Melon: ఖర్బుజా ఫ్రిజ్ లో పెట్టకూడదా?

ఖర్బుజాను  కత్తిరించకుండా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. వ్యవసాయ శాఖ ప్రకారం, మొత్తం ఖర్బుజాను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల దానిలోని యాంటీఆక్సిడెంట్లు బాగా పనిచేస్తాయి. అందువల్ల, గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన ఖర్బుజా తియ్యగా , జ్యూసీగా కూడా ఉంటుంది.

Is it right to keep melon in the fridge or not in telugu ram

సమ్మర్ లో మనకు చాలా రకాల పండ్లు లభిస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ పుచ్చకాయ, ఖర్బుజా విరివిగా దొరుకుతాయి. ఈ రెండింటినీ సమ్మర్ ఫ్రూట్స్ అని  చెప్పొచ్చు. రుచికి తియ్యగా ఉండటంతో పాటు చాలా పోషకాలు కూడా నిండి ఉంటాయి.కడుపుకు చల్లగా కూడా ఉంటాయి.ఈ మండే ఎండల్లో వీటిని కచ్చితంగా తినాలి. మరి, అలాంటి ఈ పండ్లను చాలా మందిఫ్రిజ్ లో నిల్వ చేస్తూ ఉంటారు. అసలు ఖర్బుజా లాంటి పండ్లను ఫ్రిజ్ లో నిల్వ చేయవచ్చా? చేస్తే ఎలా చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..


ఖర్బుజా  ఫ్రిజ్ లో పెడితే ఏమౌతుంది?

ఖర్బుజాను  కత్తిరించకుండా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. వ్యవసాయ శాఖ ప్రకారం, మొత్తం ఖర్బుజాను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల దానిలోని యాంటీఆక్సిడెంట్లు బాగా పనిచేస్తాయి. అందువల్ల, గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన ఖర్బుజా తియ్యగా , జ్యూసీగా కూడా ఉంటుంది.

Latest Videos

మరి, ఖర్బుజాను కట్ చేసిన తర్వాత ఫ్రిజ్ లో ఉంచొచ్చా అంటే.. చేసుకోవచ్చు. ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఖర్బుజా తొందరగా పాడవ్వదు. దీనిలో బ్యాక్టీరియా  పెరగదు. దానిని ఫ్రిజ్‌లో ఉంచడానికి, దానిని కట్ చేసి పూర్తిగా శుభ్రం చేసి శుభ్రమైన పాత్రలో ఉంచడం ముఖ్యం.

అయితే.. డైరెక్ట్ గా ముక్కలుగా  కోసి ఫ్రిజ్ లో స్టోర్ చేయకూడదు.  దీనిలో తినే భాగాన్ని మాత్రం చిన్న ముక్కలుగా కోసి  గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయవచ్చు ఎందుకంటే ఇది తేమను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఫ్రిజ్ దుర్వాసన రాకుండా చేస్తుంది.

మీరు ఖర్బుజాను సగానికి కోసి ఉంటే, మిగిలిన భాగాన్ని ప్లాస్టిక్ మూతతో బాగా కప్పి ఫ్రిజ్‌లో ఉంచండి. గాలికి గురైతే, అది త్వరగా చెడిపోవడం ప్రారంభమవుతుంది.కొంతమంది బేకింగ్ సోడాను రిఫ్రిజిరేటర్‌లో ఒక చిన్న గిన్నెలో ఉంచుతారు, తద్వారా ఖర్బుజా వాసన ఇతర వస్తువులతో కలవదు. ఈ ఖర్బుజా పండు కూడా  తాజాగా ఉంటుంది.

ఖర్బుజా ఎన్ని రోజులు తాజాగా ఉంటుంది?

ఇది ఖర్బుజా పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మంచిగా లేకపోతే, అది కేవలం 1 రోజులోనే చెడిపోవచ్చు. అయితే, మీరు మొత్తం ఖర్బుజాను ఫ్రిజ్ లో పెట్టకుండా  ఇంట్లో ఉంచితే, దానిని 4 రోజులు నిల్వ చేయవచ్చు.
 

vuukle one pixel image
click me!