MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • కొత్త వెహికల్ కొనడానికి ఫుల్‌గా డబ్బులున్నా.. ఫైనాన్స్ తీసుకొనే కొనాలి? లాజిక్ ఇదే..

కొత్త వెహికల్ కొనడానికి ఫుల్‌గా డబ్బులున్నా.. ఫైనాన్స్ తీసుకొనే కొనాలి? లాజిక్ ఇదే..

మీరు కారు లేదా బైక్ కొనాలని అనుకుంటున్నారా? మీ దగ్గర ఆ వెహికల్ కొనడానికి ఫుల్ గా డబ్బులు ఉన్నాయా? మొత్తం డబ్బు పెట్టి కొనేయకండి. కచ్చితంగా ఫైనాన్స్ తీసుకొనే కొనండి. ఎందుకంటే దీని వెనుక ఒక లాజిక్ ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 25 2025, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డబ్బులున్నా.. ఫైనాన్స్ ఎందుకు తీసుకుంటారు
Image Credit : gemini AI

డబ్బులున్నా.. ఫైనాన్స్ ఎందుకు తీసుకుంటారు

ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే కొంతమంది డబ్బులు దాచుకొని సరిపడా సేవ్ చేసుకున్న తర్వాత కొనుక్కుంటారు. కాని ఎక్కువమంది ఫైనాన్స్ తీసుకొని కొనుక్కుంటారు. సరిపడా డబ్బులున్నా కూడా ఫైనాన్స్ లోనే కొనుక్కుంటారు. దీనికి వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంది. అయినా కూడా ఫైనాన్స్ లోనే కొనుక్కుంటారు. ఇలా చేస్తే డబ్బులు వేస్ట్ అవుతాయని కొంతమంది అనుకుంటారు. కాని లోన్ తీసుకొని కొనుక్కోవడం వల్ల మీ ఫైనాన్షియల్ ప్లాన్స్ డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
10 నుంచి 20 శాతం డౌన్ పేమెంట్ కడితే చాలు
Image Credit : Getty

10 నుంచి 20 శాతం డౌన్ పేమెంట్ కడితే చాలు

కారు లేదా బైక్ కొనడానికి మీ దగ్గర సరిపడా డబ్బులున్నా మీరు కేవలం 10 నుంచి 20 శాతం డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది. మిగిలిన అమౌంట్ మొత్తం బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు లోన్ ఇస్తాయి. అయితే లోన్ తీసుకొనే ముందు ఇతర బ్యాంకుల వడ్డీ రేట్లు తెలుసుకొని పోల్చి చూడటం మంచిది.

35
డబ్బులున్నా.. ఫైనాన్స్ ఎందుకు తీసుకోవాలంటే..
Image Credit : Freepik

డబ్బులున్నా.. ఫైనాన్స్ ఎందుకు తీసుకోవాలంటే..

ప్రతి ఒక్కరూ సేవింగ్స్ చేస్తారు. వాటిని ఉపయోగించుకొని వస్తువులు కొనుక్కోవాలని అనుకుంటారు. అలా చేస్తే మీరు దాచుకున్న సేవింగ్స్ డబ్బంతా ఒకేసారి ఖర్చయిపోతుంది. అలాంటి సమయంలో ఏదైనా ఎమర్జెన్సీ కలిగితే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

ఈ కాలంలో ఎప్పుడు ఎమర్జెన్సీ ఏర్పడుతుందో ఎవరూ చెప్పలేరు. అందువల్ల దాచుకున్న డబ్బంతా పెట్టి కారు లేదా బైక్ కొనడం కంటే లోన్ తీసుకొని కొనడం మంచిది.  

45
ఫైనాన్స్ లో కొంటే కలిగే ప్రయోజనాలు
Image Credit : our own

ఫైనాన్స్ లో కొంటే కలిగే ప్రయోజనాలు

ఫైనాన్స్ లో కొంటే మీ ఎమర్జెన్సీ ఫండ్ కు ఎలాంటి ఇబ్బంది రాదు. 

వడ్డీ కట్టాలన్న డౌట్ ఉన్నా, అది పెద్ద బర్డెన్ కాదు. ప్రతి నెల కొద్ది కొద్దిగా కట్టుకోవడం వల్ల మీ డైలీ లైఫ్ కూడా దెబ్బతినకుండా ఉంటుంది. 

మీకు వడ్డీ కట్టడం ఇబ్బందిగా ఉంటే కొన్ని స్టార్టప్ ఫైనాన్స్ కంపెనీలను కలవండి. వారైతే తక్కువ వడ్డీకే లోన్స్ ఇస్తారు. 

తక్కువ ఈఎంఐ పెట్టుకోవడం వల్ల మీరు ప్రతి నెలా ఇబ్బంది లేకుండా పేమెంట్ చేయొచ్చు. అందువల్ల డబ్బులున్నా ఫైనాన్స్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. 

55
బైక్, కారు కొనే ముందు ఇవి తెలుసుకోండి
Image Credit : Freepik

బైక్, కారు కొనే ముందు ఇవి తెలుసుకోండి

కొత్త బైక్, కారు కొనే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా మీరు తెలుసుకోవాలి. బైక్ ఫైనాన్స్, వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ పేమెంట్ ఛార్జీలు, ప్రీ పేమెంట్ ఛార్జీలు, ప్రీ క్లోజర్ ఛార్జీలు, కంపెనీ కండీషన్స్ తెలుసుకున్న తర్వాత మాత్రమే వెహికల్ కొనాలా వద్దా అని డిసైడ్ అవ్వాలి. వీటిల్లో ఏది ఎక్కువగా ఉంది? ఏ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించింది? లాంటి వాటిని పోల్చుకొని స్టెప్ తీసుకోవడం మంచిది. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ ఆటోమొబైల్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Yamaha Bikes: వామ్మో.. యమహా బైక్స్ పై రూ.లక్షకు పైగా డిస్కౌంటా? ఆఫర్ అదిరిపోయిందిగా..
Recommended image2
Cars Under 5 Lakhs: రూ. 5 లక్షల లోపు వచ్చే బెస్ట్ కార్లు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved