- Home
- International
- India pakistan: ఇది చైనా అసలు రూపం.. భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ కీలక ప్రకటన
India pakistan: ఇది చైనా అసలు రూపం.. భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ కీలక ప్రకటన
పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భారత్ ఉగ్రవాదులపై అటాక్ చేస్తే పాకిస్థాన్ మాత్రం సామాన్య జనాలపై విరుచుకుపడింది. రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే అమెరికా దౌత్యంతో కాల్పుల విరమణకు అంగీకరించారు.ఈ నేపథ్యంలోనే చైనా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆ దేశం అసలు బుద్ధిని బయట పెట్టింది.

భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనా తన అసలు రూపాన్ని బయటపెట్టింది. పాకిస్తాన్‌కు బాసటగా నిలుస్తామని, వారి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్రాన్ని కాపాడుకునే విషయంలో మద్దతుగా ఉంటామని చైనా ప్రకటించింది.
India Pakistan War Tension
శనివారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో పాక్ పరిస్థితులపై చర్చ జరిగింది. వాంగ్ యి మాట్లాడుతూ, “ప్రతికూల పరిస్థితుల్లో పాకిస్తాన్ చూపుతున్న సహనాన్ని, బాధ్యతాయుతమైన వైఖరిని చైనా అభినందిస్తోంది. పాకిస్తాన్ వంటి వ్యూహాత్మక భాగస్వామికి మేము అండగా నిలబడతాము” అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
India Pakistan War Tension
చైనా అధికారిక ప్రకటనలో ఏముంది?
“పాకిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్రాన్ని కాపాడుకోవడంలో చైనా దృఢంగా అండగా నిలుస్తుంది. పాకిస్తాన్‌తో మాకు అన్ని వాతావరణాల్లో మైత్రి ఉంది” అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన పాక్ మంత్రి ఇషాక్ దార్, యుఎఇ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్‌తో కూడా మాట్లాడారు.
ట్రంప్‌పై షాబాజ్ షరీఫ్ ప్రశంస
పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, దక్షిణాసియాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా తీసుకున్న చర్యలను కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు.
“ఈ ప్రాంతంలో శాంతికి ఇది కొత్త ఆరంభం. ఈ శాంతి ప్రక్రియను సులభతరం చేసినందుకు అమెరికాకు కృతజ్ఞతలు” అని షరీఫ్ ట్వీట్ చేశారు. అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు కూడా అభినందనలు తెలిపారు.
అంతకుముందు నవాజ్ షరీఫ్ కూడా మాట్లాడుతూ – “పాకిస్తాన్ శాంతిని కోరుతుంది, కానీ తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలుసు” అన్నారు. ఈ మొత్తం పరిణామాల్లో చైనా, పాకిస్తాన్‌కు బాసటగా ఉండే వైఖరిని మరోసారి స్పష్టం చేయగా, భారత్–పాక్ సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.