Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • Injuries: గాయాలను కూడా ఆహారంతో తగ్గించొచ్చని తెలుసా? శాస్త్రవేత్తలే చెబుతున్నారు

Injuries: గాయాలను కూడా ఆహారంతో తగ్గించొచ్చని తెలుసా? శాస్త్రవేత్తలే చెబుతున్నారు

Injuries: మీరు తరచూ రన్నింగ్ చేస్తుంటారా? లేదా మీరు రన్నరా? అయితే అప్పుడప్పుడు గాయాలవుతుంటాయి కదా.. వాటిని మీరు మెడిసన్ ద్వారా కాకుండా ఫైబర్, ఫ్యాట్ ఉన్న ఆహారాలు తినడం ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ విషయంపై ఇటీవల సైన్టిస్టులు కనిపెట్టిన విశేషాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

Naga Surya Phani Kumar | Published : May 11 2025, 05:48 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు దాదాపు 6000 మంది రన్నర్స్ డేటాపై పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనంలో రన్నర్స్ గాయాలు, వారు తినే ఆహారాలపై రీసెర్చ్ జరిగింది. ఈ అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా పరిగెత్తే దాదాపు 80% కంటే ఎక్కువ మందికి కనీసం ఒక్కసారైనా గాయం అవుతుంది. అలాంటి వారు ఆహారంపై దృష్టి పెట్టడం ద్వారా కాలు గాయాన్ని త్వరగా తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

25
Asianet Image

రన్నింగ్ చేసే వారికి నరాలు, కండరాలు లాగడం, బెణకడం లాంటివి జరిగినప్పుడు ఫైబర్, ఫ్యాట్ ఉన్న ఆహారం తింటే గాయాలు త్వరగా మానుతున్నాయని కనుగొన్నారు. అంటే మనం తినేది కాలు గాయాన్ని చాలా వరకు తగ్గించగలదన్న మాట. ఆహారానికి, కాలు గాయానికి మధ్య సంబంధం మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. 

 

Related Articles

ఇవి తింటే కొలెస్ట్రాల్ అమాంతం పెరిగిపోతుంది
ఇవి తింటే కొలెస్ట్రాల్ అమాంతం పెరిగిపోతుంది
ఉదయాన్నే నీళ్ళు తాగితే మీ శరీరంలో వచ్చే మార్పులివే
ఉదయాన్నే నీళ్ళు తాగితే మీ శరీరంలో వచ్చే మార్పులివే
35
Asianet Image

గాయానికి, ఆహారానికి మధ్య సంబంధం

డాక్టర్ కోలెబాచ్ ప్రకారం రన్నర్స్ కి అసలు గాయం కాకుండా ఉండటానికి సరైన పౌష్టికాహారం తీసుకోవడం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇదే కాకుండా ఫైబర్, ఫ్యాట్ గాయాలు త్వరగా తగ్గడానికి సహకరిస్తాయి. 

అధ్యయనంలోని ఉదాహరణల ప్రకారం రన్నింగ్ చేస్తూ గాయపడిన మహిళ రెగ్యులర్ గా 450 కేలరీల కంటే తక్కువ, 20 గ్రాముల కంటే తక్కువ కొవ్వు తీసుకున్నారు. గాయపడని మహిళలతో పోలిస్తే గాయపడిన మహిళల ఆహారంలో రోజుకు 3 గ్రాముల ఫైబర్ తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ప్రోటీన్, ఆల్కహాల్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం తీసుకోవడం వల్ల గాయానికి సంబంధించిన ఎటువంటి మార్పులు కనిపించలేదు.

45
Asianet Image

 

అందుకే రన్నర్స్ కు ఫైబర్, ఫ్యాట్ అవసరం

మీరు రన్నర్ అయితే గాయాల నుండి తప్పించుకోవాలనుకుంటే మీరు మీ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఫైబర్‌ను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇవి 50-65 శాతం కేలరీలు 20-35 శాతం కొవ్వు 10-20 ప్రోటీన్ నుండి వస్తాయి.

55
Asianet Image

పోషకాహార నిపుణుడిని సంప్రదించండి

రన్నర్స్ లేదా అథ్లెట్లు తమ ఆహారాన్ని పోషకాహార నిపుణుడి సహాయంతో మార్చుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తింటే పేషెన్సీ పెరుగుతుంది. అంతేకాకుండా గాయపడే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. పరిగెత్తేటప్పుడు గాయాలు కాకుండా ఉండేందుకు ట్రైనర్ సలహాలు కూడా తీసుకోండి. హైడ్రేటెడ్ గా ఉండటం ద్వారా గాయాల నుంచి రక్షణ పొందవచ్చు.  

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
ఆరోగ్యం
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories