Disha Case Accused Encounter: పోలీసుల కాళ్లు మొక్కాలనుంది.. మంచు మనోజ్

దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. 

justice for disha: manchu manoj emotional post

గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంతకిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. 

అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు.

దిశ హత్య కేసు... ఎన్ కౌంటర్ జరిగిన స్థలానికి సీపీ సజ్జనార్

పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. సంఘటన స్థలంలోనే కరడుకట్టిన కామాంధులైన ఆరిఫ్, శివ, నవీన్,  చెన్నకేశవులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన సంచలనం రేపింది. 

‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.

ఈ నేపధ్యంలో సినీ సెలబ్రిటీలు,మహిళా నేతలు, రాజకీయ నాయకులు దిశకు ఆత్మశాంతి లభించిందని వ్యాఖ్యానించారు. నటుడు మంచు మనోజ్ ''ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది.. ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది.. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది..నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు వుందా..?? ఈ రోజే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..'' అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios