Tamil actor Vishal fainted on stage:విల్లుపురంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో తమిళ నటుడు విశాల్ అకస్మాత్తుగా వేదికపై స్పృహ కోల్పోయారు. దీంతో అందరూ దిగ్భ్రాంతికి గుర‌య్యారు.

Tamil actor Vishal fainted on stage: మిస్ ట్రాన్స్‌జెండర్ 2025 అందాల పోటీలో నటుడు విశాల్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. విల్లుపురంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న అకస్మాత్తుగా వేదికపై స్పృహ కోల్పోయాడు. దీంతో అందరూ దిగ్భ్రాంతికి గుర‌య్యారు. అయితే, ప్రథమ చికిత్స తర్వాత, విశాల్ కోలుకుని స్పృహలోకి వచ్చారని సమాచారం. 

 

Scroll to load tweet…

గతంలో, గత జనవరిలో మదగజరాజా సినిమా ప్రమోషన్ సందర్భంగా చోటుచేసుకున్న ఘ‌ట‌న‌తో విశాల్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తమైంది. 

Scroll to load tweet…

 

గ‌తంలో తమిళ నటుడు విశాల్  చెన్నైలో జరిగిన మధ గజ రాజా ప్రీ-రివ్యూలో మీట్ లో చాలా బలహీనంగా, క్షీణించిన శరీరంతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. విశాల్ ముఖం వాడిపోయినట్లు, నడవడంలో సైతం ఇబ్బందిగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. బహిరంగంగా మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతులు వణుకుతున్నట్లు క‌నిపించాయి. దీంతో ఆయ‌న ఆరోగ్యంపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగింది. అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రశ్నలు వేస్తూ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశించారు. 

ఆందోళన నేపథ్యంలో వైద్యులు అధికారిక ఆరోగ్య నివేదికను విడుదల చేశారు. అందులో విశాల్‌కు వైరల్ ఫీవర్ సోకిందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆయనకు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు పేర్కొన్నారు.

 

Scroll to load tweet…