నలుపు లాంటి ముదురు రంగు దుస్తులు సూర్య కిరణాలను ఎక్కువగా గ్రహిస్తాయి. శరీరాన్ని వేగంగా వేడెక్కేలా చేస్తాయి.
ఎండలో నలుపు రంగు దుస్తులు ధరిస్తే చర్మం ఎక్కువగా వేడెక్కి చర్మం టానింగ్, మంట, దద్దుర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
శరీరం వేడెక్కినప్పుడు దాన్ని చల్లబరచడానికి ఎక్కువగా చెమట పడుతుంది. ఇది డీహైడ్రేషన్ సమస్యకు దారితీస్తుంది.
నలుపు రంగు దుస్తులు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీనివల్ల అలసట, హీట్ స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి.
వేసవిలో తెలుపు, క్రీమ్, లేత నీలం, పసుపు వంటి లేత రంగు దుస్తులు ధరించాలి. కాటన్, ఖాదీ వంటి తేలికపాటి గాలి ఆడే దుస్తులు కూడా వేసుకోవచ్చు.
సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నలుపు రంగు దుస్తులను వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో సూర్య కిరణాల తాకిడి ఉండదు. వేడి కూడా తక్కువగా ఉంటుంది.