చాలామంది బరువు తగ్గడానికి కఠినమైన డైట్‌లు, ఖరీదైన సప్లిమెంట్స్ వాడుతుంటారు. కానీ కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చు. అందులో ఒకటి పుట్నాలు. రోజూ పుట్నాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్నాల్లో ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లు, మాంగనీస్, ఫోలేట్, ప్రోటీన్, భాస్వరం, రాగి, కొవ్వు ఆమ్లాలు వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి పుట్నాలు ఎలా సహాయపడతాయో ఇక్కడ తెలుసుకుందాం.
నిపుణులు ఏం చెబుతున్నారు?
పుట్నాలను సరైన మోతాదులో తీసుకోవడం ద్వారా శరీరంలోని కొవ్వు త్వరగా కరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు తగ్గడానికి అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
ఫైబర్
పుట్నాల్లో మంచి మోతాదులో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల తరచుగా ఆకలి వేయదు. ఎక్కువగా తినరు. దీనివల్ల బరువు తగ్గుతారు.
ప్రోటీన్
ప్రోటీన్ కండరాలను బలపరుస్తుంది. జీవక్రియను పెంచుతుంది. దీనివల్ల శరీరం ఎక్కువ కేలరీలు ఖర్చు చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పుట్నాల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువును నియంత్రణలో ఉంచుతుంది.
ఇతర ప్రయోజనాలు
హిమోగ్లోబిన్ పెంచుతుంది
హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే, పుట్నాలు తినడం మంచిది. వీటిలో మంచి మోతాదులో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది.
మలబద్ధకం సమస్య తగ్గుతుంది
మలబద్ధకం సమస్య ఉంటే పుట్నాలు తినడం మంచిది. ఉదయం ఖాళీ కడుపుతో తింటే మలబద్ధకం తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇతర కడుపు సమస్యలు కూడా తగ్గుతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
పుట్నాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతాయి. వీటిని రోజూ తీసుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
పుట్నాలు ఎలా తినాలి?
రోజుకి 100 గ్రాముల వరకు పుట్నాలు తినచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గడానికి సరిపోతుంది. ఉదయం టిఫిన్‌లో, సాయంత్రం స్నాక్స్ లో తినవచ్చు. బరువు తగ్గడంతో పాటు, పుట్నాలు రక్తంలో చక్కెరను, కొలెస్ట్రాల్‌ను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.