- Home
- Entertainment
- Keerthy Suresh Latest Pics : కుర్తాతో అట్రాక్ట్ చేస్తున్న కీర్తి సురేష్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
Keerthy Suresh Latest Pics : కుర్తాతో అట్రాక్ట్ చేస్తున్న కీర్తి సురేష్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) లేటెస్ట్ అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేస్తోంది. వెల్వెట్ కుర్తాలో తన అందం రెండింతలైంది. కీర్తి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అందం, అభినయంలో కీర్తి సురేష్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ నే తెచ్చుకుంది. ‘మహానటి’ మూవీ తర్వాత కీర్తి సురేష్ కు వచ్చిన ఫేం అంతా ఇంతా కాదు. ఆ పాపులారిటీతోనే స్టార్ హీరోయిన్ గా కేరీర్ లో దూసుకుపోతోంది.
అయితే ఆ తర్వాత కీర్తి నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. కానీ స్టార్ హీరోల ఫేమ్ తో పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కీర్తి సురేష్ నటించిన సినిమాలు హిట్ కావు అనే టాక్ ఉండిపోయింది. నిజానికి తను ఇటీవల ఎం చేసినా ఎదురుదెబ్బే అవుతోంది.
ఇటీవల తను నటించిన ‘గాంధారి’ మ్యూజిక్ వీడియో సాంగ్ పైనా కూడా నెగెటివ్ టాక్ వచ్చింది. స్టార్ హీరోల సరసన నటిస్తున్న తరుణంలో కీర్తి సురేష్ ఇలాంటి చిన్న వాటిల్లో నటించడం సరికాదంటూ నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సరసన ‘సర్కారు వారి పాట’ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పరుశురామ్ పెట్ల డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే కీర్తిపై వస్తున్న నెగటివ్ టాక్ సినిమాపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.
ఏదేమైనా కీర్తి మాత్రం అటు సినిమాలు చేస్తూ.. ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో గతం కంటే చాలా మెరుగ్గా కనిపిస్తోంది. కొద్దికాలంగా తన లుక్ మార్చుకుంటూ వస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పసుపు రంగు సల్వార్ సూట్‌లో, కీర్తి సురేష్ అద్భుతంగా కనిపిస్తుంది. వెల్వెట్ కుర్తాతో ఫుల్ స్లీవ్‌లో మతిపోగొడుతోంది. అట్రాక్టివ్ జూవెల్లరీ, పోనీ టెయిల్ తో పిచ్చెక్కిస్తోంది. చాలా ప్రశాంతమైన లుక్ లో కనిపిస్తోంది కీర్తి సురేష్. మొత్తంగా తన అలంకరణతో నెటిజన్లను ఖుషీ చేస్తోంది.