Honda Elevate Apex: సమ్మర్ ఎడిషన్ గా హోండా ఎలివేట్ SUV అపెక్స్ కొత్త ఫీచర్లతో మళ్ళీ మార్కెట్లోకి వచ్చింది. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు హోండా కంపెనీ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అవేంటో తెలుసుకుందాం రండి. 

జపనీస్ బ్రాండ్ అయిన హోండా కార్స్ ఇండియా తమ SUV ఎలివేట్ అపెక్స్ సమ్మర్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తిరిగి ప్రవేశపెట్టింది. మాన్యువల్ వెర్షన్ ధర రూ.12.39 లక్షలు కాగా CVT ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.13.59 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ ఎడిషన్ మొదట 2024 సెప్టెంబర్‌లో V, VX ట్రిమ్‌లలో విడుదలైంది. 

కొత్తగా వచ్చిన మార్పులివే..

అపెక్స్ ఎడిషన్ బ్యాడ్జ్‌లు, ఇతర ప్రత్యేక యాక్సెసరీలు వంటి చిన్న కాస్మెటిక్ మార్పులు అపెక్స్ ఎడిషన్‌లో చేర్చారు. ఇందులో డ్యూయల్ టోన్ తెలుపు, నలుపు రంగుల క్యాబిన్ థీమ్‌తో వస్తుంది. కొత్త లెదరెట్ సీట్ కవర్లు, డోర్ ట్రిమ్, ఆంబియంట్ లైట్లు, సీట్ కుషన్లు, 360 డిగ్రీ కెమెరాతో పాటు పెద్ద 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో ప్రత్యేక నలుపు, క్రోమ్ హైలైట్‌లు, 'అపెక్స్ ఎడిషన్' బ్యాడ్జ్‌లు ఉన్నాయి. 2025 హోండా ఎలివేట్ అపెక్స్ సమ్మర్ ఎడిషన్‌లో ఇతర మార్పులు లేవు.

ధర కూడా కాస్త ఎక్కువే

ఎలివేట్ SUV అపెక్స్ కారు 121 bhp, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ కలిగిన లిమిటెడ్ ఎడిషన్. దీని ధర కూడా సాధారణ V ట్రిమ్ తో పోలిస్తే కాస్త ఎక్కువే. సాధారణ V ట్రిమ్ తో పోలిస్తే ఎలివేట్ అపెక్స్ సమ్మర్ ఎడిషన్ ధర దాదాపు రూ.32,000 ఎక్కువగా ఉంది. 

ఈ ఎడిషన్‌లో నలుపు, ఐవరీ కలర్ థీమ్‌తో కూడిన డాష్‌బోర్డ్, ఐవరీ లెదరెట్ సీట్లు ఉన్నాయి. డోర్ ప్యాడ్‌లు, డాష్‌బోర్డ్‌లో సాఫ్ట్ టచ్ మెటీరియల్ వాడకం వాహనాన్ని మరింత ప్రీమియం చేస్తుంది. అపెక్స్ సమ్మర్ ఎడిషన్ బాహ్యంలో పెద్దగా మార్పులు లేవు. కానీ "అపెక్స్" బ్యాడ్జింగ్, పరిమిత రంగు ఎంపికలు దీనిని ప్రత్యేకంగా చేస్తాయి. భద్రత కోసం ఈ ఎడిషన్‌లో ప్రామాణిక ఫీచర్‌గా 360 డిగ్రీ కెమెరా అమర్చారు. ఇది ఇప్పుడు VX ట్రిమ్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

హోండా ఎలివేట్‌కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్

2025 ఏప్రిల్‌లో జపాన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (JNCAP)లో భారతదేశంలో తయారైన హోండా ఎలివేట్‌కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఎలివేట్ జపాన్‌లో హోండా WR-V పేరుతో అమ్ముడవుతోంది.

SUV జపాన్ స్పెక్ మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ మౌంట్ సీట్లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్, EBDతో కూడిన ABS, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, కెమెరాతో పాటు ప్రామాణిక భద్రతా ఫీచర్‌గా హోండా సెన్సింగ్ సిస్టమ్ (ADAS) లభిస్తుంది.