సారాంశం

పహల్గాంలో ఉగ్రదాడికి మూడురోజుల ముందే ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విషయం తెలుసని కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యల చేసారు. 

 

 

ఏప్రిల్ 22న పహల్గాం దాడికి మూడు రోజుల ముందు జమ్మూ కాశ్మీర్‌లో జరగబోయే దాడిగురించి ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేసారు. నిఘా నివేదిక అందిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. కానీ సామాన్య ప్రజల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని... అందువల్లే టూరిస్ట్ లు చనిపోయారని పేర్కొన్నారు. 

సంవిధాన్ బచావో ర్యాలీలో కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే  ప్రసంగిస్తూ.. "పహల్గాం ఉగ్రదాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది, ప్రభుత్వం దానిని అంగీకరించింది. అంటే ఉగ్రదాడి గురించి ముందే తెలిసి ఉంటే ఎందుకు ఏ చర్యలు చేపట్టలేదు?... దాడికి 3 రోజుల ముందు ప్రధాని మోదీకి ఒక నిఘా నివేదిక పంపబడింది, అందుకే ఆయన కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని నాకు సమాచారం అందింది, నేను దీన్ని ఒక వార్తాపత్రికలో కూడా చదివాను" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

పహల్గాం ఉగ్రదాడిలో నిఘా వైఫల్యం జరిగిందని ప్రభుత్వం అంగీకరించిందని ఖర్గే అన్నారు. "ఉగ్రదాడిలో నిఘా వైఫల్యాన్ని అంగీకరించారు. దాన్ని మెరుగుపరుస్తామని చెప్పారు. మా ప్రశ్న ఏమిటంటే మీకు ఉగ్రదాడి గురించి ముందే తెలిసినప్పుడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు?" అని ఖర్గే ప్రశ్నించారు.

కశ్మీర్ లోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు టూరిస్టులపై దాడి చేసిన ఘోరంగా చంపిన విషయం తెలిసిందే. పర్యాటకులపై విచక్షణారహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపేసారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇదొకటి. ఈ దాడిలో 26 మంది మరణించారు, వీరిలో ఎక్కువ మంది పర్యాటకులే... వీరంతా హిాందువులే.