పెళ్లి అయిన కొత్తలో విందులకు ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు అన్నీ తినకుండా తక్కువ తినండి. ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
పెళ్లయిన కొత్తలో ఏది పడితే అది తినకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు, వేపుళ్ళు తినకండి. పండ్లు, కూరగాయలు తినండి.
నడక, పరుగు లాంటి వ్యాయామాలు కొంత సేపు చెయ్యండి. ఇది ఆరోగ్యానికి మంచిది.
సూప్, సలాడ్, పప్పు, అన్నం లాంటి తేలికైన ఫుడ్ తినండి. ఇవి ఆరోగ్యానికి మంచివి.
చక్కెర, తీపి పదార్థాలు తక్కువ తినండి. బరువు పెరగకుండా ఉంటారు.
రోజుకి 20-22 సార్లు ముద్దు పెట్టుకుంటే 1-2 కేలరీలు కరుగుతాయట. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
స్మూతీలు, మిల్క్ షేక్ లాంటివి కాకుండా పండ్ల రసాలు, చక్కెర లేని పానీయాలు, నిమ్మరసం తాగండి.
రోజుకి తగినంత నీరు తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్తాయి. తినే ముందు ఒక గ్లాసు నీరు తాగితే ఎక్కువ తినకుండా ఉంటారు.