Asianet News TeluguAsianet News Telugu

Disha Case: మంచి పని చేస్తే ప్రజలు అభినందిస్తారు.... ఎన్ కౌంటర్ పై పోలీసుల స్పందన

ఈ ఎన్ కౌంటర్ ని వెనక ఉండి నడిపించింది సీపీ సజ్జనార్. అందుకే.. ఆయనపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తొలుత నిందితులను జైల్లో పెట్టి మేపుతున్నారని ఆరోపించినవాళ్లే... ఇప్పుడు పోలీసులు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై పోలీస్.. జై జై పోలీసు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

police response over netizens reaction on encounter of disha case
Author
Hyderabad, First Published Dec 6, 2019, 10:21 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామను ఎన్ కౌంటర్ చేశారు. గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

వీరి ఎన్‌కౌంటర్ తో ‘దిశ’కు ఆత్మశాంతి లభించిందని పలువురు మహిళా నేతలు వ్యాఖ్యానించారు. ‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.

AlsoRead Justice for disha: మా కూతుళ్ల జోలికి వస్తే... ఎన్ కౌంటర్ పై కుష్బూ షాకింగ్ కామెంట్స్...

ఈ ఎన్ కౌంటర్ ని వెనక ఉండి నడిపించింది సీపీ సజ్జనార్.  అందుకే.. ఆయనపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తొలుత నిందితులను జైల్లో పెట్టి మేపుతున్నారని ఆరోపించినవాళ్లే... ఇప్పుడు పోలీసులు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై పోలీస్.. జై జై పోలీసు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సీపీ సజ్జనార్ ని ట్యాగ్ చేస్తూ... ఈ ఎన్ కౌంటర్ తో సమాజంలో కీచకుల దాడికి బలైన వారికి సత్వర న్యాయం చేస్తారన్న భరోసా ఇచ్చారు అంటూ కొందరు కామెంట్స్ చేయగా... రిలయ్ లైఫ్ సింగం సజ్జనార్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

AlsoRead ‘దిశ’ను ఎక్కడైతే సజీవదహనం చేశారో.... అదే స్థలంలో.....

కాగా... ప్రజల స్పందనపై పోలీసులు స్పందించారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా తప్పించుకునేందుకు నిందితులు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని పోలీసులు చెప్పారు. మంచిపని చేసినప్పుడు ప్రజలు హర్షిస్తారన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios