చిరంజీవి సినిమా కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు షాకుల మీద షాకులిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా మెగాస్టార్ మూవీకి సంబంధించి ఈయంగ్ డైరెక్టర్ ఇచ్చిన అప్ డేట్ కు ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమా అనిల్ రావిపూడితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. అంతే కాదు ఈమూవీ షూటింగ్ విషయంలో మెగా ఫ్యాన్స్ కు వరుస సర్ ప్రైజ్ లు ఇస్తున్నాడు అనిల్ రావిపూడి.
జెట్ స్పీడ్ తో మెగా 157 సినిమా షూటింగ్
మెగా 157' వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా చేసేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఆయన స్పీడ్ కు చిరంజీవి కూడా ఆశ్చర్చపోతున్నారు. ఈమధ్యనే ఈసినిమా సెకండ్ షెడ్యూల్ సెట్స్ మీదకు వెళ్లగా... అప్పుడే ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ ను అందించాడు అనిల్. ముస్సోరీలోని సుందరమైన ప్రదేశాలలో జరుగుతున్న రెండవ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తయినట్లు టీమ్ ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈలెక్కన రెండు మూడు నెలల్లో సినిమా మొత్తం కంప్లీట్ చేస్తారేమో అని ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు.
కామెడీ ఎంటర్టైనర్ గా మెగాస్టార్ 157 మూవీ
ఫెయిల్యూర్ అంటూ తెలియని దర్శకుడు అనిల్ రావిపూడి. ఈమెగా మూవీని పూర్తిస్థాయిలో తనదైన కామెడీ మార్క్ తో తెరకెక్కిస్తున్నారు. కామెడీతో పాటు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈసినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో చాలా ముఖ్యమైన పోర్షన్ ను కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. ముస్సోరీ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. ఈ షెడ్యూల్ జరుగుతుండగానే హీరోయన్ నయనతార కూడా ఇందులో జాయిన్ అయినట్టు తెలుస్తోంది.
హీరో, హీరోయిన్లపై కొన్ని ముఖ్యమైన సీన్స్ ను సెకండ్ షెడ్యూల్ లోనే కంప్లీట్ చేశాడు దర్శకుడు. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి, నయనతార మధ్య ముస్సోరీ లోకేషన్స్ లో అందమైన డ్యూయెట్ ను కూడా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో, తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు మూవీ టీమ్ ఏర్పాట్లు చేసుకుంటుంది. నెక్ట్స్ ప్లాన్ ఏంటి, ఎక్కడ షూటింగ్ చేయబోతున్నారు అన్న విషయంపై మాత్రం టీమ్ క్లారిటీ ఇవ్వలేదు.
మెగా 157 షూటింగ్ పై అనిల్ రావిపూడి ట్వీట్
చిరంజీవి సినిమా సెకండ్ షెడ్యూల్ కు సబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. "2026 సంక్రాంతికి మెగా 157తో వినోదం పంచడానికి సిద్ధంగా ఉన్నాం. తదుపరి షెడ్యూల్‌ను ఉత్సాహంగా ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నాం" అని అనిల్ రావిపూడి పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ తో పాటు ఓ పోస్టర్ ను కూడా ఆయన రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
ద్విపాత్రాభినయం చేయబోతున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో డ్యూయల్ రోల్ చేసి ఫ్యాన్స్ ను అలరించారు. ముగ్గరు మొనగాళ్లు సినిమాలో ట్రిపుల్ రోల్ కూడా చేసి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 మూవీలో కూడా మెగాస్టార్ రెండు పాత్రలు చేశారు. ఇక దాదాపు 8 ఏళ్ళ తరువాత ఈ సినిమాలో చిరంజీవి మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఒక పాత్ర పాత చిరంజీవిని గుర్తు చేసేలా మలిచినట్టు సమాచారం. అంతే కాదు మరో పాత్ర పూర్తి యాక్షన్ మోడ్‌లో ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
అయితే చిరంజీవి ద్విపాత్రాభినయంపై మూవీ టీమ్ నుంచి మాత్రం ఎటువంటి అధికారికి ప్రకటన రాలేదు. కాని ఈసినిమాలో చిరంజీవి రెండు పాత్రలకు శివశంకర్, వరప్రసాద్ అని పేరు కూడా పెట్టినట్టు వార్త వైరల్ అవుతోంది. ఈరూమర్ నిజమయితే మెగా అభిమానులకు డబుల్ బోనాంజ పక్కా. అటు కామెడీ, ఇటు యాక్షన్ రెండు రకాలుగా ఆడియన్స్ ఎంటర్ టైన్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ విషయం ఎంత వరకూ నిజమో చూడాలి.
కొన్నేళ్ళుగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తున్న మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికి గుర్తుకు వచ్చేది యాక్షన్ సీన్స్, డాన్స్, ఎమోషన్, ఆతరువాత అందులో కామెడీ కూడా వచ్చి చేరింది. చిరంజీవి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన అభిమానులు చిరంజీవి చేసే ఫైటింగ్స్, డాన్స్ ను ఎంత ఎంజాయ్ చేస్తారో.. ఆయన కామెడీ సీన్స్ కూడా అదే రేంజ్ లో నవ్వుకుంటారు. జై చిరంజీవ, శంకర్ దాదా లాంటి సినిమాల్లో మెగా మార్క్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక గత కొన్నేళ్లుగా యాక్షన్ డ్రామాలు మాత్రమే చేస్తున్న చిరంజీవి, ఈసారి పూర్తిస్థాయి కామెడీతో ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నారు. గతంలో అదే కామెడీని బేస్ చేసుకుని ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నామ్ లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అనిల్ రావిపూడి, అదే ఊపు మీద చిరంజీవి సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ కొట్టాలని పట్టుదలగా పనిచేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నం సినిమాతో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ ను అందించిన భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి అనిల్ రావిపూడి కామెడీ మార్క్ ఈసారి ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.
చిరంజీవి విశ్వంభర సినిమా పరిస్థితి ఏంటి?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా విశ్వంభర. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికి రావాలి. కాని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం చిరు ఈడేట్ ను త్యాగం చేసినట్టు తెలుస్తోంది. ఇక మరో సంక్రాంతి రిలీజ్ చేయడానికి అనిల్ రావిపూడి సినిమా రెడీ చేస్తున్నారు. అయితే విశ్వంభర వచ్చేది ఎప్పుడో మాత్రం చెప్పడం లేదు. ఈ మూవీని పక్కనపెట్టేసి.. చిరు అనిల్ రావిపూడి సినిమాలో బిజీ అయ్యారు. దీంతో విశ్వంభర పరిస్థితి ఏంటి అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.? ఎందుకు రిలీజ్ చేయడం లేదు..? అప్ డేట్స్ ఎందుకు ఇవ్వడం లేదు అంటూ మెగా ఫ్యాన్స్ మైండ్ లో అనేక ప్రశ్నలు.
ఇంతకీ విశ్వంభర తెర వెనుక ఏం జరుగుతుందంటే.. ఈసినిమాకు సబంధించి సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉందట. ఇప్పుడు ఆ సాంగ్ ను ఎవరితో చేయాలి అనేది ఆలోచిస్తున్నారట మేకర్స్.తమన్నా, పూజా హేగ్డే, సమంత, పాయల్ రాజఫుట్.. వీళ్లలో ఎవరితో సాంగ్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారట. ఇక ఈసినిమా రిలీజ్ విషయానికి వస్తే.. సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ కు ఉంది. ఒక వేళ అది రిలీజ్ అవ్వకపోతే ఆ డేట్ ను లాక్ చేసుకోవాలని చూస్తున్నారట మేకర్స్. మరి ఈ విషయంలో టీమ్ ఏం క్లారిటీ ఇస్తారో చూడాలి.
చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ ఎప్పుడు?
అనిల్ రావిపూడి మెగా ప్రాజెక్ట్ కోసం అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుండటంతో ఎంత వీలైతే అంత త్వరగా ఈసినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అటు విశ్వంభర రిలీజ్ డేట్ కూడా లాక్ అవ్వాల్సి ఉంది. మరి విశ్వంభర డేట్ ఎప్పుడిస్తారో దాన్ని బట్టి అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ డేట్ ఉండే అవకాశం ఉంది.
ఇక ఇప్పటి వరకూ వినిపిస్తున్న టాలీవుడ్ టాక్ ప్రకారం ఈసినిమాను 2026 సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ తో పాటు అప్ డేట్స్ విషయంలో స్పీడ్ చూపిస్తున్న అనిల్ రావిపూడి త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. అంతే కాదు ఈసినిమా టైటిల్ ను కూడా టీమ్ ప్రకటించాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్ డే సందర్భంగా ఈసినిమా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.