రష్యా, ఉక్రెయిన్ మధ్య మిలటరీ దాడి గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ పై ఆయన స్పందించారు. రష్యా దాడి నుండి తమను తాము రక్షించుకొంటామని ఉక్రెయిన్ తెలిపింది.
కీవో: Russia దాడి నుండి తమను తాము రక్షించుకొంటామని Ukraine అధ్యక్షుడు Zelensky ప్రకటించారు.ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించినట్టుగా ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ Putin ప్రకటించిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. రష్యా దాడి చేస్తే వారు మన స్వేచ్ఛను, మన జీవితాలను, మన పిల్లల జీవితాలను రక్షించుకొంటామని జెలెన్ స్కీ ప్రకటించారు. మీరు దాడి చేస్తున్న సమయంలో మీరు మా ముఖాలను చూస్తారు మా వెనుక వైపు కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు.
రష్యా ఏ రోజైనా ఐరోపాలో పెద్ద యుద్ధం ప్రారంభించవచ్చని జెలెన్ స్కీ హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాలని రష్యన్లను ఆయన కోరారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు విఫలమైనట్టుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు.తాను రష్యా అధ్యక్షుడితో Telephone లో చర్చలు ప్రారంభించినా కూడా ఫలితం లేదని ఆయన చెప్పారు. అవతలి వైపు నుండి నిశ్శబ్దం మాత్రమే ఉందని జెలెన్ స్కీ చెప్పారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆయన కోరారు. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దన్నారు. సైన్యం తన పని తాను చేసుకొంటూ పోతోందన్నారు.రష్యా దాడులను తిప్పి కొడుతామని చెప్పారు. అంతేకాదు రష్యా దాడులను తిప్పికొడుతామని కూడా ఉక్రెయిన్ ప్రకటించింది. యుద్ధంలో రష్యాపై విజయం సాధిస్తామని కూడా ఉక్రెయిన్ ధీమాను వ్యక్తం చేసింది.
ఉక్రెయిన్ ప్రభుత్వం తమ దేశంలోని తూర్పు ప్రాంతంలోని మిమానాశ్రయాలను అర్ధరాత్రి 7 గంటల నుండి మూసివేసింది. ఉక్రెయిన్ అభ్యర్ధన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఉక్రెయిన్ పై రష్యా దాడిని అన్యాయమైన దాడిగా అమెరికా అధ్యక్షుడు Joe Biden అభిప్రాయపడ్డారుఉక్రెయిన్ మిలటరీ ఆపరేషన్ కు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా తేల్చి చెప్పింది. రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ కు నాటో దళాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి.
ఉక్రెయిన్ పై తమ మిలటరీ చర్య విషయంలో ఇతరుల జోక్యాన్ని తాము సహించబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. జోక్యం చేసుకొన్న దేశాలు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పుతిన్ హెచ్చరించారు.
దీంతో ఉక్రయిన్ లో అత్యవసర పరిస్థతిని విధించారు. తమ ఎయిర్ స్పేస్ ను ఉక్రెయిన్ మూసివేసింది. ఉక్రెయిన్ లో ఖార్కిస్, ఒడెస్సా, పోల్ లో మిస్సైల్స్ తో దాడులు చోటు చేసుకొన్నాయి. డోస్‌బాస్ లో ఉక్రెయిన్ బలగాలను వెనక్కి వెళ్లిపోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.
ఇదిలా ఉంటే ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని చైనా ప్రకటించింది. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని చైనా కోరింది.ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో గురువారం నాడు దేశ ప్రజలనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించనున్నారు. ఈ దాడితో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడింది.తూర్పు ఉక్రెయిన్ లో తిరుగుబాటు నాయకులు కైవ్ పై సైనిక సహాయం కోసం మాస్కోను కోరినట్టుగా క్రెమ్లిన్ ప్రకటించిన తర్వాత మిలటరీ ఆపరేషన్ ప్రారంభమైందని పుతిన్ ప్రకటించారు.
