Russia Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో తైవాన్ భయాందోళనకు గురవుతోంది. తమ దేశాన్ని చైనా ఆక్రమిస్తుందా అనే ఆందోళనలో ఉంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ తరహాలో తైవాన్‌పైనా కొన్ని విదేశీ శక్తులు కన్నేసి ఉంచాయన్న తైవాన్ అధ్యక్షుడు సంచలన ఆరోపించారు.
Russia Ukraine Crisis: ప్రపంచ దేశాలు భయపడినట్టే.. రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైపోయింది. రష్యా వ్యూహాత్మకంగా ఉక్రెయిన్‌పై ముప్పేట దాడికి దిగింది. తూర్పు ఉక్రెయిన్‌పై యుద్దం ప్రారంభించినట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని రష్యా హెచ్చరించారు. ఆపరేషన్‌లో జోక్యం చేసుకునేవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని పరోక్షంగా అమెరికా సహా నాటో దేశాలకు పుతిన్ హెచ్చరించారు.
ఈ సైనిక దాడుల్లో భాగంగా.. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకుని.. రష్యా దాడి చేస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్ కేపిటల్ కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల దాడి చేస్తుంది. ఈ తరుణంలో కీవ్ ఎయిర్‌పోర్ట్‌ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నారయి. మిలటరీ ఆపరేషన్‌కు దిగిన కొద్దిగంటల్లోనే ఉక్రెయిన్ కేపిటల్ కీవ్‌ను రష్యా బలగాలు ఆక్రమించాయి. ఉక్రెయిన్‌ను నాలుదిక్కుల చుట్టుముట్టి బాంబుల దాడి చేస్తుంది. ఈ తరుణంలో గంటకో నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఈ తరుణంలో తైవాన్ ఆందోళన చెందుతోంది. తమ దేశాన్ని చైనా ఆక్రమిస్తుందా అనే భయాందోళనలో ఉంది. ఈ తరుణంలో తైవాన్ అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్ వెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తరహాలో తైవాన్‌పైనా కొన్ని విదేశీ శక్తులు కన్నేసి ఉంచాయన్న తైవాన్ అధ్యక్షుడు ఆరోపించారు.
తైవాన్‌పై బీజింగ్ పాలకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారనీ, ఈ ఏడాది తైవాన్‌కు వ్యతిరేకంగా చైనా చాలా దుందుడుకు సైనికవిన్యాసాలకు పాల్పడిందని అన్నారు. గత ఏడాది కాలంగా దాదాపు 150కి పైగా చైనా యుద్ధవిమానాలు తైవాన్ గగన రక్షణ పరిధిలోకి చొరబడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.
గత నాలుగు దశాబ్దాలుగా చైనా నుంచి తైవాన్ కఠినమైన సవాల్ ను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.
తైవాన్ వ్యాఖ్యలను చైనాను పూర్తిగా ఖండించింది. రష్యా- ఉక్రెయిన్ సంక్షోభాన్ని తైవాన్‌తో పోల్చడం సరికాదనీ, ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉందనీ, తైవాన్ ఎప్పటికీ చైనా భూభాగంలో అంతర్గమని మరోసారి పునరుద్ఘాటించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తైవాన్ ఎప్పటికీ ఉక్రెయిన్ కాదని, చైనా అంతర్భాగమేనని అన్నారు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఉక్రెయిన్, తైవాన్‌ను పోల్చడం అంటే.. తైవాన్ సమస్య విషయంలో కనీస ప్రాథమిక అవగాహన లేదనే అనుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాల్లో రాజీ పడబోమని, అవసరమైతే సైన్యాన్ని వినియోగించైనా అంతర్భాగం చేసుకోవడానికి చైనా వెనుకాడబోదని పేర్కొన్నారు.
అలాగే, రష్యా- ఉక్రెయిన్ యుద్దానికి ప్రధానం కారణం అమెరికానే అని చైనా ఆరోపించింది. రెండు దేశాల మధ్య అమెరికా ఉద్రిక్తతలను పెంచుతోందని, భయాందోళనలను సృష్టిస్తోందని ఆరోపించారు. రష్యా ఆర్థిక సంస్థలపై అమెరికా ఆంక్షలను విధించిందనీ, మరో వైపు.. ఉక్రెయిన్‌కు అమెరికానే ఆయుధాలను అందించి.. ఉద్రిక్తతలు మరింత పెంచుతోందని విమర్శించారు.
ఈ నేపథ్యం తైవాన్ మరింత ఆందోళన చెందుతోంది. అంతర్జాతీయ సప్లయ్ ఛైన్ పరంగా తైవాన్, ఉక్రెయిన్ ప్రాథమికంగా భిన్నమైంది. ఉక్రెయిన్‌లో పరిస్థితులు తారుమారు చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయనీ,ఇదే తరహాలో తైవాన్‌ను దెబ్బతీసేందుకు విదేశీ శక్తులు యత్నిస్తున్నాయంటూ చైనా పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అన్ని ప్రభుత్వ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
