- Home
- Entertainment
- Keerthy Suresh : స్టైలిష్ అవుట్ ఫిట్ లో మెస్మరైజ్ చేస్తున్న కీర్తి.. స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రాళ్లు ఫిదా..
Keerthy Suresh : స్టైలిష్ అవుట్ ఫిట్ లో మెస్మరైజ్ చేస్తున్న కీర్తి.. స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రాళ్లు ఫిదా..
హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) వరుస తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ కేరీర్ లో దూసుకెళ్తోంది. మరోవైపు తన పాపులారిటీని మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియాలోనూ లేటెస్ట్ ఫొటోషూట్లతో హల్ చల్ చేస్తోంది.

తమళ హీరోయిన్ కీర్తి సురేశ్ సినీ రంగ ప్రవేశం 22 ఏండ్లు కిందనే పూర్తి చేసుకుంది. తొలుత మలయాళ చిత్రం ‘పైలట్స్’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తర్వాత కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గానే పలు సినిమాల్లో నటించింది.
హీరోయిన్ గా మలయాళ చిత్రం ‘గీతాంజలి’తో పరిచయం అయ్యింది. తన అందానికి అభినయం కూడా తోడవటంతో ఈ బ్యూటీకి అతి తక్కువ సమయంలోనే గుర్తింపు వచ్చింది. టాలీవుడ్ కు ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) సరసన ‘నేను శైలజా..’ చిత్రంలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
నేను శైలజా.. తర్వాత 2018లో వచ్చిన ‘మహానటి’ చిత్రం కీర్తి సురేష్ కు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. జాతీయ స్థాయిలో బెస్ట్ హీరోయిన్ గా అవార్డులను అందుకుంది. ఆ తర్వాత కీర్తి సురేష్ కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో ఏకంగా స్టార్ హీరోయిన్లతో పోటీ పడిందీ బ్యూటీ.
మహానటి చిత్ర సమయంలో ఎంత బిజీగా ఉందో ప్రస్తుతం తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది కీర్తి సురేష్. బ్రేక్ లేకుండా షూటింగ్ లకు హాజరవుతూ బిజీయేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది.
ప్రస్తుతం తను నటించిన చిత్రాలులు ఒక్కొక్కటిగా రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahes Babu)తో కలిసి నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తై రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే తమిళ చిత్రం ‘సాని కాయిదం’ కూడా పూర్తి చేసింది కీర్తి.
తన చిత్రాలను ప్రమోట్ చేసుకునేందుకు కీర్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది. ఈ సందర్భంగా వరుస లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా స్టైలిష్ సూట్ లో ఫొటోలకు ఫోజులిచ్చి మెస్మరైజ్ చేస్తోంది. గ్లామర్ బ్యూటీ స్టైల్ కు అభిమానులు ఖుషీ అవుతున్నారు. తన పిక్స్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు.