- Home
- Districts News
- Hyderabad
- Hyderabad: హార్వర్డ్ వర్సిటీలో హైదరాబాద్ మెట్రోపై కేస్ స్టడీ.. ఎందుకో తెలుసా?
Hyderabad: హార్వర్డ్ వర్సిటీలో హైదరాబాద్ మెట్రోపై కేస్ స్టడీ.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు మరో గౌరవం లభించింది. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా కేస్ స్టడీ నిర్వహించి, హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మెట్రో ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటిగా గుర్తించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విజయవంతం కావడంలో ఎన్వీఎస్ రెడ్డి (NVS Reddy) తీసుకున్న నాయకత్వ నిర్ణయాలు, వ్యూహాత్మకత కీలకంగా నిలిచినట్లు పేర్కొన్నారు. భూసేకరణ, రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు లాంటి ఎన్నో సవాళ్లను మెట్రో టీం అధిగమించగలగడం నేతృత్వ సమర్థతను చాటిందని హార్వర్డ్ తెలిపింది.
<p>metro</p>
అవలంభించిన వ్యూహాలు, రంగాల మధ్య సమన్వయం, ఆధునిక సాంకేతికత, దౌత్యపూరిత చర్చలు వంటి అంశాలు మెట్రో ప్రాజెక్టును ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేశాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో వినూత్న ఆర్థిక విధానాలు, ఉన్నత ఇంజినీరింగ్ పరిష్కారాలు, సమర్థవంతమైన చర్చల వ్యూహం ద్వారా ఎన్నో అవరోధాలను అధిగమించగలిగినట్లు పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి ఎదురైన సవాళ్లు:
2006లో ఎన్వీఎస్ రెడ్డి నగర రవాణా సమస్యల పరిష్కారంగా మెట్రో ప్రాజెక్టును ప్రతిపాదించారు. మెట్రో పథకం ప్రారంభ దశలో మైతాస్ ఫెయిల్యూర్, భూ సమస్యలు, ప్రజా వ్యతిరేకత, ఆస్తిక, పర్యాటక ప్రదేశాలపై అభ్యంతరాలు, రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సమస్యలు వంటి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా కూడా ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడంలో టీం నైపుణ్యం, నాయకత్వ నిబద్ధత స్పష్టంగా కనిపించాయని పేర్కొంది.
గతంలో మరిన్ని అధ్యయనాలు:
ఈ ప్రాజెక్టుపై భారతీయ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), స్టాన్‌ఫర్డ్ వంటి సంస్థలు కూడా పరిశోధనలు చేశాయి.
ISB పరిశోధనలో “హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ మెట్రో ప్రాజెక్ట్” అనే థీమ్‌తో విశ్లేషించారు.