నెలకు లక్ష పెన్షన్.. 40 ఏళ్లకే రిటైర్మెంట్ కూడా తీసుకోవచ్చు: ప్లాన్ ఏంటంటే..?
ముందుగా రిటైర్ అవ్వాలన్న ఆలోచన ఉన్న వారు సరైన పెన్షన్ ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలి. నెలకు రూ.లక్ష పెన్షన్ రావాలంటే చాలా ఎక్కువ దాచాలని అనుకుంటారు. కాని ఈ టెక్నిక్స్ పాటిస్తే ఈజీగా నెలకు రూ.లక్ష సంపాదించొచ్చు. 40 ఏళ్లకే రిటైర్మెంట్ కూడా తీసేసుకోవచ్చు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రిటైర్మెంట్ ప్లానింగ్
ముందుగానే రిటైర్ అవ్వడం అంటే ఉద్యోగం నుండి విరమణ పొందడం మాత్రమే కాదు. ఆర్థిక స్వేచ్ఛను సాధించడం కూడా. అంటే మీ జీవిత కాలం ఖర్చుల కోసం పని చేయడానికి బదులుగా, అవసరమైన డబ్బును ముందుగానే ఆదా చేసుకోవడం అన్నమాట. ఇది సాధించడం అంత ఈజీ కాదు. కాని ప్రణాళిక ఉంటే 40 ఏళ్లకే రిటైర్ అయిపోవచ్చు.
నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి?
ఆర్థిక స్వాతంత్య్రం కోసం ప్లాన్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతాయి. ఎప్పుడు ప్రారంభించాలి? నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి? రిటైర్మెంట్ సమయంలో ఎంత డబ్బు అవసరం? ఎంత కాలంలో ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే మీ భవిష్యత్ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది.
రిటైర్మెంట్ కి ఎంత వస్తుంది?
ఉదాహరణకి 25 ఏళ్ల వ్యక్తి నెలవారీ ఖర్చు రూ.30,000 అనుకుందాం. ద్రవ్యోల్బణం సంవత్సరానికి 6% ఉంటే, 15 సంవత్సరాలలో అదే ఖర్చు రూ.1,00,000 అవుతుంది. అందుకే రూ.లక్ష పెన్షన్ లక్ష్యంగా పెట్టుకుంటే నెలకు రూ.20,000 పెట్టుబడి పెట్టి, ప్రతి సంవత్సరం 5% పెంచుకుంటూ సంవత్సరానికి 14% రాబడి వస్తే 40 ఏళ్లకు ఆ వ్యక్తి దగ్గర రూ.2.04 కోట్లు ఉంటాయి.
మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్
రూ.2.04 కోట్ల మొత్తాన్ని ఒకేలా రాబడి ఇచ్చే చోట పెట్టుబడి పెడితే నెలకు ఈజీగా రూ.1,00,000 ఆదాయం వస్తుంది. అందువల్ల తక్కువ రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మేలు. 7% రాబడి ఇచ్చే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ తక్కువ రిస్క్ ఉన్నవి. ఇది భవిష్యత్ ఖర్చులను ఎదుర్కోవడానికి ఒక స్థిరమైన మార్గాన్ని సృష్టిస్తుంది.
పెన్షన్ రాబడి
ఈ నెలవారీ ఆదాయ పథకంలో 30 సంవత్సరాలు రూ.1,00,000 నెలకు పొందవచ్చు. ఆ తర్వాత కూడా ఆ నిధిలో రూ.9.82 కోట్లు వరకు మిగిలి ఉండే అవకాశం ఉంది. ఇది మీ కుటుంబానికి భద్రమైన ఆర్థిక వనరుగా ఉంటుంది.
కానీ ఈ లెక్కలు కేవలం అవగాహన కోసం మాత్రమే. రిటైర్మెంట్ ప్లాన్ వేసుకునే ముందు ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.