ఆన్‌లైన్ డేటింగ్ చేస్తున్నారా? మీ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఇలా చేయండి
ఆన్ లైన్ డేటింగ్.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కొత్త కల్చర్ ఇది. ఈ ఆన్ లైన్ డేటింగ్ మనుషుల మధ్య బంధాలను ఆర్టిఫీషియల్ గా మార్చేసింది. అయితే ఈ డిజిటల్ ప్రపంచంలో కూడా బంధాలను బలోపేతం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సంబంధాల గైడ్
ఇప్పుడంతా ఆన్ లైన్ ప్రేమలే. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో పరిచయాలే ప్రేమలుగా మారిపోతున్నాయి. ఇంటర్నెట్ లో డేటింగ్ చేస్తూ పార్టనర్ ని వెతుక్కునే విధానాన్నే ఎక్కువ మంది యువత ఫాలో అవుతున్నారు. అయితే ఇలాంటి రిలేషన్ షిప్ ఎక్కువ కాలం నడవదు. కేవలం మర్యాద ఇచ్చిపుచ్చుకున్నంత మాత్రాన ఆన్ లైన్ సంబంధాలు స్ట్రాంగ్ గా ఉండవు. మరి నిజమైన, శాశ్వత సంబంధం కోసం ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
డేటింగ్ లో చేయాల్సినవి
1. నిజాయితీగా ఉండండి
ఏ సంబంధానికైనా నిజాయితీ ముఖ్యం. ప్రొఫైల్, ఫోటోలు, మాటల్లో నిజాయితీగా ఉండండి. ఇది నిజమైన సంబంధాలను ఏర్పడేలా చేస్తుంది.
2. స్పష్టమైన లక్ష్యాలు
ఈ డేటింగ్ లో మీరు ఏమి కోరుకుంటున్నారో మీ పార్టనర్ కి సరిగ్గా తెలియజేయండి. క్యాజువల్ డేటింగా? స్నేహంగా ఉండటమా? సీరియస్ రిలేషన్షిప్ కోసం ఆశ పడుతున్నారా? మీ పార్టనర్ కి క్లారిటీగా చెప్పండి.
డేటింగ్ లో చేయాల్సినవి
3. గౌరవంగా మాట్లాడండి
మీ పార్టనర్ తో గౌరవంగా మాట్లాడండి. తనపై కేర్ చూపించండి. అనవసర కోపాన్ని ప్రదర్శించడం సరికాదు. మీ పార్టనర్‌పై శ్రద్ధ చూపిస్తే మీ మధ్య నిజమైన సంబంధం ఏర్పడుతుంది.
4. భద్రత, గోప్యత
ఆన్‌లైన్ డేటింగ్ ఆనందాన్నిస్తుంది. కానీ జాగ్రత్త అవసరం. మీ గురించి ఎక్కువ చెప్పకండి. పబ్లిక్‌లోనే కలవండి. అభిప్రాయాలు షేర్ చేసుకోండి.
డేటింగ్‌లో చేయకూడనివి
1. ఎక్కువ సమాచారం షేర్ చేయకండి
మీరు కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోవద్దు. మీ వ్యక్తిగత సమాచారాన్ని వెంటనే షేర్ చేయకండి. నమ్మకం పెరిగిన తర్వాత చెప్పొచ్చు.
2. మెసేజ్‌లతో అపార్థాలు పెరిగిపోతాయి
ఆనలైన్ డేటింగ్ అంటే ఎక్కువ మెసేజ్ లో మాట్లాడుకోవడమే ఉంటుంది. దీని వల్ల అపార్థాలు కూడా వస్తాయి. వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ కూడా చేసి మాట్లాడుకోండి.
డేటింగ్‌లో చేయకూడనివి
3. ఫేక్ ఫోటోలు వద్దు
నిజాయితీగా ఉంటే మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారు. మీ పాత విషయాలు దాచొద్దు. ఫోటోలు ఎడిట్ చేయడం లాంటి పనులు చేయొద్దు.
4. అంచనాలు పెంచుకోకండి
ఆన్‌లైన్ డేటింగ్ వాస్తవికతకు దూరంగా ఉంటుంది. అందువల్ల ఇందులో మీరు మీ పార్టనర్ నుంచి 100 శాతం రెస్పాన్స్ కోరుకోవద్దు. క్యాజువల్ గా మాట్లాడండి. భావోద్వేగాలు షేర్ చేయండి. రెస్పాన్స్ ఆశించకండి.