Asianet News TeluguAsianet News Telugu

Keerthy Suresh:'సర్కారు వారి పాట' కీర్తి కెరీర్ కి కలిసొచ్చిందా?

కీర్తీ సురేష్‌ అంటే సంప్రదాయబద్ధమైన పాత్రలకు చిరునామా అన్నట్లు ఉంటారు. కానీ ఆర్టిస్ట్‌ అంటే అన్ని రకాల పాత్రలు చేయాలన్నది కీర్తి అభిప్రాయం. అందుకే ‘సర్కారువారి పాట’లో కళావతి పాత్ర అంగీకరించిది.

Is SVP result help to Keerthy Suresh?
Author
Hyderabad, First Published May 21, 2022, 10:28 AM IST


మహానటి సినిమా తర్వాత మళ్ళీ కీర్తిసురేష్ కెరీర్ లో చెప్పుకోదగిన రీతిలో  ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. అంతేకాదు, తనని కూడా ఐరెన్ లెగ్ అంటూ కామెంట్ చేశారని మొన్నా మధ్య స్వయంగా కీర్తి చెప్పుకొచ్చింది. అయితే, తాజాగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారి పాట సినిమా మీద ఎన్నో ఆశలు  అయితే ఈ సినిమా ద్వారా ఆమె ఆశలు కొంతవరకూ అయినా తీరాయా?

కీర్తి సురేష్ కెరీర్ మహానటి ముందు తర్వాత అన్నట్లుగా ఉంది. మహానటి చిత్రం తర్వాత ఎక్కువగా కీర్తి సురేష్ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు, ఆఫ్ బీట్ సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అందులో ఎక్కువ శాతం ప్లాపులుగా మారాయి. దీంతో కీర్తి రూట్ మార్చాలనుకుంది. కమర్షియల్ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట డీసెంట్ సక్సెస్ సాధించింది. కానీ దాని వలన కీర్తి కెరీర్ కు పెద్దగా ఒరిగిందేమి లేదనే చెప్పాలి.

ముఖ్యంగా కీర్తి సురేశ్ అక్కడక్కడా కాస్త అతి చేసినట్టుందని..  కొన్ని చోట్ల లుక్స్ పరంగా ఆకట్టుకున్న ఆమె పాత్రకు అసలు ఇంపార్టెన్స్ లేదని మాట్లాడుకున్నారు. దాంతో కీర్తికి మహేశ్ బాబు సినిమాతో కూడా హిట్ దక్కనట్టే అని తేల్చేస్తున్నారు. ఆమె ఏ హీరోతో నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అని కూడా డిసైడ్ చేస్తున్నారు.  అలాగే ఇందులో కీర్తి పాత్రపై  డివైడ్ టాక్ వచ్చింది. సూపర్ స్టార్ తో ఆమె కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినా దర్శకుడు ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానంపై విమర్శలు వచ్చాయి.  

కీర్తి సురేష్ మాట్లాడుతూ... కళావతి కూడా చాలెంజింగ్‌ రోలే. ఈ పాత్రలో ఫన్‌ ఉంది. నా దృష్టిలో ఏడిపించడం, నవ్వించడం చాలా కష్టం. ఈ రెండూ పెద్ద సవాల్‌. పైగా డైలాగ్‌ డెలివరీ డిఫరెంట్‌గా ఉంటుంది. పరశురాంగారి హెల్ప్‌తో డబ్బింగ్‌ చెప్పాను. ఏ పాత్ర సవాల్‌ దానికి ఉంటుంది. ‘మహానటి’ సవాల్‌ ‘మహానటి’ది.. కళావతి సవాల్‌ కళావతిది. అంతే.. సినిమాలో మా ఇద్దరి  కెమిస్ట్రీ బాగా కుదిరింది. కథతో పాటు ఈ ట్రాక్‌ ఉంటుంది. ఇలా లవ్‌ ట్రాక్‌ చేయడం నాకు ఫ్రెష్‌గా అనిపించింది అని చెప్పుకొచ్చింది. 

ఇక కీర్తి సురేష్ తర్వాతి తెలుగు సినిమాలో హీరోయిన్ గా చేయటం లేదు. చిరంజీవి భోళా శంకర్ లో ఆయనకు చెల్లెలి పాత్రలో కనిపించనుంది. ‘పెద్దన్న’లో రజనీకాంత్‌ చెల్లెలిగా, ఇప్పుడు ‘బోళా శంకర్‌’లో చిరంజీవి చెల్లెలిగా చేస్తున్నాను. చెల్లెలి పాత్రలు చేస్తే అలాంటివే వస్తాయేమో అనే టెన్షన్‌ లేదు.  భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు వస్తాయో ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి పాత్రలు వదులుకోవడం సరి కాదనిపించింది. పైగా రజనీ సార్‌తో చాన్స్‌ దొరకడం కష్టం. అలాగే చిరంజీవి సార్‌తో. ఈ  పాత్రలను ఇష్టపడి చేశాను అంటున్నారామె.
 

Follow Us:
Download App:
  • android
  • ios