హైదరాబాద్: దిశ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో కీలక ఆధారమైన సెల్‌ఫోన్‌ను సిట్ బృందం స్వాధీనం చేసుకొంది. దిశ సెల్‌ఫోన్ ను నిందితులు పాతి పెట్టినట్టుగా సిట్ బృందం విచారణలో ఒప్పుకొన్నారు.

Also read:Justice For Disha:సీల్డ్ కవర్లో కోర్టుకు కీలక ఆధారాలు

ఈ ఏడాది నవంబర్ 27వ తేదీన దిశను నిందితులు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. నిందితులను  సిట్ బృందం  ఈ నెల 4వ తేదీన  రాత్రి తమ కస్టడీలోకి తీసుకొంది. ఈ హత్య కేసు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసినట్టుగా సమాచారం.

Also readJustice for Disha: పోలీస్ కస్టడీకి దిశ హత్య కేసు నిందితులు

ఈ హత్య పట్ట దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో నిందితులతో పగటిపూట సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తే ఇబ్బందులు వస్తాయనే కారణంగా పోలీసులు నిందితులను రాత్రి పూటే సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసినట్టుగా తెలుస్తోంది.

Also read:justice for Disha:జైలులో ఆ నలుగురిపై నిఘా

దిశ ఉపయోగించిన సెల్‌పోన్‌ను నిందితులు ఓ చోట పాతిపెట్టినట్టుగా నిందితులు పోలీసుల విచారణలో తేల్చి చెప్పారు. పోలీసుల విచారణలో  ఒప్పుకొన్నారు. తొండుపల్లి, చటాన్‌పల్లి ప్రాంతంలో నిందితులతో కలిసి సీన్ రీ‌ కన్‌స్ట్రక్షన్ చేసినట్టుగా సమాచారం. దిశ సెల్‌ఫోన్‌ను పాతిపెట్టిన స్థలాన్ని నిందితులు పోలీసులకు చూపించారు.

Also readJustice for Disha: పోలీస్ కస్టడీకి దిశ హత్య కేసు నిందితులు

నిందితులు చూపిన స్థలంలో పోలీసులు తవ్వి సెల్‌పోన్‌ను .స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఫోన్ లభ్యం కావడంతో పోలీసులు ఈ కేసులో మరింత పురోగతిని సాధించినట్టైంది. మరో ఆరు రోజుల పాటు నిందితులను పోలీసులు విచారించే  అవకాశం ఉంది.