MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Heinrich Klaasen: కాటేర‌మ్మ కొడుకు.. కేకేఆర్ ను పిచ్చ‌కొట్టుడు కొట్టాడు !

Heinrich Klaasen: కాటేర‌మ్మ కొడుకు.. కేకేఆర్ ను పిచ్చ‌కొట్టుడు కొట్టాడు !

SRH vs KKR IPL 2025: ఐపీఎల్ 2025లో తమ చివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు అద్భుతమైన బ్యాటింగ్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ను చితక్కొట్టారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు పరుగుల వర్షం తెప్పిస్తే.. హెన్రిచ్ క్లాసెన్ సునామీగా మార్చాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 25 2025, 09:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
SRH vs KKR IPL 2025: పరుగుల వర్షం
Image Credit : ANI

SRH vs KKR IPL 2025: పరుగుల వర్షం

SRH vs KKR IPL 2025: పరుగుల వర్షం.. కాదు కాదు పరుగుల సునామీ అంటే ఎలా ఉంటుందో మరోసారి చూపించారు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 278 పరుగులు చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ దంచికొట్టాడు
Image Credit : ANI

కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ దంచికొట్టాడు

కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ కొట్టాడు. తన ఊరమాస్ బ్యాటింగ్ పవర్ ను చూపించాడు. ఐపీఎల్ 2025 లో కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన క్లాసెన్ ఆ తర్వాత దాన్ని సెంచరీగా మార్చాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు.

35
37 బంతుల్లోనే సెంచరీ కొట్టిన హెన్రిచ్ క్లాసెన్
Image Credit : our own

37 బంతుల్లోనే సెంచరీ కొట్టిన హెన్రిచ్ క్లాసెన్

ఈ మ్యాచ్ లో కేవలం 17 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు క్లాసెన్. ఆ తర్వాత దానిని సెంచరీగా మార్చాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. తన సెంచరీ ఇన్నింగ్స్ ( 105 పరుగులు) లో 7 ఫొర్లు, 9 సిక్సర్లు బాదాడు. తన కెరీర్ లో ఇది రెండో సెంచరీ. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో  ఫాస్టెస్ట్ సెంచరీ. 

45
ట్రావిస్ హెడ్ ధనాధన్ బ్యాటింగ్
Image Credit : google

ట్రావిస్ హెడ్ ధనాధన్ బ్యాటింగ్

హైదరాబాద్ టీమ్ తరఫున ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే 32 పరుగుల ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ ధనాధన్ బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. 40 బంతుల్లో 76 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు.

55
కేకేఆర్ ముందు భారీ టార్గెట్
Image Credit : ANI

కేకేఆర్ ముందు భారీ టార్గెట్

సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ బ్యాటింగ్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలింగ్ లో సునీల్ నరైన్ 2 వికెట్లు తీసుకున్నాడు కానీ, భారీగా పరుగులు ఇచ్చాడు. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 32, హెడ్ 76,  ఇషాన్ కిషన్ 29 పరుగులు, అనికేత్ వర్మ 12 పరుగులు కొట్టారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
క్రీడలు
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిది ఆ జట్టేనా !
Recommended image2
GT vs CSK: గుజరాత్ టైటాన్స్ కు షాకిచ్చిన చెన్నై సూపర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved