నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా నిల్వ చేయండి

Published : May 08, 2025, 05:42 PM IST
నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా నిల్వ చేయండి

సారాంశం

వేసవిలో నిమ్మకాయలు త్వరగా ఎండిపోతాయి. అందువల్ల వాటిల్లో రసం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వేసవిలో నిమ్మకాయలు నెలల తరబడి తాజాగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి. 

వేసవిలో నిమ్మకాయల వినియోగం చాలా ఎక్కువ. నిమ్మరసం నుండి షర్బత్ వరకు అన్నింటిలోనూ నిమ్మకాయలు ఉపయోగిస్తారు. అయితే ఒకటి లేదా రెండు రోజుల్లోనే నిమ్మకాయలు ఎండిపోతాయి. వాటి నుండి రసం కూడా రాదు. అందుకే నెలంతా నిమ్మకాయలను పసుపు రంగులో, తాజాగా ఉంచే కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

నిమ్మకాయలను నిల్వ చేయడానికి సరైన మార్గం 

సోషల్ మీడియాలో ఎంతో మంది నిమ్మకాయలను తాజాగా ఉంచే అనేక చిట్కాలు షేర్ చేస్తున్నారు. అలాంటి వాటిలో బెస్ట్ టెక్నిక్స్, కచ్చితంగా ఉపయోగపడే టెక్నిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

నిమ్మకాయలు ఎండిపోయి, నిర్జీవంగా మారకుండా ఉండాలంటే వాటిని నిల్వ చేయడానికి ముందుగా మీ చేతిలో కొద్దిగా వంట నూనెను రాసుకోండి. ఇప్పుడు మీ చేతులతో నిమ్మకాయలను రుద్ది వాటిపై నూనె పూత పూయండి. ఇప్పుడు నూనె పూసిన నిమ్మకాయలను గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసి ఫ్రిజ్‌లో ఉంచండి. మీ నిమ్మకాయలు ఒక నెల వరకు తాజాగా, రసంతో ఉంటాయి. వాటిని ఉపయోగించే ముందు కొంత సమయం ఫ్రిజ్ నుండి తీసి బయట ఉంచండి. ఆపై కట్ చేసి పిండి ఉపయోగించండి.

నిమ్మకాయలను పచ్చగా, తాజాగా ఉంచడానికి చిట్కాలు

  • నిమ్మకాయలను నిల్వ చేయడానికి మీరు వాటిని కత్తిరించకుండా ప్లాస్టిక్ బ్యాగ్ లేదా జిప్ లాక్ బ్యాగ్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టండి. ఇలా చేస్తే మూడు నుండి నాలుగు వారాల వరకు తాజాగా ఉంటాయి.
  • మీరు ఒక నెల కంటే ఎక్కువ కాలం నిమ్మకాయలను నిల్వ చేయాలనుకుంటే, నిమ్మరసం తీసి గాలి చొరబడని గాజు సీసాలో పోయండి. లేదా ఐస్ క్యూబ్‌లలో నిల్వ చేసి ఫ్రీజర్‌లో పెట్టండి. ఇలా చేస్తే 5-6 నెలల వరకు తాజాగా ఉంటుంది.
  • నిమ్మకాయలను నిల్వ చేయడానికి, కట్ చేసిన నిమ్మకాయలపై ఉప్పు రాసి గాజు జాడీలో ఉంచండి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయలు గట్టిపడవు. వాటిలోని రసం కూడా ఎండిపోదు.
  • నిమ్మకాయలను నిల్వ చేయడానికి మీరు సగం కప్పు వెనిగర్, సగం కప్పు నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయలు ఒకటి నుండి ఒకటిన్నర నెలల వరకు ఫ్రిజ్‌లో తాజాగా ఉంటాయి.
  • నిమ్మకాయలు ఎండిపోయినట్లయితే మీరు వాటిని కొంతసేపు నీటిలో నానబెట్టండి. లేదా 30 సెకన్ల పాటు మైక్రోవేవ్ చేయండి. ఇలా చేయడం వల్ల వాటి నుండి ఎక్కువ రసం వస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dal Tadka: తాళింపు సీక్రెట్.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ దాల్ తడ్కా, వాసనకే కడుపునిండిపోద్ది
Mutton Buying Tips: లేత మటన్ vs ముదురు మటన్.. ముక్కను చూడగానే కనిపెట్టేయండిలా !