Russia Ukraine Crisis: ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఐక్యరాజ్యసమితిలోని ఉక్రెయిన్ రాయబారి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో "యుద్ధాన్ని ఆపండి" అని యూఎన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. 

Russia Ukraine Crisis: ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఐక్యరాజ్యసమితిలోని ఉక్రెయిన్ రాయబారి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో "యుద్ధాన్ని ఆపండి" అని యూఎన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.“యుద్ధాన్ని ఆపడం ఈ సంస్థ బాధ్యత. కాబట్టి యుద్ధాన్ని ఆపడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేయాలని నేను మీలో ప్రతి ఒక్కరినీ కోరుతున్నారు” అని భద్రతా మండలి సమావేశంలో ఉక్రేనియన్ రాయబారి సెర్గీ కిస్లిత్స్య (Sergiy Kyslytsya) కోరారు. అత్యవసర సమావేశంలోSergiy Kyslytsya మాట్లాడుతూ.. ఇది తీవ్రతరం కావడానికి స‌మ‌యం ఉంది. కాబ‌ట్టి సంఘర్షణను ఆపడానికి ఇతర దేశాలలు సాయం చేయాల‌ని ఆయ‌న కోరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా దీనిని ధృవీక‌రించారు. ఉక్రేనియన్ నగరాలు ఎమ‌ర్జెన్సీ విధించ‌బ‌డింది అని తెలిపారు. 

“పుతిన్ ఇప్పుడే ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించాడు. శాంతియుతమైన ఉక్రేనియన్ నగరాలు ఎమ‌ర్జెన్సీలోకి వెళ్లాయి. ఇది దురాక్రమణ యుద్ధం. ఉక్రెయిన్ తనను తాను రక్షించుకుంటుంది.. ఈ పోరులో గెలుస్తుంది. ప్రపంచం పుతిన్‌ను ఆపగలదు.. ఆ ప‌నిచేయాలి. ఇప్పుడు యాక్ష‌న్ తీసుకునే స‌మ‌యం వచ్చింది' అని కులేబా ట్వీట్ చేశారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ను రక్షించడానికి పుతిన్ ప్రత్యేక "మిలిటరీ ఆపరేషన్" ప్రకటించిన వెంటనే ఈ ట్వీట్ వచ్చింది. డాన్‌బాస్ ప్రాంతంలో సైనిక చర్య తీసుకోవాలనే రష్యా నిర్ణయాన్ని సమర్థిస్తూ, యుఎన్‌లోని రష్యా రాయబారి వాసిలీ అలెక్సీవిచ్ నెబెంజియా "ఉక్రెయిన్ చుట్టూ ఉన్న నేటి సంక్షోభానికి మూలం ఉక్రెయిన్ చర్యలే" అని అన్నారు. "ఉక్రెయిన్ చుట్టూ నేటి సంక్షోభానికి మూలం ఉక్రెయిన్ చర్యలు, అనేక సంవత్సరాలుగా (మిన్స్క్ ఒప్పందం) కింద దాని బాధ్యతలను విధ్వంసం చేస్తున్నాయి" అని నెబెంజియా అన్నారు.

రష్యా ఆపరేషన్ తూర్పు ఉక్రెయిన్‌లోని నివాసితులను రక్షించే లక్ష్యంతో ఉందని నెబెంజియా చెప్పారు.
ఉక్రెయిన్‌పై రష్యా ప్రేరేపిత మరియు అన్యాయమైన దాడిగా పేర్కొంటూ దీనిని ఖండిస్తూ, యూఎస్‌ ప్రెసిడెంట్ జో బిడెన్ ముందస్తు ప్రణాళికతో జరిగిన యుద్ధం విపత్తు ప్రాణనష్టాన్ని తెస్తుందని అన్నారు. “రష్యన్ సైనిక బలగాలచే రెచ్చగొట్టబడని.. అన్యాయమైన దాడికి గురవుతున్న ఉక్రెయిన్ ప్రజల కోసం మొత్తం ప్రపంచం ప్రార్థనలు ఈ రాత్రికి ఉన్నాయి. అధ్యక్షుడు పుతిన్ ముందస్తు ప్రణాళికతో యుద్ధాన్ని ఎంచుకున్నారు. ఇది విపత్తు ప్రాణ నష్టం మరియు మానవ బాధలను తీసుకువ‌స్తుంది”అని బిడెన్ పేర్కొన్నారు. యూఎస్, దాని మిత్రదేశాలు, భాగస్వాములు ఐక్యంగా మరియు నిర్ణయాత్మక మార్గంలో ప్రతిస్పందిస్తాయని నొక్కిచెప్పిన బిడెన్, ఈ దాడి తీసుకువచ్చే మరణాల‌కు మరియు విధ్వంసానికి రష్యా మాత్రమే కారణమని అన్నారు. 

ఇదిలావుండగా, ఐక్యరాజ్య సమితి భద్రతామండలి మరోసారి అత్యవసరంగా సమావేశమైంది. సైనిక మోహరింపు, తదితర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ సాగింది. యుద్ధ పరిణామాలు ఉక్రెయిన్‌కు వినాశకరమ‌నీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా దూరం అవుతాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. మానవత దృపథంతో యుద్ధాన్ని ఆపాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చివరి నిమిషంలో విజ్ఞప్తి చేశారు.