India Pakistan: పాకిస్తాన్ మరోసారి తన కుటిల బుద్దిని చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒకే చెప్పిన కొన్ని గంటల్లోనే భారత్ పైకి డ్రోన్లతో దాడులకు దిగింది. శ్రీనగర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడిందని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Pakistan violates ceasefire: కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ భారతదేశంతో కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లో మరోసారి దాడులకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ప్రాంతంలో పాక్ డ్రోన్ లు కనిపించాయి.
అలాగే, అఖ్నూర్, రాజౌరి, ఆర్ఎస్ పురా సెక్టార్లలో పాకిస్తాన్ కాల్పులు జరిపింది. భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో మరోసారి కొత్త చర్చ మొదలైంది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనల్లో బారాముల్లాలోలో జరిగిన దాడుడు కూడా ఉన్నాయి.
1. ఉధంపూర్
2. అఖ్నూర్
3. నౌషెరా
4. పూంచ్
5. రాజౌరి
6. మెంధర్
7. జమ్మూ
8. సుందర్‌బాని
9. RS పురా
10. అర్నియా
11. కతువా
భారత్–పాకిస్తాన్ మధ్య గత 48 గంటలుగా కొనసాగిన భారీ కాల్పులు, రాకెట్ దాడులు, డ్రోన్ ఫైరింగ్‌లకు అకస్మాత్తుగా బ్రేక్ పడింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి తాత్కాలిక యుద్ధవిరామం అమలులోకి వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం వెనుక అమెరికా కీలక పాత్ర పోషించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేస్తూ, భారత్–పాక్ మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ చర్చల వెనుక ఉన్న ఆంతర్యాన్ని వెల్లడించారు. ఆయన ప్రకారం, తాను, ఉపాధ్యక్షుడు జేడీ వేన్స్ ఇద్దరూ పాక్షికులైన భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాల టాప్ లెవెల్ నేతలతో నిరంతరం సంప్రదింపులు జరిపారు.
కానీ, మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్ భారత్ పై కాల్పులు జరగడంతో ఏం జరుగుతోందనే ప్రశ్నలు వస్తున్నాయి. పాక్ బుద్ది మారలేదని సోషల్ మీడియాలో అగ్రహం వ్యక్తమవుతోంది.
గమనిక: సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడుల పై తాజాగా జమ్మూకాశ్మీర్ సీఎం ఒవర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. అలాగే, పలు మీడియా నివేదికలు కాల్పులను పేర్కొన్నాయి. భారత ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.