అసలు పుచ్చకాయ క్యాన్సర్‌కు ఎలా కారణమవుతుందో తెలుసా.?
నిజానికి పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో దాదాపు 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. దీంతో డీహైడ్రేషన్ మొదలు ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో కొంత మంది పుచ్చకాయలను పండించడానికి ఈథర్, కార్బైడ్ లేదా కలర్ వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఈ రసాయనాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు క్యాన్సర్, కాలేయం దెబ్బతినడం, మూత్రపిండాల సమస్యలు, హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి.
పుచ్చ కాయలోని గుజ్జు మరింత ఎర్రగా కనిపించేందుకు కృత్రిమ రంగులను కాయలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఈ రంగులు క్యాన్సర్‌కు దారి తీసే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా ఎక్కువ రోజులు సరైన వాతావరణంలో నిల్వ చేయని పుచ్చకాయలో బూజు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ బూజు అఫ్లాటాక్సిన్స్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఇది కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగిస్తుంది.