Telugu news live updates: Inspiration Cricket : సచిన్ రిటైర్మెంట్‌ను వీవ్ రిచర్డ్స్ ఎలా ఆపారో తెలుసా?

సారాంశం

కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్‌ తన వక్రబుద్ధిని చాటుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్‌తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్‌ డ్రోన్‌ దాడులకు దిగింది. భారత్ పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించిన వివరాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.. 
 

Telugu news live updates: Inspiration Cricket : సచిన్ రిటైర్మెంట్‌ను వీవ్ రిచర్డ్స్ ఎలా ఆపారో తెలుసా?

12:00 AM (IST) May 12

Inspiration Cricket : సచిన్ రిటైర్మెంట్‌ను వీవ్ రిచర్డ్స్ ఎలా ఆపారో తెలుసా?

Inspiration Cricket : 2007 వన్డే ప్రపంచ కప్ నుండి భారత్ అవుట్ అయిన తర్వాత సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ గురించి ఆలోచించారు. అతని హీరో వీవ్ రిచర్డ్స్ నుండి 45 నిమిషాల పాటు ఫోన్ కాల్, అతని సోదరుడు అజిత్ ప్రోత్సాహం అతని మనసు మార్చుకుని, 2011 లో తన ప్రపంచ కప్ కలను నెరవేర్చుకోవడానికి దారితీసింది. ఈ ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

11:45 PM (IST) May 11

India pakistan tensions: భారత్ దెబ్బకు పాకిస్తాన్ లో క్రికెట్ బంద్ !

 India pakistan tensions: భారత్ దెబ్బతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అన్ని దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లను నిలిపివేసింది. సీఎస్ఎల్ సస్పెండ్ అయిన తర్వాత ఇది జరిగింది. దీంతో పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్ రాబోయే టీ20 సిరీస్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

పూర్తి కథనం చదవండి

10:40 PM (IST) May 11

Vishal: వేదిక‌పై స్పృహ తప్పు పడిపోయిన హీరో విశాల్.. ఏమైంది?

Tamil actor Vishal fainted on stage:విల్లుపురంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో తమిళ నటుడు విశాల్ అకస్మాత్తుగా వేదికపై స్పృహ కోల్పోయారు. దీంతో అందరూ దిగ్భ్రాంతికి గుర‌య్యారు.

పూర్తి కథనం చదవండి

10:27 PM (IST) May 11

టీవీఎస్ నుంచి కొత్తగా సీఎన్జీ, ఈవీ స్కూటర్లు: ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలుసా?

దశాబ్దాలుగా దేశ ప్రజల ఫేవరేట్ కంపెనీగా కొనసాగుతున్న టీవీఎస్ కంపెనీ నుంచి త్వరలో మరో కొన్ని అప్డేటెడ్ వెహికల్స్ రానున్నాయి. మైలేజ్ ఎక్కువగా ఇచ్చే సీఎన్జీ, ఈవీ స్కూటర్లతో పాటు ఈవీ బైక్స్ కూడా త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. వాటికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం ఇక్కడ ఉంది. 

పూర్తి కథనం చదవండి

09:37 PM (IST) May 11

Operation Sindoor: మ‌ళ్లీ కాల్పులు జ‌రిపితే పాక్ ఉండ‌దు.. భార‌త్ మాస్ వార్నింగ్

Operation Sindoor: పాకిస్థాన్ కు భార‌త్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. మ‌ళ్లీ కాల్పులు జ‌రిపితే పాక్ వుండ‌దంటూ భారత నౌకా దళం హెచ్చ‌రించింది. 

పూర్తి కథనం చదవండి

08:24 PM (IST) May 11

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ తో పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ చేపట్టిన ఖచ్చితమైన దాడుల్లో పాకిస్తాన్ వైమానిక స్థావరాలకు పెద్ద నష్టం వాటిల్లిందని ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా భారత ఆర్మీ సంబంధిత వివరాలు పంచుకుంది. 

పూర్తి కథనం చదవండి

07:45 PM (IST) May 11

Maruti Alto K10: కేవలం రూ.6,000 ఈఎంఐతో ఈ కారు సొంతం చేసుకోండి

Maruti Alto K10: తక్కువ ధరకే కారు కొనాలనుకుంటున్నారా? అయితే మారుతి ఆల్టో K10 మీకు పర్ఫెక్ట్ కారు. ఇప్పటికిప్పుడు ఈ కారును మీరు సొంతం చేసుకోవాలంటే నెలకు రూ.6,000 EMI కడితే చాలు. ఈ కారు ధర, ఫీచర్స్ గురించి పూర్తి వివరాలు ఇవిగో. 

పూర్తి కథనం చదవండి

07:20 PM (IST) May 11

India pakistan tensions: ఉగ్రవాదం అంతం కోసం ఆపరేషన్ సింధూర్.. అప్పుడే పూర్తి కాలేదు.. : భారత ఆర్మీ

India pakistan tensions: పాకిస్తాన్‌తో చర్చలు కేవలం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) తిరిగి తీసుకోవ‌డం, ఉగ్రవాదుల అప్పగింతలపైనే జరుగుతాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం  చేసిన‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో మోడీ ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించినట్లు వెల్లడించాయి.

పూర్తి కథనం చదవండి

07:16 PM (IST) May 11

స్కూటర్ కొనాలంటే ఇదే మంచి టైం: సుజుకి వాహనాలపై అదిరిపోయే సమ్మర్ ఆఫర్లు

Suzuki Summer Offers: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కంపెనీ తన 2025 స్కూటర్లు, బైక్‌లపై ప్రత్యేకమైన సమ్మర్ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో రూ.5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ఉచిత 10 సంవత్సరాల వారంటీ వంటి అనేక ఆఫర్లు ఉన్నాయి. అంతేకాకుండా సింపుల్ ఫైనాన్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

06:39 PM (IST) May 11

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌తో భారత్ సక్సెస్.. నెక్స్ట్ టార్గెట్ పీవోకేను తిరిగి తీసుకోవడమే

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ సైనిక, రాజకీయ, వ్యూహాత్మకంగా మానసిక విజయాలు సాధించింది. తదుపరి లక్ష్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి పొందడమేనని భారత్ స్పష్టం చేసింది. 

పూర్తి కథనం చదవండి

05:58 PM (IST) May 11

India pakistan tensions: పీవోకేతో పాటు ఉగ్ర‌వాదుల‌ను అప్ప‌గించాల్సిందే.. : పీఎం మోడీ

India pakistan tensions: పాక్‌తో చర్చలు కేవలం పీఓకేతో పాటు ఉగ్రవాదుల తిరిగి అప్పగించే విష‌యంలోనే ఉంటాయ‌ని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మ‌ధ్య ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేద‌ని తెలిపారు. 

పూర్తి కథనం చదవండి

05:48 PM (IST) May 11

Injuries: గాయాలను కూడా ఆహారంతో తగ్గించొచ్చని తెలుసా? శాస్త్రవేత్తలే చెబుతున్నారు

Injuries: మీరు తరచూ రన్నింగ్ చేస్తుంటారా? లేదా మీరు రన్నరా? అయితే అప్పుడప్పుడు గాయాలవుతుంటాయి కదా.. వాటిని మీరు మెడిసన్ ద్వారా కాకుండా ఫైబర్, ఫ్యాట్ ఉన్న ఆహారాలు తినడం ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ విషయంపై ఇటీవల సైన్టిస్టులు కనిపెట్టిన విశేషాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

05:40 PM (IST) May 11

Murali Naik: దేశ రక్షణలో ప్రాణత్యాగం.. మురళి నాయక్ కుటుంబానికి ఏపీ సర్కారు అండ.. రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా

Murali Naik: దేశరక్షణలో వీర మరణం పొందిన జ‌వాను మురళి నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల భూమి, 300 గజాల నివాస‌ స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. 
 

పూర్తి కథనం చదవండి

05:06 PM (IST) May 11

Miss World 2025: నాగార్జున సాగ‌ర్ కు మిస్ వ‌ర‌ల్డ్ కంటెస్టంట్స్.. ఇంకా ఏ ప్రాంతాలను సందర్శించనున్నారో తెలుసా? 

Miss World 2025: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ గ్రాండ్ ప్రారంభం అయింది.  శాంతి, ఐక్యతకు తెలంగాణ నుండి ప్రపంచానికి సందేశం ఇవ్వ‌డంతో పాటు రాష్ట్ర టూరిజానికి మ‌రింత ఉత్సాహం, పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డం వంటి ప‌లు లక్ష్యాల‌తో తెలంగాణ స‌ర్కారు ఈ మెగా ఈవెంట్ ను నిర్వ‌హిస్తోంది. 

పూర్తి కథనం చదవండి

04:13 PM (IST) May 11

Telangana police: హైద‌రాబాద్ అల‌ర్ట్.. డ్రోన్‌లు, పారా-గ్లైడర్‌, మైక్రో-లైట్ విమానాలపై నిషేధం

Telangana police: భద్రతా కారణాల నేప‌థ్యంలో హైదరాబాద్‌లో డ్రోన్లు, పారా-గ్లైడర్లు ఎగ‌ర‌వేయ‌డంపై  నగర పోలీసులు నిషేధం విధించారు. ఈ  ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చాయి. భార‌త్-పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య రాష్ట్ర రాజ‌ధానిలో మ‌రింత నిఘా పెంచారు. 
 

పూర్తి కథనం చదవండి

04:04 PM (IST) May 11

బ్రహ్మోస్ క్షిపణి కేంద్రం లాంఛ్, శత్రువులకి వార్నింగ్!

లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. రక్షణ మంత్రి, సీఎం యోగి కలిసి ఆవిష్కరించారు.  దీంతో దేశం సైనికంగా మరింత బలోపేతం కానుంది. 

పూర్తి కథనం చదవండి

03:55 PM (IST) May 11

అజయ్ దేవగణ్ vs అక్షయ్ కుమార్: ఎవరి ఆస్తులు ఎక్కువ? హిట్స్, ఫ్లాప్స్ లెక్కలు

బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ సినిమాలు, సంపద, కెరీర్ పోలిక. బాక్సాఫీస్ వద్ద నిజమైన బాద్షా ఎవరు? ఇలాంటి క్రేజీ విషయాలను ఇందులో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

03:20 PM (IST) May 11

ఉదయాన్నే నీళ్ళు తాగితే మీ శరీరంలో వచ్చే మార్పులివే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్ళు తాగడం చాలా మందికి అలవాటు. ఇది మంచిదని అందరికీ తెలుసు. కానీ ఇలా నీళ్ళు తాగితే మన శరీరంలో ఏమేం మార్పులు జరుగుతాయో చాలా మందికి తెలియదు. ఉదయాన్నే నీళ్ళు తాగితే శరీరంలో జరిగే మార్పుల గురించి తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

03:16 PM (IST) May 11

Hyderabad: హార్వ‌ర్డ్ వ‌ర్సిటీలో హైద‌రాబాద్ మెట్రోపై కేస్ స్ట‌డీ.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు మరో గౌరవం లభించింది. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా కేస్ స్టడీ నిర్వహించి, హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మెట్రో ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటిగా గుర్తించింది.
 

పూర్తి కథనం చదవండి

02:59 PM (IST) May 11

Kia: కియా కార్లపై భారీ ఆఫర్లు! మూడు మోడల్స్‌పై రూ.45,000 వరకు డిస్కౌంట్

Kia: కియా కారు కొనాలనుకొనే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. కియా కంపెనీ తన సెల్టోస్, సోనెట్, కేరెన్స్ మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ప్రకటించింది. ఇందులో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. కియా ప్రకటించిన ఆఫర్ల గురించి డీటైల్డ్ గా ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

02:46 PM (IST) May 11

విజయ్ కొత్త సినిమా నుంచి ఫోటో లీక్, పోలీస్ గెటప్‌లో దళపతి అదుర్స్

జన నాయకన్ చిత్రం షూటింగ్ స్పాట్ నుండి ఒక ఫోటో లీక్ అయ్యింది. ఆ ఫోటోలో నటుడు విజయ్ పోలీస్ యూనిఫాంలో కనిపిస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

02:25 PM (IST) May 11

Lifestyle: ఆవ నూనెతో ఇలా చేయండి.. జీవితంలో తెల్ల వెంట్రుక‌లు రావు

తెల్ల జుట్టు.. ఇటీవ‌ల చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో ఇదీ ఒక‌టి. ఒక‌ప్పుడు వ‌య‌సు మ‌ళ్లిన వారిలో మాత్ర‌మే ఈ స‌మ‌స్య క‌నిపించేది. కానీ ప్ర‌స్తుతం పాతికేళ్లు కూడా నిండ‌ని వారు తెల్ల జుట్టుతో బాధ‌ప‌డుతున్నారు. అయితే తెల్ల జుట్టు స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు కొన్ని నేచుర‌ల్ టిప్స్ ఉన్నాయి. అందులో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

02:25 PM (IST) May 11

Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి: తాజా ధరలు ఎంతున్నాయంటే..

Gold Prices: బంగారం ధరలు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటున్నాయి. మే 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ నగరాల్లో ఉన్న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

01:39 PM (IST) May 11

Operation sindoor: ఆప‌రేష‌న్ సిందూర్ ఇంకా ముగియ‌లేదు.. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌ కీల‌క ప్ర‌క‌ట‌న

భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య మూడు రోజుల‌పాటు కొన‌సాగిన ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌కు శ‌నివారం సాయంత్రం ముగింపు ప‌లికింది. అమెరికా దౌత్యంతో రెండు దేశాలు కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 
 

పూర్తి కథనం చదవండి

01:23 PM (IST) May 11

Murali naik: వీరుడికి క‌న్నీటి వీడ్కోలు.. జ‌వాన్ ముర‌ళీ కుటుంబానికి రూ. 50 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

ఆప‌రేషన్ సిందూర్‌లో వేలాది మంది సైనికులు పాల్గొన్నారు. సెల‌వుల్లో ఉన్న వారు కూడా హుటాహుటిన స‌రిహ‌ద్దుకు చేరుకున్నారు. పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సైనికుడు మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. 
 

పూర్తి కథనం చదవండి

12:27 PM (IST) May 11

పాకిస్థాన్ బిచ్చమెత్తుకుంటోంది: అసదుద్దీన్ ఓవైసీ

ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్‌కి లోన్ రావడంపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ని అధికారిక బిచ్చగాడు అని, ఐఎంఎఫ్‌ని అంతర్జాతీయ ఉగ్రవాద నిధి అని ఎద్దేవా చేశారు.

పూర్తి కథనం చదవండి

11:05 AM (IST) May 11

Donald Trump: కశ్మీర్ అంశంపై స్పందించిన ట్రంప్.. వెయ్యేళ్ల తర్వాత అయినా

భారత్, పాకిస్థాన్‌ల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ‌న‌కు అమెరికా కృషి చేసింద‌ని అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే. నిజానికి ఈ విష‌యాన్ని అంద‌రికంటే ముందుగా ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్ మ‌రోసారి భార‌త్‌, పాకిస్థాన్‌ల వ్య‌వ‌హారంపై స్పందించారు. 
 

పూర్తి కథనం చదవండి

10:20 AM (IST) May 11

Pakistan: కాల్పుల విర‌మ‌ణ‌పై పాక్ ప్ర‌ధాని పిచ్చి మాట‌లు.. భార‌త్‌ను ఓడించామంటూ

చింత చ‌చ్చినా పులుపు చావ‌లేద‌న్న‌ట్లు ఉంది పాకిస్థాన్ తీరు. భార‌త ఆర్మీని ఎదుర్కునే స‌త్తా లేని పాకిస్థాన్ పిచ్చి మాట‌లు మాట్లాడుతోంది. అమెరికా దౌత్యంతో కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీకారం తెలిపితే.. పాకిస్థాన్ ప్ర‌ధాని మాత్రం ఇది త‌మ విజ‌యంగా చెప్పుకుంటున్నారు. 
 

పూర్తి కథనం చదవండి

09:47 AM (IST) May 11

India pakistan: ఇది చైనా అస‌లు రూపం.. భార‌త్‌, పాకిస్థాన్ ఉద్రిక్త‌ల వేళ కీల‌క ప్ర‌క‌ట‌న

ప‌హ‌ల్గామ్ ఉగ్రదాడుల త‌ర్వాత భార‌త్, పాకిస్థాన్‌ల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. భార‌త్ ఉగ్ర‌వాదుల‌పై అటాక్ చేస్తే పాకిస్థాన్ మాత్రం సామాన్య జ‌నాల‌పై విరుచుకుప‌డింది. రాకెట్లు, డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది. అయితే అమెరికా దౌత్యంతో కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించారు.ఈ నేప‌థ్యంలోనే చైనా చేసిన కొన్ని వ్యాఖ్య‌లు ఆ దేశం అస‌లు బుద్ధిని బ‌య‌ట పెట్టింది. 
 

పూర్తి కథనం చదవండి

09:29 AM (IST) May 11

శివకార్తికేయన్ తండ్రిగా మోహన్ లాల్, గతంలో ఎన్టీఆర్, విజయ్ నాన్న పాత్రలో మలయాళ స్టార్ హీరో

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరోసారి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు.  తమిళంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆయన తండ్రిగా మోహన్ లాల్ నటించబోతున్నారు.

పూర్తి కథనం చదవండి

09:21 AM (IST) May 11

India pakistan: భార‌త క్షిప‌ణి ఆఫ్గ‌నిస్తాన్‌లో ప‌డిందా.? పాక్ ఆరోప‌ణ‌పై స్పందించిన‌ తాలిబాన్

కుక్క తోక‌ర వంక‌ర అన్న‌ట్లు పాకిస్థాన్ బుద్ధి ఎప్ప‌టికీ మార‌డం లేదు. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని అంగీక‌రించిన మూడు గంట‌ల్లోనే మ‌ళ్లీ దాడులు చేసిన జిత్తుల మారి పాకిస్థాన్‌.. భార‌త్‌పై విష ప్ర‌చారం చేస్తూనే ఉంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా పాక్ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 
 

పూర్తి కథనం చదవండి

09:10 AM (IST) May 11

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మరణించారన్న వార్తలపై స్పందించిన పాక్ ప్రభుత్వం.

ఇమ్రాన్ ఖాన్‌ని ఐఎస్ఐ చంపేసిందని సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. దీంతో  ఈ వార్తలపై పాక్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇమ్రాన్ మరణించారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. 

పూర్తి కథనం చదవండి

07:37 AM (IST) May 11

Mothers Day: మదర్స్ డే రోజు మీ అమ్మతో కచ్చితంగా చూడాల్సిన సినిమాలు.. OTTలోనే ఉన్నాయ్

అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని అంతా సంతోషంగా జరుపుకుంటున్నారు. తమ అమ్మలకు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మీ అమ్మతో కలిసి ఓటీటీలో చూసే కొన్ని బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

07:20 AM (IST) May 11

కాల్పల విరమణ జరగకపోతే ఏమయ్యేది.? అమెరికాకు అందిన ఆ ర‌హ‌స్య స‌మాచారం ఏంటి.?

నాలుగు రోజుల ఉద్రిక్తత తర్వాత భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన బృందం తెరవెనుక ఉండి రెండు దేశాలను చర్చలకు ఒప్పించారు.

పూర్తి కథనం చదవండి

06:55 AM (IST) May 11

India pakistan: కాల్పలు విరామ ఉల్లంఘనపై పాక్ ప్రధాని ఏమన్నారంటే

నాలుగు రోజుల ఘర్షణ తర్వాత శనివారం సాయంత్రం భారత్-పాకిస్తాన్ యుద్ధ విరామానికి అంగీకరించాయి. కానీ, కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ డ్రోన్లతో దాడి చేసింది. భారత్ వాటిని కూల్చివేసింది. విదేశాంగ కార్యదర్శి హెచ్చరించాక, పాకిస్తాన్ యుద్ధ విరామానికి కట్టుబడి ఉంటామంది.

పూర్తి కథనం చదవండి

06:45 AM (IST) May 11

Rain Alert: తెలుగు ప్ర‌జ‌ల‌కు కూల్ న్యూస్‌.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు వ‌ర్షాలే వ‌ర్షాలు

మండె ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించేలా వాతావార‌ణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. వ‌చ్చే మూడు రోజులు ఏపీతో పాటు తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఇంత‌కీ ఏయే ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కావాలు ఉన్నాయి లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

More Trending News