Astrology: 18 ఏళ్ల తర్వాత రాజయోగం.. జూన్ 7 నుంచి ఈ 3 రాశుల వారి జీవితం మారనుంది.
వచ్చే నెలలో జ్యోతిష్యపరంగా కీలక మార్పు జరగనుంది. ఖగోళపరంగా జరగనున్నా ఈ మార్పు ద్వారా 3 రాశుల వారి జీవితాల్లో అనూహ్య మార్పులు రానున్నాయని పండితులు చెబుతున్నారు. ఇంతకా రాశులు ఏవంటే..

అరుదైన సంఘటన:
వచ్చే నెల 7వ తేదీ నుంచి ఖగోళ పరంగా కీలకమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కుజుడు (మంగళగ్రహం) సింహరాశిలో ప్రవేశించనున్నాడు. అక్కడ ఇప్పటికే కేతువు ఉండడంతో, ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఒక శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది.
ఇది 18 సంవత్సరాల తర్వాతనే ఏర్పడే అరుదైన గ్రహ సంఘటన. ఈ యోగం మూడు రాశులపై మంచి ప్రభావాన్ని చూపనుంది. ఆ రాశులవారికి ఆర్థికంగా, వ్యక్తిగతంగా, వృత్తి పరంగా అనేక అవకాశాలు అందుతాయి.
మిథున రాశి:
ఈ గ్రహ యోగం మిథున రాశి వారికి ఎన్నో లాభాలను తీసుకొస్తుంది. ఆదాయం పెరుగుతుంది, కొత్త అవకాశాలు లభించనున్నాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. సమాజంలో హోదా, గౌరవం పెరుగుతుంది. ఉద్యోగాల్లో కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. పై అధికారుల నుంచి పూర్తిగా సహకారం లభిస్తుంది
వృషభ రాశి:
వృషభ రాశివారికి ఈ యోగం ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఎక్కువ లాభాలను ఇస్తాయి. తీసుకునే ప్రతి ప్రాజెక్టు విజయవంతమవుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అతిథిగా ఆహ్వానం లభిస్తుంది. ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది అయితే దేవుడిని పూజించడం ద్వారా సమస్యలు దూరమవుతాయి.
వృశ్చిక రాశి:
కుజ, కేతు కలయిక వృశ్చిక రాశివారికి అదృష్టాన్ని అందిస్తుంది. పదోన్నతులు, కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. ప్రయత్నించే ప్రతి పని సజావుగా పూర్తి అవుతుంది. కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాల్లో లాభదాయకమైన అవకాశాలు వస్తాయి.
గమనిక: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, జ్యోతిష్య నిపుణులు తెలిపిన విషయాల ఆధారంగా అందినవి. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్ గమనించాలి.