Kia: కియా కార్లపై భారీ ఆఫర్లు! మూడు మోడల్స్‌పై రూ.45,000 వరకు డిస్కౌంట్
Kia: కియా కారు కొనాలనుకొనే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. కియా కంపెనీ తన సెల్టోస్, సోనెట్, కేరెన్స్ మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ప్రకటించింది. ఇందులో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. కియా ప్రకటించిన ఆఫర్ల గురించి డీటైల్డ్ గా ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణ కొరియా వాహన బ్రాండ్ కియా కంపెనీ ఇండియాలో రిలీజ్ చేసిన మూడు ప్రముఖ మోడల్స్ సెల్టోస్ మిడ్-సైజ్ SUV, సోనెట్ కాంపాక్ట్ SUV, కేరెన్స్ MPVలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. కస్టమర్లు లబ్ధి చేకూర్చే విధంగా నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందిస్తోంది. కియా కార్లపై అందుబాటులో ఉన్న అన్ని డిస్కౌంట్ ఆఫర్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.
కియా సెల్టోస్ పై ఆఫర్లు..
కియా సెల్టోస్ SUV అన్ని టర్బో-పెట్రోల్ వేరియంట్లపై రూ.45,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు లభిస్తుంది. మరో రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ పొందొచ్చు. అన్ని నేచురల్లీ ఆస్పిరేటెడ్ వేరియంట్లు రూ.5,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సహా రూ.25,000 మొత్తం తగ్గింపుతో లభిస్తున్నాయి. సెల్టోస్ శ్రేణిలో మూడు ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి.
కియా సోనెట్ పై తగ్గింపులు
మీరు సోనెట్ మోడల్ కొనుక్కోవాలనుకుంటే రూ.25,000 వరకు ఆదా చేయవచ్చు. సోనెట్ HTX DCT టర్బో-పెట్రోల్ వేరియంట్ మినహా అన్ని టర్బోచార్జ్డ్ వేరియంట్లపై కస్టమర్లు రూ.25,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ వేరియంట్లకు రూ.5,000 విలువైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్ వెర్షన్లు, ఒక డీజిల్ ఇంజిన్ వెర్షన్ అందుబాటులో ఉన్నాయి. ఇది మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా వస్తాయి.
కియా కేరెన్స్ పై డిస్కౌంట్లు ఇవే..
కేరెన్స్ టర్బో పెట్రోల్ వెర్షన్ పై రూ.25,000 వరకు తగ్గింపులను కంపెనీ అందిస్తోంది. నేచురల్లీ ఆస్పిరేటెడ్ వేరియంట్స్ రూ.5,000 ఆఫర్లతో లభిస్తున్నాయి. కేరెన్స్ మోడల్ వివిధ రకాల ఇంజిన్ మోడల్స్ ఉన్నాయి. అవి 115bhp 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఒకటి కాగా, 160bhp, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరొకటి, చివరిగా 116bhp, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.
ఈ డిస్కౌంట్ ఆఫర్లు డీలర్‌షిప్, నగరాన్ని బట్టి మారతాయని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం దేశంలోని ముఖ్య నగరాలైన డిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ వంటి ముఖ్య నగరాల్లో ఈ డిస్కౌంట్ ఆఫర్లు వర్తిస్తాయి. చిన్న నగరాల్లోకి వచ్చే సరికి డిస్కౌంట్ ఆఫర్లలో మార్పులు రావచ్చు. వాహనాలు కొనే ముందు ఒకసారి కియా కంపెనీ అఫీషియల్ వెబ్ సైబ్ లో ధరలు వెతకండి.