మీరు బెస్ట్ SUV కారు కొనాలనుకుంటున్నారా? టాప్ 5 కార్ల వివరాలు ఇవిగో
మీరు బెస్ట్ SUV కార్ కొనేందుకు ఆలోచిస్తున్నారా? ఏప్రిల్ 2025లో ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 SUV కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని పరిశీలిస్తే మీరు ఎలాంటి కారు కొనాలో ఒక ఐడియా వస్తుంది. టాప్ 5 SUV కార్ల వివరాలు తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
భారతదేశంలో ఒక 100 మందిని ఏ రకమైన కారు కొనాలనుకుంటున్నారని అడిగితే 60-70% మంది SUV కార్లనే కొనాలనుకుంటున్నామని చెబుతారు. అందుకే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో SUV కార్లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. పవర్ ఫుల్, స్టైలిష్ లుక్, మంచి సౌకర్యాలు, అద్భుతమైన పికప్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ వంటి కారణాల వల్ల ప్రజలు ఇప్పుడు SUV కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తక్కువ ధరలో చాలా మంచి SUV కార్లు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ లో ఉన్నది హుందయ్ కంపెనీ క్రెటా.
హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ మిడ్సైజ్ SUV అయిన క్రెటా, ఏప్రిల్‌లో 17,016 యూనిట్లు అమ్ముడై మొదటి స్థానాన్ని సంపాదించింది. ఇది రూ.11.11 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉండగా, మాక్స్ వేరియంట్ ధర రూ.20.50 లక్షలు. పెట్రోల్, డీజిల్ మోడళ్లతో పాటు క్రెటా EV మోడల్ కూడా మార్కెట్లో ఉంది. ఈ మోడల్ 10 ఏళ్లుగా నంబర్ 1 స్థానం నిలుపుకుంటోంది.
మారుతి సుజుకి బ్రెజ్జా
4 మీటర్ల కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు బ్రెజ్జా.. ఏప్రిల్‌లో 16,971 యూనిట్లు ఇది అమ్ముడయ్యింది. ఇది రూ.8.69 లక్షల నుంచి రూ.14.14 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుంది. ఈ బ్రెజ్జా కారు పెట్రోల్, CNG వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది.
మహీంద్రా స్కార్పియో (N & క్లాసిక్)
మహీంద్రా స్కార్పియో సిరీస్‌కు గ్రామీణ, పట్టణ మార్కెట్లలో విస్తృత ఆదరణ ఉంది. ఏప్రిల్‌లో స్కార్పియో-N, క్లాసిక్ కలిపి మొత్తం 15,534 యూనిట్లు అమ్ముడయ్యాయి. స్కార్పియో-N ధర రూ.13.99 లక్షల నుంచి రూ.24.89 లక్షల వరకు ఉంది. స్కార్పియో క్లాసిక్ ధర రూ.13.62 లక్షల నుంచి రూ.17.50 లక్షల వరకు ఉంది.
టాటా నెక్సాన్
టాటా మోటార్స్‌కి చెందిన చిన్న SUV అయిన నెక్సాన్ ఏప్రిల్‌లో 15,457 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది పెట్రోల్, డీజిల్, CNG, EV మోడళ్లలో అందుబాటులో ఉంది. నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.8 లక్షల నుంచి రూ.15.60 లక్షల వరకు ఉండగా, నెక్సాన్ EV ధర రూ.12.49 లక్షల నుంచి రూ.17.19 లక్షల వరకు ఉంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్
ఏప్రిల్‌లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ 14,345 యూనిట్ల అమ్మకాలతో టాప్ 5 SUVలలో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది. ఇది పెట్రోల్, CNG వేరియంట్లలో లభిస్తుంది. ఫ్రాంక్స్ ధర రూ.7.54 లక్షల నుంచి రూ.13.04 లక్షల వరకు ఉంది.