని కొనించ‌లేక‌పోయాడు. జాల్నా జిల్లాలోని అంభోరా జహంగీర్ గ్రామానికి చెందిన దంపతులు పండరీపూర్ లోని ఆశాదీ ఏకాదశి వేడుకలకు వెళ్తున్న క్ర‌మంలో భార్య‌కు మంగ‌ళ సూత్రం కొనుగోలు చేయాల‌ని మహారాష్ట్రలోని ఛత్రపతి షంభాజీ నగర్‌లో ఉన్న జువెల‌రీ షాప్‌కి వెళ్లాడు.

షాక్ అయిన య‌జ‌మాని

అయితే తొలుత ఆ జంట‌ను చూసిన షాపులో ఉన్న వారు వీరేం కొంటార‌న్న‌ట్లు చూశారు. అయితే త‌న భార్య‌కు మంగ‌ళ‌సూత్రం కావాల‌ని అడ‌గ‌డంతో అంతా షాక్ అయ్యారు. ఈ వ‌య‌సులో భార్య కోరిక‌ను తీర్చేందుకు వ‌చ్చిన తాత‌ను చూసి ఫిదా అయ్యారు. ఆ వృద్ధ జంట ప్రేమ‌ను చూసి మంత్ర‌మూగ్దుడైన షాప్ ఓనర్ అనూహ్య నిర్ణ‌యాన్ని తీసుకున్నాడు. కేవలం 20 రూపాయలు తీసుకుని మంగళ సూత్రం గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో వృద్ధుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది. సంతోషంతో కంట‌త‌డి పెట్టుకున్నారు.

45
ఆశ్చ‌ర్యం వేసింది.
Image Credit : gopika_jewellery_sambhajinagar @ Instagram

ఆశ్చ‌ర్యం వేసింది.

ఈ విష‌య‌మై షాప్ య‌జ‌మానికి మాట్లాడుతూ.. ‘‘తాత, బామ్మ షాపులోకి వచ్చారు. తన భార్యకు మంగళ సూత్రం కావాలని అడిగాడు. రూ. 1120 ఇచ్చి మంగళ సూత్రం కావాలని అడిగాడు. వారు అడిగే విధానం.. భార్య కోసం ఆ వయసులో ఆయన పడే తపన చూసి చాలా ఆశ్చర్యం వేసింది. అందుకే కేవ‌లం టోకెన్ అమౌంట్ 20 రూపాయలు తీసుకుని తాళి వాళ్లకు గిఫ్ట్ గా ఇచ్చాను’’ అని చెప్పుకొచ్చాడు.

55
నెట్టింట తెగ వైర‌ల్
Image Credit : gopika_jewellery_sambhajinagar @ Instagram

నెట్టింట తెగ వైర‌ల్

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఆ వ‌య‌సులో కూడా జంట మ‌ధ్య అన్యోన్య‌త‌కు ఫిదా అవుతున్నారు. బోర్ కొడితే విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో.. భార్య‌ల‌ను భ‌ర్త‌లు, భ‌ర్త‌ల‌ను భార్య‌ల‌ను హ‌త్య చేస్తున్న ఇలాంటి త‌రుణంలో ఇలా క‌డ‌వ‌ర‌కు నిల‌వ‌డ‌మే కాకుండా. 100 ఏళ్ల‌కు ద‌గ్గ‌ర ప‌డుతోన్న త‌రుణంలో కూడా భార్య కోరిక‌ను నిజం చేసిన ఈ తాత నిజంగానే ఈ త‌రం జంట‌ల‌కు ఆద‌ర్శం అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు క‌దూ!

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
Recommended image2
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం
Recommended image3
ఇంగ్లిష్‌ను నాన్ నేటివ్ భాషగా ఎలా పరిగణిస్తారు? CBSE భాషా విధానంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు
Related Stories
Recommended image1
Car: రూ. 68 వేలు డౌన్‌పేమెంట్, నెల‌కు రూ. 10 వేలు EMI క‌డితే చాలు.. ఈ కారు మీ సొంతం
Recommended image2
Silver Price: వెండి @ రూ. 2 ల‌క్ష‌లు.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved