బ్రెంట్ క్రూడ్ ధరలు మొదటిసారి 100 డాలర్లకు పెరిగాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనిక చర్యను ప్రకటించిన తర్వాత ముడి చమురు ధరలు ఎగిశాయి. గురువారం బ్రెంట్ క్రూడ్ ధర తొలిసారిగా బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదురుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడంతో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలగా, మరోవైపు ముడిచమురు ధరలు కూడా ఒక్కసరిగా ఎగిశాయి. గురువారం బ్రెంట్ క్రూడ్ ధర తొలిసారిగా బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. 8 ఏళ్లలో బ్రెంట్ క్రూడ్ ధర తొలిసారిగా ఈ రికార్డు స్థాయికి చేరుకుంది.
ఆసియా ట్రేడ్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 101.34 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది, ఈ పెరుగుదల సెప్టెంబర్ 2014 నుండి అత్యధికం. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 4.22 డాలర్లు లేదా 4.6 శాతం పెరిగి బ్యారెల్ 96.51 డాలర్లకి చేరుకుంది. ఒక నివేదిక ప్రకారం ఈ పెంపు ఆగస్టు 2014 తర్వాత అత్యధికం.
రష్యా అధ్యక్షుడి బెదిరింపు
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. ఉక్రెయిన్ వెనక్కి తగ్గకుంటే యుద్ధం తప్పదని హెచ్చరించారు. మధ్యలో మరేదైనా దేశం వస్తే దానిపై కూడా ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ అన్నారు.
పుతిన్ యుద్ధ ప్రకటన ఇంధన ఎగుమతులకు అంతరాయం కలిగిస్తుందనే భయాలను పెంచింది. రష్యా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారి కావడం గమనార్హం. ఇది ప్రధానంగా యూరోపియన్ రిఫైనరీలకు ముడి చమురును విక్రయిస్తుంది. ఐరోపా దేశాలు చమురులో 20 శాతానికి పైగా రష్యా నుంచి తీసుకుంటున్నాయి. అదనంగా, రష్యా ప్రపంచ ఉత్పత్తిలో రాగిలో 10 శాతం, అల్యూమినియంలో 10 శాతం ఉత్పత్తి చేస్తుంది.
చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావితం
రష్యా న్యాచురల్ గ్యాస్ అతిపెద్ద సరఫరాదారి అలాగే ముడి చమురు ఉత్పత్తిలో గణనీయమైన వాటా కలిగి ఉంది. ఒక నివేదిక ప్రకారం, రష్యా ప్రపంచ డిమాండ్‌లో 10 శాతం ఉత్పత్తి చేస్తుంది. రెండు దేశాల మధ్య యుద్దం ప్రారంభం కావడం వల్ల ముడి చమురు, సహజవాయువు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడి ఇంధన ధరలు మరింత మండిపోవడం ఖాయం. ఐరోపాలో 40 శాతం కంటే ఎక్కువగా గ్యాస్ రష్యా నుండి వస్తుంది. దీని ప్రభావం సామాన్యులపై ప్రత్యక్షంగా పడనుంది.
సరఫరా చేయకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతుంది
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదిరితే ముడి ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల నుండి 120 డాలర్ల వరకు చేరవచ్చని ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. న్యాచురల్ గ్యాస్ సరఫరాపై కూడా చెడు ప్రభావం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అంతరాయం కారణంగా దేశాలు విద్యుత్ ఉత్పత్తిని భారీగా తగ్గించవలసి ఉంటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు ధరలు ఆకాశాన్నంటాయని, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం భారత్‌లోనూ కనిపించనుంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం వల్ల చమురు ధరలు మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.
