- Home
- Business
- Recharge plan: 365 రోజులు వ్యాలిడిటీ, రోజుకు 2.5 జీబీ.. రోజుకు రూ. 10 మాత్రమే. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్
Recharge plan: 365 రోజులు వ్యాలిడిటీ, రోజుకు 2.5 జీబీ.. రోజుకు రూ. 10 మాత్రమే. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్
ప్రస్తుతం అన్ని టెలికం కంపెనీలు కచ్చితంగా రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయి. దీంతో చాలా మంది ఇన్‌కమింగ్ కాల్స్ కోసమైనా రీఛార్జ్ చేస్తున్నారు. అలాంటి వారికోసం ఒక బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది.

జియో రీఛార్జ్ ప్లాన్
ప్రస్తుతం దేశంలో టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో, తమ వినియోగదారులకు నిత్యం కొత్త ఆఫర్లు అందిస్తోంది. ముఖ్యంగా, నెలనెలా రీఛార్జ్ చేయడం ఇష్టం లేని వినియోగదారులకు దీర్ఘకాలిక ప్లాన్లపై ఎక్కువ ఆసక్తి ఉంటోంది.
అటువంటి వారికోసం జియో ఇప్పుడు ఉత్తమ వార్షిక ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కసారి రూ.3599 చెల్లిస్తే మొత్తం ఏడాది పాటు నెట్‌వర్క్ సేవలతో పాటు, ఎన్నో అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి.
365 రోజుల వాలిడిటీతో
రూ.3599 రీఛార్జ్ ప్లాన్ ద్వారా మీరు 365 రోజుల పాటు జియో సేవలను నిరవధికంగా వాడుకోవచ్చు. అంటే నెలసరి రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెలా రీఛార్జ్ చేయాలన్న టెన్షన్ ఉండదు. ఉన్నట్లుండి మధ్యలో సేవలు నిలిచిపోతాయన్న టెన్షన్ ఉండకుండా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. వ్యాపారులు, ఉద్యోగులు, ప్రయాణికులు లాంటి ఎక్కువగా బయట తిరిగే వారు ఈ ప్లాన్‌ను ఎంచుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బెనిఫిట్స్ ఏంటంటే.?
ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ లభిస్తుంది. రోజుకు ఎన్ని గంటలైనా మాట్లాడొచ్చు. అంతేకాకుండా, ప్రతి రోజు 100 SMSలు ఉచితంగా పంపే అవకాశం ఉంటుంది. చాట్ ఆధారంగా కమ్యూనికేషన్ చేసే వారికి ఇది ఒక బోనస్ లాంటిది.
డేటా విషయానికొస్తే
ఇక స్మార్ట్ ఫోన్ యూజర్లకు కూడా ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ప్లాన్‌లో Jio వినియోగదారులకు రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. మొత్తం ప్లాన్ పరంగా చూస్తే ఇది 912GB డేటా లభిస్తుంది.
ఈ డేటా మొత్తం 4G స్పీడ్‌తో అందుతుంది. 5G అర్హత కలిగిన మొబైల్, సిమ్ ఉన్నవారికి అపరిమిత 5G డేటా కూడా ఉచితంగా లభిస్తుంది. అంటే, యూట్యూబ్, OTT, గేమింగ్, వీడియో కాల్స్ వంటి అవసరాలకు ఆగకుండా బ్రౌజింగ్ చేయవచ్చు.
ఓటీటీ సేవలు కూడా
ఈ వార్షిక ప్లాన్‌లో ఓ ప్రత్యేక ఆకర్షణ – జియో సబ్‌స్క్రైబర్లకు 90 రోజుల పాటు డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం యాక్సెస్ ఉచితంగా పొందొచ్చు. అంటే మూడు నెలలు మీరు మువీస్, వెబ్‌సిరీస్, క్రీడా కార్యాక్రమాలు అన్నింటినీ చూసుకోవచ్చు.
అంతేకాదు, ఈ ప్లాన్ ద్వారా మీరు Jio Cloud నుంచి 50GB వరకు డేటా స్టోరేజ్‌ను ఉచితంగా పొందొచ్చు. మీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌ను సురక్షితంగా స్టోర్ చేసుకునేందుకు ఇది బెస్ట్ ఆప్షన్. అదనంగా, JioTV కూడా ఇందులో ఉచితంగా పొందొచ్చు.
ఈ ప్లాన్ ఎవరికి సెట్ అవుతుంది అంటే.?
ప్రతీ నెల రీఛార్జ్ చేయడం ఇబ్బందిగా ఉండే వారికి, ఉన్నట్లుండి యాక్టివ్ ప్లాన్ కట్ అయితే ఇబ్బంది పడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. అలాగే ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించే వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. రోజుకు కేవలం రూ. 10తో 2.5 జీబీతో పాటు అన్‌లిమిటెడ్ 5జీబీ సేవలు లభించడం విశేషం. అలాగే హాట్‌స్టార్ ఓటీటీని కూడా ఆస్వాదించవచ్చు.