మహానటి మూవీ తర్వాత కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారారు. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కాయి. అయితే ఒక్క చిత్రం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోవడం విశేషం. చిన్ని మూవీతో కీర్తి మరో ప్రయత్నం, ప్రయోగం చేయగా... ఎంత వరకు మెప్పించిందో చూద్దాం..