Mahesh babu-Keerthy Suresh: కీర్తి కి మహేష్ బ్రేక్ ఇస్తాడో... లేక ఆమె ఆయనకు షాక్ ఇస్తుందో?
పరిశ్రమలో సెంటిమెంట్స్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. హిట్ కొట్టిన వాళ్లకే దర్శక నిర్మాతలు ప్రాధాన్యత ఇస్తారు. అయితే వరుస ప్లాప్స్ లో ఉన్నప్పటికీ కీర్తి సురేష్ కి బంపర్ ఆఫర్ దక్కింది.
మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh)ఇమేజ్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ సినిమా ఇచ్చిన మైలేజ్ తో కీర్తి మూడు నాలుగేళ్లుగా నెట్టుకొస్తోంది. మహానటి 2018లో విడుదల కాగా... తెలుగులో ఆ రేంజ్ హిట్ ఆమెకు మరలా దక్కలేదు. అలాగే వరుస పరాజయాల ఎదుర్కొంటున్నారు. కీర్తి హీరోయిన్ గా విడుదలైన పెంగ్విన్, మిస్ ఇండియా, రంగ్ దే, గుడ్ లక్ సఖి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నప్పటికీ అసలు ఫార్మ్ లో లేదు. ఈ క్రమంలో కీర్తికి ఓ సాలిడ్ కమర్షియల్ హిట్ కావాలి.
అది ఒక్క మహేష్ (Mahesh Babu)ద్వారానే సాధ్యం. మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట మే 12న విడుదలవుతుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో కీర్తి ఖాతాలోకి మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ వచ్చి చేరతాయి. సర్కారు వారి పాట మూవీపై పూర్తి పాజిటివ్ బజ్ నడుస్తుంది. కాబట్టి సర్కారు వారి పాట చిత్రంతో మహేష్ ఆమెకు బ్రేక్ ఇచ్చే సూచనలు కలవు.
అదే సమయంలో మహేష్ ఫ్యాన్స్ ని మరో భయం వెంటాడుతుంది. వరుస విజయాలతో ఊపుమీదున్న మహేష్ కి కీర్తి సురేష్ కారణంగా ప్లాప్ పడితే పరిస్థితి ఏమిటంటూ ఆందోళన చెందుతున్నారు. ప్లాప్స్ లో ఉన్న కీర్తి తన సెంటిమెంట్ కొనసాగిస్తూ మహేష్ కి కూడా ప్లాప్ ఇస్తుందేమోనని కంగారు పడుతున్నారు. దానికి తోడు స్టార్ హీరోలలో ఆమె నటించిన చిత్రాలేవీ విజయం అందుకోలేదు. పవన్ కి జంటగా కీర్తి సురేష్ నటించిన అజ్ఞాతవాసి రిజల్ట్ మనకు తెలిసిందే. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో అది ఒకటిగా ఉంది.
ఈ క్రమంలో మహేష్ హిట్స్ సెంటిమెంట్ బలమైనదైతే కీర్తి ఫ్లాప్ సెంటిమెంట్ ని అధిగమించి సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)హిట్ అవుతుంది. లేదంటే కీర్తి సురేష్ ఫ్లాప్ సెంటిమెంట్ కి మహేష్ బలికావాల్సి వస్తుంది. దర్శకుడు పరుశురాం మాత్రం సర్కారు వారి పాట విజయంపై ధీమాగా ఉన్నారు. ఆయన కెరీర్ కి కూడా ఈ సినిమా చాలా అవసరం. గతంలో ఆయన తెరకెక్కించిన కమర్షియల్ చిత్రాలేవీ విజయం సాధించలేదు. రొమాంటిక్ జోనర్ లో తెరకెక్కిన సోలో, గీతగోవిందం మాత్రమే విజయం సాధించాయి. ఆయనకు కూడా ఈ మూవీ పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి.