దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కొత్త కేసులు నమోదవుతాయి. కరోనా కేసులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు ఈరోజు ఐపీఎల్ లో భాగంగా జరగనున్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అప్డేడ్స్. అలాగే హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల వివరాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:46 PM (IST) May 25
ముందుగా రిటైర్ అవ్వాలన్న ఆలోచన ఉన్న వారు సరైన పెన్షన్ ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలి. నెలకు రూ.లక్ష పెన్షన్ రావాలంటే చాలా ఎక్కువ దాచాలని అనుకుంటారు. కాని ఈ టెక్నిక్స్ పాటిస్తే ఈజీగా నెలకు రూ.లక్ష సంపాదించొచ్చు. 40 ఏళ్లకే రిటైర్మెంట్ కూడా తీసేసుకోవచ్చు.
11:41 PM (IST) May 25
IPL 2025 SRH vs KKR: బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025లో తన చివరి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది.
11:17 PM (IST) May 25
Kakani Govardhan Reddy: వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగిలింది. వైకాపా నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు అయ్యారు. కేరళలో ఏపీ పోలీసులు అయనను అరెస్టు చేశారు.
10:18 PM (IST) May 25
Heinrich Klaasen: ఐపీఎల్ 2025లో హైన్రిచ్ క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. దీంతో యూసుఫ్ పఠాన్ 15 ఏళ్ల ఐపీఎల్ రికార్డును సమం చేశాడు. క్లాసెన్ సూపర్ సెంచరీ నాక్ తో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 278/3 పరుగులు చేసింది.
09:25 PM (IST) May 25
SRH vs KKR IPL 2025: ఐపీఎల్ 2025లో తమ చివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు అద్భుతమైన బ్యాటింగ్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ను చితక్కొట్టారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు పరుగుల వర్షం తెప్పిస్తే.. హెన్రిచ్ క్లాసెన్ సునామీగా మార్చాడు.
09:19 PM (IST) May 25
ఆన్ లైన్ డేటింగ్.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కొత్త కల్చర్ ఇది. ఈ ఆన్ లైన్ డేటింగ్ మనుషుల మధ్య బంధాలను ఆర్టిఫీషియల్ గా మార్చేసింది. అయితే ఈ డిజిటల్ ప్రపంచంలో కూడా బంధాలను బలోపేతం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
08:51 PM (IST) May 25
SRH vs KKR IPL 2025: కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దుమ్మురేపే బ్యాటింగ్ పరుగుల సునామీ తెచ్చారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ లు కోల్ కతా బౌలింగ్ ను చితక్కొట్టారు.
08:07 PM (IST) May 25
Black Magic Ritual: ఏప్రిల్ 26న మధ్యప్రదేశ్ అడవి బఫర్ జోన్‌లో ఒక పులి చనిపోయి కనిపించింది. దాని గోళ్ళు, కోరలు కూడా కనిపించలేదు. ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
07:39 PM (IST) May 25
IPL 2025 GT vs CSK: బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ఆటతో గుజరాత్ టైటాన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇచ్చింది. తమ చివరి మ్యాచ్ ను గెలిచి ఐపీఎల్ 2025 సీజన్ ను సీఎస్కే ముగించింది.
06:39 PM (IST) May 25
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హై యాక్షన్ ఎంటర్టైనర్ 'ఓజీ' (OG) సినిమా తాజాగా భారీ అప్‌డేట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
06:33 PM (IST) May 25
గేమ్ ఛేంజర్ సినిమాలో దర్శకుడు శంకర్ తో పని చేయడం తనకు చేదు అనుభవం అని ప్రముఖ ఎడిటర్ షమీర్ ముహమ్మద్ అన్నారు. ఇంతకీ ఆయన ఎందుకు ఈ కామెంట్ చేశారు.
06:03 PM (IST) May 25
Ayush Mhatre: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యంగ్ ప్లేయర్ అయుష్ మాత్రే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో ఒకే ఓవర్ లో 28 పరుగులతో సునామీ రేపాడు.
05:11 PM (IST) May 25
Kush Maini: ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన మొనాకో స్ప్రింట్ రేసులో భారత రేసర్ కుష్ మైని చరిత్ర సృష్టించాడు. మొనాకోలో F2 రేసు గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
04:42 PM (IST) May 25
Preity Zinta: ఐపీఎల్ టీమ్ పంజాబ్ కింగ్స్ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా అమరవీరులైన సైనికుల భార్యలు, పిల్లలకు భారీ విరాళం ప్రకటించారు. పంజాబ్ కింగ్స్ XI సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ మొత్తాన్ని అందజేశారు.
03:37 PM (IST) May 25
ఇప్పుడు కార్లలో సన్‌రూఫ్ అనేది అందరూ కోరుకునే ఫీచర్. ఇండియాలో అలాంటి కార్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. అందుకే కంపెనీలు కూడా సన్‌రూఫ్ ఉన్న ఎస్‌యూవీ కార్లను ఎక్కువగా తయారు చేస్తున్నాయి. రూ.10 లక్షల లోపు ధర ఉన్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
02:57 PM (IST) May 25
వచ్చే నెలలో జ్యోతిష్యపరంగా కీలక మార్పు జరగనుంది. ఖగోళపరంగా జరగనున్నా ఈ మార్పు ద్వారా 3 రాశుల వారి జీవితాల్లో అనూహ్య మార్పులు రానున్నాయని పండితులు చెబుతున్నారు. ఇంతకా రాశులు ఏవంటే..
02:24 PM (IST) May 25
మీరు కారు లేదా బైక్ కొనాలని అనుకుంటున్నారా? మీ దగ్గర ఆ వెహికల్ కొనడానికి ఫుల్ గా డబ్బులు ఉన్నాయా? మొత్తం డబ్బు పెట్టి కొనేయకండి. కచ్చితంగా ఫైనాన్స్ తీసుకొనే కొనండి. ఎందుకంటే దీని వెనుక ఒక లాజిక్ ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి.
02:04 PM (IST) May 25
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమాలో ఆరుగురు హీరోయన్లు నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ వారెవరు. అట్లీ ఏం చేయబోతున్నాడు.
01:45 PM (IST) May 25
ఇతర గ్రహాలపైకి ప్రయాణం అనగానే హాలీవుడ్ మూవీస్ గుర్తొస్తాయి. కానీ ఇది త్వరలోనే సాకారం కానుందని పరిశోధకులు చెబుతున్నారు.
01:06 PM (IST) May 25
విరాట్ కోహ్లీ, అనుష్క ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత విరుష్క కపుల్ పలు ప్రదేశాలను సందర్శిస్తున్నారు.
12:51 PM (IST) May 25
పగలు ఎలా ఉన్నా రాత్రి తిన్నది సరిగ్గా అరిగితేనే ఆరోగ్యంగా ఉండగలం. రాత్రి పూట ఏం తింటే ఆరోగ్యంగా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం.
12:24 PM (IST) May 25
ప్రధాని మోడీ తన రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇది ఈ కార్యక్రమంలో 122వ ఎపిసోడ్. తన ప్రసంగంలో, ప్రధాని మోడీ అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు.
11:16 AM (IST) May 25
సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేస్తుంటారు. అయితే సేవింగ్స్ ఎక్కడ చేయాలన్న దానిపై చాలా మందిలో స్పష్టత ఉండదు. అలాంటి వారి కోసమే ఒక మంచి పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం.
11:13 AM (IST) May 25
దేశం కోసం ప్రాణాలు అడ్డుగా పెట్టి పోరాడుతున్న సైనికులరక్షణ కోసం ఎంతో మంది విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాగా బాలీవుడ్ సీనియర్ హిరోయిన్ ప్రీతి జింటా కూడా ఆర్మీ కోసం భారీ విరాళం ప్రకటించింది.
10:56 AM (IST) May 25
బలగం సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు జీవీ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ చిత్రంలో హీరో ప్రియదర్శికి తాత పాత్ర అయిన అంజన్నగా జీవీ బాబు నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
10:13 AM (IST) May 25
బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని అఖిల పక్షాల ప్రతినిధి బృందంలో భాగమైన అసదుద్దీన్ ఓవైసీ, ఉగ్రవాద సంస్థలు అమాయక ప్రజలను చంపడానికి మతాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు. ఇస్లాం ఉగ్రవాదాన్ని ఖండిస్తోందని ఆయన అన్నారు.
09:45 AM (IST) May 25
09:25 AM (IST) May 25
09:05 AM (IST) May 25
భారత ప్రభుత్వం తొలిసారిగా జీనోమ్ ఎడిటెడ్ బియ్యం రకాలకు ఆమోదం తెలిపింది. సుదీర్ఘ పరిశోధన ఫలితంగా ఈ కొత్త రైస్ సృష్టించారు. ఇందులో విదేశీ డీఎన్ఏ (జీఎంఓ) ఉపయోగించలేదు.
07:09 AM (IST) May 25
ఇటీవల చాలా మంది గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన శైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. అయితే ఉదయం లేవగానే కొన్ని చిట్కాలు పాటిస్తే గ్యాస్ సమస్య నుంచి ఉపమశనం లభిస్తుంది.
06:57 AM (IST) May 25
ఎండకాలం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాలను ఈసారి రుతుపవనాలు ముందుగానే పలకరించనున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో వచ్చే రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.