Mothers Day: మదర్స్ డే రోజు మీ అమ్మతో కలిసి చూడాల్సిన సినిమాలు.. OTTలోనే ఉన్నాయ్
అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని అంతా సంతోషంగా జరుపుకుంటున్నారు. తమ అమ్మలకు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మీ అమ్మతో కలిసి ఓటీటీలో చూసే కొన్ని బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇంగ్లీష్ వింగ్లీష్
2012 లో విడుదలైన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాని మీ అమ్మతో కలిసి తప్పక చూడండి. ఇది జీ5లో అందుబాటులో ఉంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన మహిళ ఇంగ్లిష్ నేర్చుకొని మళ్లీ తన విలువను తెలుసుకునే స్ఫూర్తిదాయక ప్రయాణమే ఈ సినిమా.
నీల్ బట్టే సన్నాట
2016 లో విడుదలైన నీల్ బట్టే సన్నాట సినిమా కూతురిని చదివించడానికి ఏమైనా చేసే తల్లి కథ. దీన్ని మీరు జీ 5 లో చూడవచ్చు.
సీక్రెట్ సూపర్ స్టార్
2017 లో విడుదలైన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా కూతురి కెరీర్ కోసం తల్లి ఎంతటి పోరాటం చేసింది వివరించే మంచి కథ. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
మామ్
2017 లో విడుదలైన మామ్ సినిమా ఒక తల్లి కథ. ఈ సినిమాని మీరు జీ 5 లో చూడవచ్చు. తల్లి–కూతురు మధ్య బంధానికి మరో కోణాన్ని ఇందులో చూపించారు.
హెలికాప్టర్ ఈలా
2018 లో విడుదలైన హెలికాప్టర్ ఈలా సినిమా ఒక సింగిల్ మదర్ కథ. నేటి తరానికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. దీన్ని మీరు జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు.
మిమి
2021 లో విడుదలైన కామెడీ-డ్రామా మిమి చాలా మంచి సందేశాన్నిస్తుంది. ఈ సినిమాని మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.