రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని  ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి కోరారు.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్, Russia మధ్య శతృత్వాన్ని తగ్గించకపోతే ఈ ప్రాంతం తీవ్రంగా అస్థిరపరిచే పెను సంక్షోభంగా మారనుందని ఇండియా అభిప్రాయపడింది.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై మిలటరీ చర్య ప్రారంభమైందని ప్రకటించిన విషయం తెలిసిందే. 

UNOలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ TS Tirumurti ఈ విషయమై స్పందించారు. ఈ పరిణామాలను చూస్తే పరిస్థితి పెను సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

Ukraine అత్యవసరంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం నిర్వహించాలని అభ్యర్ధించిన విషయం తెలిసిందే.

ఉక్రెయిన్, రష్యాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని India కోరింది. అంతేకాదు పరిస్థితి మరింత దిగజారకుండా చర్యలు తీసుకోవాలని తిరుమూర్తి కోరారు. చట్టబద్దమైన భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.

తూర్పు ఉక్రెయిన్ లోని డాన్ బాస్ ప్రాంతంలో విడిపోయిన రెండు ప్రాంతాలకే రష్యా చర్యలు పరిమితమయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ రెండు ప్రాంతాలకే రష్యా దళాలు పరిమితమయ్యే అవకాశం ఉందని ఉక్రెయిన్ విశ్వసించడం లేదు.

సంయమనం పాటించడం ద్వాార ఇరు పక్షాలు శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని తిరుమూర్తి నొక్కి చెప్పారు. దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులు తిరిగి స్వదేశానికి రావడానికి భారత్ సహాయం చేస్తోందని ఆయన ప్రకటించారు.

ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ప్రారంభమైందని ప్రకటించిన తర్వాత తూర్పు ఉక్రెయిన్ తో పాటు కైవ్ , మారియుపోల్ లో గురువారం నాడు తెల్లవారుజామున భారీ ఎత్తున పేలుళ్లు చోటు చేసుకొన్నాయని స్థానిక మీడియా ప్రకటించింది. 

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెంక్సీ రష్యా మిలటరీ యాక్షన్ పై స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. ఐరోపాలో పెద్ద యుద్ధానికి మద్దతు ఇవ్వవద్దని రష్యన్లకు అర్ధరాత్రి ఉద్వేగభరితంగా కోరారు.ఉక్రెయిన్ గురించి రష్యా ప్రజలకు అబద్దాలు చెబుతున్నారని ఆయన చెప్పారు. తాను పుతిన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించానని చెప్పారు. అయితే సమాధానం లేదన్నారు. నిశ్శబ్దం మాత్రమే అని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్ సరిహద్దుల దగ్గర 2 లక్షల మంది సైనికులు ఉన్నారని ఆయన వివరించారు. 

 ఉక్రెయిన్ ప్రభుత్వం తమ దేశంలోని తూర్పు ప్రాంతంలోని మిమానాశ్రయాలను అర్ధరాత్రి 7 గంటల నుండి మూసివేసింది. ఉక్రెయిన్ అభ్యర్ధన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది. 

ఉక్రెయిన్ పై రష్యా దాడిని అన్యాయమైన దాడిగా అమెరికా అధ్యక్షుడు Joe Biden అభిప్రాయపడ్డారుఉక్రెయిన్ మిలటరీ ఆపరేషన్ కు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా తేల్చి చెప్పింది. రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ కు నాటో దళాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి.

ఉక్రెయిన్ పై తమ మిలటరీ చర్య విషయంలో ఇతరుల జోక్యాన్ని తాము సహించబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. జోక్యం చేసుకొన్న దేశాలు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పుతిన్ హెచ్చరించారు.