తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
12:44 AM (IST) May 07
IPL 2025 MI vs GT: ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ లవర్స్ కు మస్తు మజాను పంచింది. ఇరు జట్లు గెలుపు కోసం అద్భుతంగా పోరాడాయి. మధ్యలో వర్షం మ్యాచ్ ను అటుఇటుగా తీసుకెళ్తూ ఉత్కంఠను పెంచింది. కానీ, చివరికి జీటీ విజయం సాధించింది.
12:08 AM (IST) May 07
IND vs ENG: భారత జట్టు జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తోంది. అక్కడ 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. జట్టు ఇంకా ప్రకటించలేదు. ఈ లోపు, టీమ్ ఇండియాకు గేమ్ ఛేంజర్స్‌గా నిలిచే 5 మంది ఆటగాళ్ల నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:32 PM (IST) May 06
India Pakistan tensions: భారత్ పాకిస్తాన్‌తో ఉన్న సింధు నది నీటి ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో ప్రధాని మోడీ భారతీయ నీరును దేశ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తామని ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ పై కఠిన చర్యలు కొనసాగుతూనే ఉంటాయనే సంకేతాలు పంపారు.
11:04 PM (IST) May 06
Indo Pak border tension: సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఫేక్ అడ్వైజరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ ఏజెన్సీలు దీనిని పూర్తిగా తప్పుడు సమాచారం అని ఖండించాయి.
10:57 PM (IST) May 06
Gali Janardhan Reddy: ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్షను విధించింది నాంపల్లి సీబీఐ కోర్టు. ప్రభుత్వానికి రూ.884 కోట్ల నష్టానికి కారణమైన ఈ మైనింగ్ కేసు 15 ఏళ్లుగా విచారణలో నడిచింది.
పూర్తి కథనం చదవండి10:15 PM (IST) May 06
BrahMos Missile 800km Range: పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, బ్రహ్మోస్ క్షిపణి ఇటీవల బంగాళాఖాతంలో జరిపిన పరీక్షల్లో 800 కి.మీల పరిధిని విజయవంతంగా పూర్తి చేసిందని సంబంధిత వర్గాలు మంగళవారం ధ్రువీకరించాయి.
పూర్తి కథనం చదవండి09:45 PM (IST) May 06
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ధోనీపై నమ్మకం కోల్పోయినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ చివర్లో చెన్నై టీమ్ యంగ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మరి ధోని సంగతేంటి? ఏం చేయబోతున్నారు?
పూర్తి కథనం చదవండి09:34 PM (IST) May 06
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్‌లోని చాలా మంది నటీమణులతో ప్రేమ సంబంధాలు కలిగి ఉన్నారు. ఎవరితో ఇమ్రాన్ ఖాన్ పేరు వినిపించిందో చూద్దాం.
09:24 PM (IST) May 06
కియారా అద్వానీ నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. 'ఫగ్లీ' నుండి 'కళంక్' వరకు, ఈ ఫ్లాప్ సినిమాల గురించి తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి
09:11 PM (IST) May 06
India UK Free Trade Agreement: భారత్, UK మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడం దీని లక్ష్యం.విస్కీ, కార్లు లాంటి వస్తువులపై పన్ను తగ్గింపు ఉంటుంది. ఈ ఒప్పందం రెండు దేశాలకూ ఆర్థికంగా మేలు చేస్తుందని భావిస్తున్నారు.
పూర్తి కథనం చదవండి08:39 PM (IST) May 06
India Pakistan Tensions: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్ ISI ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగిన సమయంలో ఇది జరగడం హాట్ టాపిక్ గా మారింది.
పూర్తి కథనం చదవండి08:18 PM (IST) May 06
New ration cards registration: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ, మార్పులు చేర్పులు చేసుకోవడం కోసం నమోదు ప్రక్రియను ప్రారంభించింది. జూన్‌లో స్మార్ట్ కార్డులు జారీకి సన్నాహాలు చేస్తోంది. అయితే, కొత్త రేషన్ కార్డులకు ఎలా అప్లై చేసుకోవాలి? మార్పుల కోసం ఎవరిని సంప్రదించాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
07:46 PM (IST) May 06
Healthy Drinks: పిల్లలు ఎప్పుడూ కూల్ డ్రింక్స్ తాగుతామని మారాం చేస్తుంటారు కదా.. బయట ఏది పడితే అది కొనిచ్చే బదులు ఇంట్లోనే కాస్త ఓపిగ్గా ఈ 5 రకాల డ్రింక్స్ లను తయారు చేసి ఇస్తే ఏ సీజన్ లో అయినా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ డ్రింక్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి07:31 PM (IST) May 06
Jobs in Endowments: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ దేవాదాయ శాఖలో 137 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. అలాగే, 16 ఆలయాల్లో అన్నదానాన కార్యక్రమం విస్తరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
07:12 PM (IST) May 06
Honda Elevate Apex: సమ్మర్ ఎడిషన్ గా హోండా ఎలివేట్ SUV అపెక్స్ కొత్త ఫీచర్లతో మళ్ళీ మార్కెట్లోకి వచ్చింది. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు హోండా కంపెనీ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అవేంటో తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి07:00 PM (IST) May 06
Vijay Deverakonda vs Tilak Varma: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ (MI) vs గుజరాత్ టైటాన్స్ (GT) మ్యాచ్‌కు ముందు ఇద్దరు తెలుగు స్టార్లు తిలక్ వర్మ, విజయ్ దేవరకొండలు పికిల్‌బాల్ ఆడారు. ఇదే క్రమంలో తిలక్ కు విజయ్ దేవరకొండ ఒక సవాల్ విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
06:38 PM (IST) May 06
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. రాజకీయాల్లో బిజీగా మారిన పవన్ తన సినిమా ప్రాజెక్టులకు డేట్స్ కేటాయించలేకపోయాడు. అయినప్పటికీ, చేతిలో ఉన్న మూడు సినిమాలను పరిస్థితుల్లోనైనా ఆగస్టు లోగా పూర్తిచేస్తానని నిర్మాతలకు ఇటీవల స్పష్టం చేశారు.
06:22 PM (IST) May 06
Andhra Pradesh Tourism: పర్యాటక రంగంలో 20% వృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రణాళికలతో ముందడుగు వేసిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సీఎం అదేశాలతో చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు.
06:09 PM (IST) May 06
గతంలో విశేష ప్రజాదరణ పొందిన బేబీ కిట్ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఈ పథకాన్ని గత ప్రభుత్వ కాలంలో నిలిపివేసిన సంగతి తెలిసిందే.
06:08 PM (IST) May 06
IPL 2025: టైటిల్ ఫేవరెట్ గా ఐపీఎల్ 2025 మెగా టోర్నీని ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ టోర్నీ చివరి దశకు చేరుకోకముందే దారుణ ప్రదర్శనలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ పలువరు స్టార్ ప్లేయర్లకు గుడ్ బై చెప్పడానికి సిద్ధమైందని క్రికెట్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.
05:42 PM (IST) May 06
తమ డిమాండ్లపై తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన చర్చల అనంతరం, తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) కార్మికులు మే 6 మంగళవారం తమ సమ్మెను విరమించారు. హైదరాబాద్‌లోని మంత్రివాసంలో జరిగిన చర్చల తర్వాత, ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాలు సమ్మె విరమించనున్నట్లు ప్రకటించాయి.
పూర్తి కథనం చదవండి05:18 PM (IST) May 06
liquor cost India: దేశంలోనే అత్యధిక మద్యం ధరలు కర్నాటకలో ఉన్నాయి. ఇక గోవాలో అయితే, దేశంలో అతితక్కువ మద్యం ధరలు ఉంటాయి. భారత్ లో వివిధ రాష్ట్రాల్లో మద్యం ధరల్లో తేడాలు ఎందుకు ఉంటాయి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
05:07 PM (IST) May 06
ఏదో నేరం చేసి పోలీసుల అదుపులో ఉన్న ఈ మహిళను చూస్తే అమాయకంగా కనిపిస్తోంది కదూ. అయితే ఈ లేడీ చాలా డేంజర్ కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపేందుకు కన్నింగ్ ప్లాన్ వేసింది. అయితే ప్లాన్ బెడిసి కొట్టడంతో ఇదిగో ఇలా పోలీసులకు దొరికిపోయింది.
పూర్తి కథనం చదవండి05:03 PM (IST) May 06
ఆయుర్దాయం, విద్య, ఆదాయంలో మెరుగుదలల కారణంగా భారతదేశం మానవ అభివృద్ధి సూచిక ర్యాంకింగ్ 2023లో 130కి చేరుకుంది.
పూర్తి కథనం చదవండి04:54 PM (IST) May 06
పహల్గాం దాడిని ఇప్పటికే అమెరికా ఖండించింది. తాజాగా ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు అన్ని విధాలా సాయం చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యలకు అమెరికా మద్దతు ఇస్తుందని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ చెప్పారు.
పూర్తి కథనం చదవండి04:45 PM (IST) May 06
పహల్గాం దాడి తర్వాత కశ్మీర్ లో 3,000 కంటే ఎక్కువ అరెస్టులు, దాదాపు 100 పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) నిర్బంధాలు జరిగాయని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేసారు.
పూర్తి కథనం చదవండి04:34 PM (IST) May 06
మీరు బెస్ట్ SUV కార్ కొనేందుకు ఆలోచిస్తున్నారా? ఏప్రిల్ 2025లో ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 SUV కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని పరిశీలిస్తే మీరు ఎలాంటి కారు కొనాలో ఒక ఐడియా వస్తుంది. టాప్ 5 SUV కార్ల వివరాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి04:32 PM (IST) May 06
భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఇల్తిజా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేసారు. పాక్ కు అనుకూలంగా మాట్లాడిన ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
పూర్తి కథనం చదవండి
04:18 PM (IST) May 06
పహల్గాంలో ఉగ్రదాడికి మూడురోజుల ముందే ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విషయం తెలుసని కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యల చేసారు.
పూర్తి కథనం చదవండి
04:16 PM (IST) May 06
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాలపై నాటి ఆరోపణలు ఇప్పుడొక కీలక దశను దాటాయి. 2009లో ఈ కేసుపై ప్రారంభమైన విచారణకు 15 ఏళ్ల అనంతరం సీబీఐ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు నాలుగు ప్రధాన నిందితులకు శిక్ష విధించగా, ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంది. ఈ తీర్పు యావత్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
04:04 PM (IST) May 06
High Blood Pressure Headach:: ఉరుకుల, పరుగుల జీవితంలో మనం ఎన్నో అనారోగ్య సమస్యల బారినపడుతున్నాం. చాలా మంది ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో సాధారణంగా తలనొప్పితో బాధపడుతుంటాం. అయితే.. తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్య నే అని భావిస్తుంటాం. కానీ, కొన్నిసార్లు తీవ్రమైన తలనొప్పికి దారి తీయవచ్చు. ఆ తలనొప్పి.. అధిక రక్తపోటు వల్ల వస్తుందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం.
పూర్తి కథనం చదవండి
03:59 PM (IST) May 06
15 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న చైనా ఇన్‌ఫ్లుయెన్సర్ జంట రూ. 266 కోట్లు సంపాదించాక లైవ్ స్ట్రీమింగ్‌కి వీడ్కోలు పలికారు. ఆరోగ్యం, కుటుంబం మీద దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇది చైనా సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది..
పూర్తి కథనం చదవండి03:59 PM (IST) May 06
భారత్‌తో యుద్ధంలో గెలిస్తే నటి మాధురి దీక్షిత్‌ను చేసుకుంటానని పాకిస్థాన్‌కు చెందిన మతగురువు చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి03:41 PM (IST) May 06
గత వైసీపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి అధికార దుర్వినియోగం చేసి కడప జిల్లాలో 52 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే..
పూర్తి కథనం చదవండి03:19 PM (IST) May 06
అలీగఢ్‌లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 24 ఏళ్ల టీచర్, తన 14 ఏళ్ల విద్యార్థిని ఇద్దరూ ఓయో రూమ్‌లో మృతదేహాలుగా కనిపించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
03:16 PM (IST) May 06
OnePlus Nord CE4 Lite: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం అమెజాన్ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. గతేడాది జూన్‌లో విడుదల చేసిన OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. దీని ధర, డిస్కౌంట్, ఫీచర్స్ తదితర వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి03:14 PM (IST) May 06
IPL స్ఫూర్తితో 1xBet నిర్వహించిన బిగ్ ఇండియన్ క్యాసినో లీగ్ విజయవంతంగా ముగిసింది. 14,000 మంది పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో రూ.3,63,500 ప్రైజ్ మనీ పంచబడింది. ఉత్తరాఖండ్ విజేతకు రూ.1.5 లక్షలు లభించాయి.
పూర్తి కథనం చదవండి02:50 PM (IST) May 06
ఈ వేసవిలో మీ ఇంటి కరెంట్ బిల్ తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ ఇంట్లో ఉండే ఫ్యాన్‌ను BLDC ఫ్యాన్‌గా మార్చేయండి. ఇది సాధారణ ఎలక్ట్రిక్ ఫ్యాన్‌తో పోలిస్తే తక్కువ విద్యుత్ ను ఉపయోగించుకుంటుంది. అంతేకాకుండా పనితీరులోనూ ది బెస్ట్ గా ఉంటుంది. ఇటీవల చాలా మంది వినియోగదారులు BLDC టెక్నాలజీపై మొగ్గుచూపుతున్నారు. అసలు BLDC టెక్నాలజీ గురించి, ఈ ఫ్యాన్స్ పనితీరు గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి02:43 PM (IST) May 06
దేశవ్యాప్తంగా మే 7న అంటే బుధవారం పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు నగరాలను మాక్ డ్రిల్ కోసం ఎంపికచేసారు. ఆ నగరాలేవి, ఈ మాక్ డ్రిల్ లో ఏం చేయనున్నారు? తెలుసుకుందాాం.
పూర్తి కథనం చదవండి02:32 PM (IST) May 06
భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జాతీయ స్థాయిలో భద్రతాపరమైన చర్యలు ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి, ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు కేంద్ర హోంశాఖ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది.